50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ సీఎం

ఇంత లేటు వయసులో కూడా పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ ఓ ఆడబిడ్డకు తండ్రయ్యారు. 50 ఏళ్ల పంజాబ్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఓ బిడ్డకు తండ్రయ్యారు. 50 ఏళ్ల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరోసారి తండ్రయ్యారు. గురువారం ఉదయం అతడి భార్య డా. గురుప్రీత్ కౌర్ పండంటి ఆడబిడ్డకు జన్మ నిచ్చినట్లు మాన్, సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా, మాన్‌కు గతంలో ఇందర్ ప్రీత్ కౌర్ అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు…

Read More

సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ

-న్యాయస్థానాల కీలక తీర్పులపై తప్పుడు కథనాలు – రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు రాజకీయ నేతలు న్యాయవ్యవస్థపై చేస్తున్న ఒత్తిళ్ల వల్ల జరుగుతున్న ప్రమాదంపై పలువురు న్యాయయకోవిదులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆ మేరకు 600 మంది ప్రముఖ లాయర్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాయడం సంచలనం సృష్టిస్తోంది. ”పొలిటికల్‌ అజెండాతో స్వార్థ ప్రయోజనాలను ఆశించే కొన్ని గ్రూప్‌లు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. న్యాయపరమైన ప్రక్రియలను ప్రభావితం చేసి, కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీయాలని…

Read More

88 స్థానాలకు నోటిఫికేషన్

సార్వత్రిక ఎన్నికలలో రెండో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలతో పాటు ఔటర్ మణిపూర్‌లోని ఒక స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 4 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

Read More

డబ్బులేకే పోటీ చేయట్లేదు

-నిర్మలా సీతారామన్ ఎన్నికల్లో ఖర్చుపెట్టేందుకు అవసరమైన డబ్బు తన వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. అందుకే తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ఏపీ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు పార్టీ నాకు ఛాన్స్ ఇచ్చింది. ఓ పది రోజులు ఆలోచించి, కుదరదని చెప్పా. నావద్ద డబ్బు లేదు. ఏపీ, తమిళనాడులో కులం, మతం వంటివాటినీ పరిగణిస్తారు. అందుకే చేయనని చెప్పేశా అన్నారు.

Read More

వాషింగ్‌ మెషిన్‌లో రూ. 2.5 కోట్ల నగదు

ఈడీ సోదాలు విదేశీ మారక ద్రవ్య(ఫెరా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జరిపిన సోదాల్లో భారీగా డబ్బు పట్టుబడింది. అయితే ఈసారి దొరికిన డబ్బు బీరువాల్లోనో, లాకర్లోనో కాదు వాషింగ్‌మెషిన్‌లో ప్రత్యక్షమైంది. ఢిల్లీలోని క్యాప్రికార్నియన్‌ షిప్పింగ్‌ కంపెనీకి చెందిన ఆఫీసుల్లో ఈడీ మంగళవారం ఏకకాలంలో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో వాషింగ్‌మెషిన్‌లో దాచి ఉంచిన రెండున్నర కోట్ల రూపాయలను ఈడీ పట్టుకుంది. ఇవి కాకుండా పలు డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్కులను ఈడీ స్వాధీనం చేసుకుంది. రూ.1800…

Read More

ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసులే

బిహార్ లోని ఛప్రా పట్టణా నికి చెందిన కమల్ సింగ్, శారదాదేవి దంపతులకు ఏడుగురు కుమార్తెలు,ఒక కుమారుడు. తల్లిదండ్రులు కష్టపడి చదివించడంతో ఏడుగురు కుమార్తెలు పోలీసు ఉద్యోగాలను సాధించారు. ఆబ్కారీ శాఖ, కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారు. తమ తల్లిదండ్రులు, తమ్ముడికి 4 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు ఆ భవనం ద్వారా వచ్చే అద్దెతో వారు హాయిగా జీవిస్తున్నారు.

Read More

లిక్కర్ డబ్బులెక్కడ ఉన్నాయో కోర్టుకే చెబుతారు

– శరీరం జైల్లో ఉన్నా.. ఆత్మ ప్రజల్లోనే – కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిన్న ఈడీ కస్టడీలో ఉన్న తన భర్త కేజ్రీవాల్‌ను కలిశానని చెప్పారు. లిక్కర్ కేసు డబ్బు ఎక్కడ ఉందో రేపు కేజ్రీవాల్ కోర్టులో దేశ ప్రజలకు చెబుతారన్నారు. దాని ఆధారాలు బయటపెడతారని ఆమె తెలిపారు. కేజ్రీవాల్‌కు డయాబెటిస్ ఉందని, షుగర్…

Read More

మైక్రోసాఫ్ట్ కంపెనీలో మరో భారతీయుడికి కీలక హోదా

– విండోస్ ఆపరేటింగ్ సిస్టం, సర్ఫేస్ విభాగాలకు అధిపతిగా పవన్ దావులూరి మైక్రోసాఫ్ట్ కు ఇప్పటికే భారతీయుడైన సత్య నాదెళ్ల సీఈవోగా ఉండగా.. తాజాగా మరో భారతీయుడు ఐదే మైక్రోసాఫ్ట్ సంస్థలో అగ్ర పదవిలో నియమితులయ్యారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టం, సర్ఫేస్ విభాగాలకు అధిపతిగా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని మైక్రోసాఫ్ట్ కంపెనీ నియమించింది. పవన్ దావులూరి 2001 నుంచి మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గడిచిన మూడేళ్లుగా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు.

Read More

ఎన్డీఏ అలయెన్స్ ఎంపీ అభ్యర్థిగా తమిళి సై నామినేషన్

తమిళనాడు: సోమవారం నాడు మాజీ తెలంగాణ గవర్నర్ తమిళనాడు లోని చెన్నె సౌత్ సెగ్మెంట్ కు నామినేషన్ దాఖలు చేశారు.ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తమిళిపై పంచుకున్నారు. చెన్నె సౌత్ నియోజక వర్గానికి ఎన్డీఏ అలయెన్స్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను’ అని తమిళిసై ట్వీట్ చేశారు. ఇక, ఎంపీ ఎన్నికల వేళ తమిళనాడులో బీజేపీ ఫోకస్ చేసిన విషయం తెలిసిందే.

Read More

సైనికులతో హోలీ జరుపుకున్న రాజ్‌నాథ్ సింగ్

హోలీ సందర్భంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లద్దాఖ్‌ లోని లేహ్‌ సైనిక స్థావరాన్ని సందర్శించారు. సైనికులతో కలిసి హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవాన్లు, ఇతర సీనియర్‌ సిబ్బందితో మాట్లాడారు. ‘‘ఢిల్లీ మన దేశ రాజధాని. ముంబై మన ఆర్థిక రాజధాని.. వీటి మాదిరి గానే లద్దాఖ్ మన శౌర్యానికి రాజధాని’’ అని పేర్కొన్నారు. హోళీ పండుగ కోసం ఇక్కడికి రావడం తన జీవితం లోని అత్యంత సంతోషకరమైన క్షణాల్లో ఒకటని…

Read More