ఎస్సీ వర్గీకరణ పేరుతో బీజేపీ చిచ్చు

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మాలల సమకాలీన సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై గురువారం సంగారెడ్డి అంబేద్కర్‌ భవన్‌లో మాల మహానాడు మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగిం ది. ముఖ్యఅతిథి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని, ఎస్సీ వర్గీకరణ పేరుతో కులాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందన్నారు. మాలలపై రాజకీయ పార్టీలు విషం చిమ్ముతున్నాయని, మాలలను అణగదొక్కే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మాలలను…

Read More

సర్వేపల్లిలో వైసీపీ ఖాళీ

-సోమిరెడ్డికి మద్దతుగా వెల్లువలా వలసలు -ఓటమి భయంలో మంత్రి కాకాణి సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ ఖాళీ అవుతోంది. నియోజకవర్గంలోని అన్ని మండ లాల్లో పెద్దఎత్తున ఆ పార్టీని వీడి టీడీపీ బాట పట్టారు. వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్థన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. తోటపల్లిగూడూరు మండలం వరిగొం డ బిట్‌ -2కు చెందిన 40 కుటుంబాల వారు వైసీపీని వీడి సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమక్షంలో చేరారు. చేరిన వారిలో…

Read More

ఢిల్లీ ఆదేశిస్తేనే ఈ‘సీరియస్’ అవుతుందా?

– ‘పైనుంచి’ ఆదేశాలు రావాలా? – వచ్చేంతవరకూ చర్యల కొరడా ఝళిపించరా? – కొత్తగా ముగ్గురు పరిశీలకుల రాక – ఆశలన్నీ వారిపైనే – పోలీసులపై ఇచ్చిన ఫిర్యాదులు బుట్టదాఖలేనా? – ఇన్చార్జి డీజీపీ హయాంలోనే ఎన్నికలు జరిపిస్తారా? – బెంగాల్ మాదిరి వేగం ఏదీ? – వాలంటీర్ల చేతికి పెన్షనర్ల డబ్బులా? – ఈసీ తీరుపై కూటమి కన్నెర్ర – అధికారులు భయపడుతున్నారా? – కూటమి రాదన్న అనుమానంతో ఉన్నారా? – దీనికోసమేనా కూటమిలో చేరింది?…

Read More

కేసీఆర్‌కు ఝలక్

– సొంత ఇలాకాలోనే తిరుగుబాటు – కాంగ్రెస్ ఎంపీపీ గెలుపు – అవిశ్వాసంలో ఓడిన బీఆర్‌ఎస్ – ఇది కేసీఆర్ నైతిక ఓటమి ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆయన వందరోజుల క్రితం వరకూ రారాజు. పాలన కూడా రాచరికమే. తెలంగాణ గడ్డ కేంద్రంగా దేశ రాజకీయాలను ఏకం చేయబోయిన నేత. మహారాష్ట్ర-కర్నాటక-ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా గులాబీని పరిమళింపచేయాలన్న పట్టుదలతో పనిచేసిన గులాబీదళపతి. సొంత జిల్లాలో ఏ ఒక్క పార్టీ కనిపించకుండా, రాజకీయ అశ్వమేధయాగం చేసిన రాజకీయ నేత…

Read More

నాడు బాబు వద్దు.. నేడు సీటు ముద్దు

– అనపర్తి బీజేపీ అభ్యర్ధి రాజు తీరిది – బాబు వెన్నుపోటుదారుడంటూ చేసిన ట్వీట్ ప్రచారంలోకి – ఎలా పనిచేస్తామంటున్న టీడీపీ క్యాడర్ ( అన్వేష్) ఆయన ఒకప్పుడు టీడీపీకి బద్ధ వ్యతిరేకి. అంతేనా? టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెన్నుపోటుదారుడంటూ సోషల్‌మీడియాలో ప్రచారం చేసిన బీజేపీ నాయకుడు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన పొత్తులో భాగంగా బీజేపీ సీటు దక్కించుకున్న అభ్యర్ధి. సరే ఇదంతా ఎప్పటి సందతో కదా? ఇప్పుడెందుకని సరిపెట్టుకోవచ్చు. కానీ సోషల్‌మీడియా మహా…

Read More

బహుజనుల ద్రోహి ప్రవీణ్ కుమార్

తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్.ఎస్. ప్రవీణ్‌ కుమార్ కు వ్యతిరేకంగా కొమురం భీమ్ జిల్లాలో గురువారం పోస్టర్లు వెలిశాయి. కౌటాల మండల కేంద్రంలో.. బహుజన ద్రోహి ఆర్.ఎస్. ‘గో బ్యాక్’ అంటూ కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సిర్పూరు నియోజ‌క‌ వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాల‌య్యారు. ఆ త‌ర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో చేరారు.

Read More

భుజంగ రావు, తిరుపతన్న లకు ఐదు రోజుల కస్టడీ

ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో మరికొందరు పోలీసుల అరెస్టు ? తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీ భుజంగ రావు, తిరుపతన్న లను ఐదు రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపటి నుంచి ఐదు రోజుల పాటు వారిని పోలీసులు విచారించ నున్నారు. ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. ప్రణీత్‌రావు…

Read More

ఇంట‌ర్ కాలేజీ ల‌కు సెలవులు

హైద‌రాబాద్: తెలంగాణ లోని ఇంట‌ర్ కాలేజీ ల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు సెల‌వులు ప్ర‌క‌టించింది. ఈ నెల 30వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా సెలవులు కొన‌సాగ‌ నున్నాయి. మ‌ళ్లీ జూన్ 1వ తేదీన కాలేజీలు తెరుచు కోనున్నాయి. ఈ సెల‌వులు రాష్ట్రం లోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియ‌ట్ కాలేజీల‌కు వ‌ర్తించ‌ నున్నాయి. ఇంట‌ర్ బోర్డు ఆదేశాల‌ను ఉల్లంఘించి కాలేజీ ల‌ను నిర్వ‌హించే వారిపై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి…

Read More

బాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

కదిరి నియోజకవర్గానికి చెందిన పలువురు ముస్లిం నేతలు, ఇతర సామాజిక వర్గాల నేతలు గురువారం టీడీపీలో చేరారు. వీరికి చంద్రబాబు నాయుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కదిరి పట్టణ వైసీపీ కన్వీనర్ బావుద్దీన్, కౌన్సిలర్లు కృష్ణప్ప, ఏం.ఎన్.ఫయాజ్, రంగారెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఎ.వెంకటరమణా రెడ్డి, సర్పంచ్ సి.సుధాకర్, వడ్డెర సంఘం ముఖ్య నాయకులు వల్లెపు సోమశేఖర్, పూసల సంఘం అధ్యక్షులు కుళ్లాయప్ప, నలుగురు వార్డ్ సభ్యులు, తదితరులు ఉన్నారు.

Read More

ధూళిపాళ్ల స్టిక్కర్ల సైకిల్ గుర్తింపు

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలోని ఓ రైస్ మిల్లులో గురువారం ఎన్నికల అధికారులు తెలుగుదేశం అభ్యర్థి దూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్టిక్కర్లు అంటించి ఉన్న 610 సైకిళ్లను గుర్తించారు. పొన్నూరు ఎంపీడీవో రత్నజ్యోతి సిబ్బందితో వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. తెదేపా నాయకులు సైకిళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారంపై అధికారులు విచారిస్తున్నారు.

Read More