సద్గురుకు బ్రెయిన్ సర్జరీ

ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీవాసుదేవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెదడులో బ్లీడింగ్ కావడంతో ఈ నెల 17న ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. మెదడులో తీవ్ర రక్తస్రావం వల్ల సర్జరీ తప్పనిసరైందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. ఆపరేషన్ తర్వాత ఆయన మాట్లాడిన వీడియోను షేర్ చేశారు.

Read More

ఢిల్లీ లిక్కర్ కేసులో కొత్త మలుపు

ఢిల్లీ లిక్కర్ కేసును వింటున్న రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి ఎం.కే. నాగ్ పాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జడ్జిగా కావేరీ బవేజాను నియమించారు. ఢిల్లీ హయ్యర్ జ్యూడిషియల్ సర్వీసెస్‌ లోని 27 మంది జడ్జిలను బదిలీ చేశారు. ఈ బదిలీలు వెంటనే అమల్లోకి వచ్చాయి.జడ్జి ఎం.కే. నాగ్ పాల్ బదిలీ కారణంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దాఖలైన పిటిషన్లపై విచారణ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Read More

బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై నిఘా

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ రెండు నెలల్లో రూ. లక్షకు మించి జమ, విత్‌ డ్రా చేసిన ఖాతాలు, ఒకే జిల్లాలో అనేక మందికి ఆన్‌లైన్‌ బదిలీ అయిన ఖాతాల వివరాలు సేకరించాలని అన్ని బ్యాంకులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రూ. లక్షకు మించి జమ, డిపాజిట్‌ చేసిన అభ్యర్థి లేదా కుటుంబ సభ్యుల, పార్టీల ఖాతాల వివరాలు సేకరించాలని తెలిపింది. రూ. 10 లక్షల జమ, డిపాజిట్ల వివరాలు ఐటీకి…

Read More

తొలి విడత పోలింగ్ కు గెజిట్ నోటిఫికేషన్ జారీ

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ కు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 27 చివరి తేదీ.. కాగా నామినేషన్ల పరిశీలన 28వ తేదీ.. నామినేషన్ల ఉప సంహకరణకు 30 చివరి తేదీ. తొలి విడత పోలింగ్…

Read More

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ మరోసారి అవతరించింది. ఢిల్లీతో పాటు మరికొన్ని నగరాలు కాలుష్యంలో చిక్కుకున్నాయి. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 ప్రకారం, 2023 లో బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ తర్వాత 134 దేశాలలో భారత దేశం మూడవ చెత్త గాలి నాణ్యతను నమోదు చేసింది. అంతకు ముందు 2022 లో, భారత దేశం ఎనిమిదో అత్యంత కాలుష్య దేశంగా మారింది..

Read More

ఎన్నికల్లో అక్రమాల అడ్డుకట్టకు ‘సీ-విజిల్’ యాప్

ఎన్నికల్లో అక్రమాలకు, నిబంధనలకు ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సీ-విజిల్’ యాప్‌ను ప్రవేశపెట్టింది.ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు.ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదుపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు.

Read More

ఓటర్ల కోసం కొత్త మొబైల్ యాప్

దేశ వ్యాప్తంగా ఎన్నికల హడవుడి మొదలైంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ వాతావరణం కనబడుతోంది. ఏ నియోజక వర్గం నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారని జనాలు తీవ్రంగా చర్చించు కుంటున్నారు. ఈ నేపథ్యం లోనే తమ నియోజక వర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఎన్నికల కమిషన్ ఓ కొత్త మొబైల్ యాప్ ను తీసుకు వచ్చింది. అభ్యర్థుల ప్రొఫైల్ తో పాటు…

Read More

దేశవ్యాప్తంగా అమల్లోకి ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’

లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగింది. పార్లమెంట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి వచ్చింది. పోటీ చేసే అభ్యర్థులు, పొలిటికల్ పార్టీలు ఎన్నికల సమయంలో ఈసీ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. అభ్యర్థులు, పార్టీల ప్రచారాన్ని నియంత్రించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ నియమ, నిబంధనల జాబితాని ‘‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’’ అంటారు. సజావుగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలను నిర్వహించడమే…

Read More

ఈ నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 17న ఆదివారం, 23న 4వ శనివారం, 24న ఆదివారం, 25న హోళీ, 29న గుడ్ ఫ్రైడ్, 31న ఆదివారం రోజులలో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఇవి కాక హోళీ పండుగ సందర్భంగా మిగతా రాష్ట్రాల్లో మార్చి 25, 26, 27న బ్యాంకులు బంద్ కానున్నాయి.

Read More

మానవాభివృద్ధి సూచిలో భారత్‌కు 134వ ర్యాంక్‌

-194 దేశాల జాబితాలో భారత్‌ 134వ స్థానం -భారత్‌ విలువ 0.633 నుంచి 0.644కి -మనిషి ఆయుర్దాయం 67.2 ఏళ్ల నుంచి 67.7కి -జాతీయ ఆదాయం 6,542 డాలర్ల నుంచి 6,951 డాలర్లకు ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచిలో భారత్‌ 134వ స్థానంలో నిలిచింది. 2022 ఏడాదికి గాను గురువారం పలు దేశాల ర్యాంకులను ఐరాసా విడుదల చేసింది. ఇందులో భారత్‌ విలువ 0.633 నుంచి 0.644కి పెరిగిందని తెలిపింది. దీంతో 194 దేశాల జాబితాలో భారత్‌ 134వ…

Read More