అయోధ్యలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

-అయోధ్యలో అద్భుతం -‘సూర్య తిలకం’ కోసం ప్రత్యేక టెక్నాలజీ అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి.. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి శ్రీరామ నవమి కావడంతో వేడుకలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం 3.30 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో స్వామి వారిని మేల్కొలిపారు. మంగళ హారతి, దివ్యాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం…

Read More

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

18 మంది మావోయిస్టుల మృతి ఛత్తీస్‌గఢ్‌: సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ఏకే 47, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాంకేర్‌లోని చోటేబైథియా పీఎస్‌ పరిధి కల్పర్‌ అడవిలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటికీ కాంకేర్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగా

Read More

మళ్లీ వినిపించిన మాజీల గొంతు

న్యాయవ్యవస్థను కాపాడుకుందాం చీఫ్ జస్టిస్‌కు మాజీ న్యాయమూర్తుల లేఖ న్యాయవ్యవస్ధను కాపాడుకునే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కొంతమంది వ్యక్తులు-సమూహం న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు చేస్తున్న యత్నాలను అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సామూహిక లేఖ రాశారు. సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టు లకు చెందిన 21 మంది రిటైర్డ్‌ న్యాయమూర్తులు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. న్యాయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని అభిప్రాయపడ్డారు. కొన్ని వర్గాలు తప్పుడు సమాచారం అందిస్తూ న్యాయ…

Read More

ఎన్నికల్లో డబ్బుల ‘వంద’నం

– రోజుకు రూ. వంద కోట్లు సీజ్ (వెంకటాచారి, ఢిల్లీ) లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురి కాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి నిత్యం సగటున రూ. 100 కోట్ల విలువైన నగదు ఇతర తాయిలాలను అధికారులు సీజ్‌ చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కొనసాగుతోన్న తనిఖీల్లో ఇప్పటి వరకు మొత్తంగా…

Read More

అత్యుత్తమ విస్కీగా ఇంద్రీ

-బెస్ట్ ఇండియన్ సింగిల్ మాల్ట్‌తో పాటు 25 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న భారత దిగ్గజం ఇంద్రీ సింగిల్ మాల్ట్ విస్కీ ప్రపంచం లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అవార్డు గెలుచుకున్న బ్రాండ్‌గా అవతరించింది. నవంబర్ 2021లో ప్రారంభించినప్పటి నుండి, ప్రపంచ విస్కీ అవార్డ్స్ మరియు ఇంటర్నేషనల్ విస్కీ కాంపిటీషన్ వంటి ప్రఖ్యాత ఈవెంట్‌ లలో ‘బెస్ట్ ఇండియన్ సింగిల్ మాల్ట్’ వంటి టైటిల్‌లతో సహా గ్లోబల్ వేదికపై 25కి పైగా ప్రతిష్టాత్మకమైన ప్రశంస లను అందుకుంది…

Read More

బీజేపీ మేనిఫెస్టో విడుదల

‘సంకల్ప పత్రం’ పేరిట ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో-2024 ను ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. పేదలు, యువత, రైతులు, మహిళల అభివృద్ధి ‘గ్యాన్’ లక్ష్యంగా (GYAN – గరీబ్, యూత్, ఫార్మర్స్, ఉమెన్స్) ఈ మేనిఫెస్టోని రూపొందించారు. వేదికపై అంబేద్కర్, రాజ్యాంగాల ప్రతిమలను ఉంచి మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ…

Read More

వివాదంలో వారణాసి పోలీసుల డ్రెస్‌ కోడ్‌

వారణాసి లోని కాశీ విశ్వనాథ ఆలయంలో అర్చకుల వేషధారణలో పోలీసులను నియమిస్తూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదం రేపుతోంది. ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులకు ప్రభుత్వం ఖాకీ దుస్తుల్లో కాకుండా ధోతీ, కుర్తాతో కూడిన సాంప్రదాయ వస్త్రధారణతో డ్రెస్‌ కోడ్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించి వారణాసి పోలీస్‌ కమిషనర్‌ మోహిత్‌ అగర్వాల్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆలయంలో విధుల్లో ఉన్న పోలీసులు ధోతీ, కుర్తా, మెడలో రుద్రాక్ష మాలతో.. మహిళా పోలీసులు సల్వార్‌ కుర్తా…

Read More

భయపడేది లేదు…నేతల బండారం బయటపెడతా

– తీహార్‌ జైలు అధికారి, జైళ్ల శాఖ మంత్రి బెదిరిస్తున్నారు -స్టేట్‌మెంట్‌ ఇవ్వొద్దు అంటూ వత్తిడి చేస్తున్నారు -అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు -సీఎం కేజ్రీవాల్‌, ఇతర నేతలకు సకల సౌకర్యాలు -లిక్కర్‌ స్కాం నిందితుడు సూకేశ్‌ చంద్ర మరో లేఖ ఢల్లీి: తీహార్‌ జైలు నుంచి లిక్కర్‌ స్కాం నిందితుడు సూకేశ్‌ చంద్ర మరో లేఖ రాశారు. సీఎం కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ జైలులో సకల సదు పాయాలు పొందుతున్నారని, అధికారం దుర్వినియోగానికి పాల్పడి…

Read More

నాగపూర్ లో తెలుగు సంఘం ఉగాది కార్యక్రమాలు

నాగ్‌పూర్‌లోని ఆంధ్రా అసోసియేషన్ ఆవరణలో ఇటీవల తెలుగు సంవత్సరాది వేడుకలను నిర్వహించారు. ప్రారంభంలో, ప్రముఖ పండిట్ కొల్లూరి చంద్రశేఖర శాస్త్రి, ఇతర పూజారితో కలిసి, తదుపరి తెలుగు సంవత్సరానికి సంబంధించిన ‘పంచాంగం’ పఠించారు. ముందుగా సభ్యులు ఎం నాగేశ్వరరావు ఉగాది పండుగ ప్రాముఖ్యతను వివరించారు. తరువాత, సాంస్కృతిక కార్యక్రమం – “కోలాటం”, ఒక ప్రముఖ కళాకారిణి రాధ, సుమారు 20 మంది సహ-కళాకారుల సహకారంతో, హర్ష ఆదేశాల మేరకు, అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమం 2 గంటల…

Read More

పీఎఫ్‌ అకౌంట్‌ డబ్బు ఇక ఆటోమేటిక్‌గా బదిలీ

2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై వారం రోజులు దాటింది. EPFOకి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా EPFO ఖాతా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఉద్యోగాలు మారినప్పుడల్లా మీ ఈపీఎఫ్‌వో బ్యాలెన్స్‌ను దానితో పాటు బదిలీ చేయడానికి మీరు కష్టపడాల్సి ఉంటుంది. చాలా సార్లు ఈపీఎఫ్‌వో బ్యాలెన్స్ నెలల తరబడి బదిలీ కాదు. ఇప్పుడు ఈపీఎఫ్‌వో ఖాతాదారులు ఉద్యోగాలు మారినప్పుడు…

Read More