ఓటర్ల కోసం కొత్త మొబైల్ యాప్

దేశ వ్యాప్తంగా ఎన్నికల హడవుడి మొదలైంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ వాతావరణం కనబడుతోంది. ఏ నియోజక వర్గం నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారని జనాలు తీవ్రంగా చర్చించు కుంటున్నారు. ఈ నేపథ్యం లోనే తమ నియోజక వర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఎన్నికల కమిషన్ ఓ కొత్త మొబైల్ యాప్ ను తీసుకు వచ్చింది. అభ్యర్థుల ప్రొఫైల్ తో పాటు…

Read More

దేశవ్యాప్తంగా అమల్లోకి ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’

లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగింది. పార్లమెంట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి వచ్చింది. పోటీ చేసే అభ్యర్థులు, పొలిటికల్ పార్టీలు ఎన్నికల సమయంలో ఈసీ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. అభ్యర్థులు, పార్టీల ప్రచారాన్ని నియంత్రించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ నియమ, నిబంధనల జాబితాని ‘‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’’ అంటారు. సజావుగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలను నిర్వహించడమే…

Read More

ఈ నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 17న ఆదివారం, 23న 4వ శనివారం, 24న ఆదివారం, 25న హోళీ, 29న గుడ్ ఫ్రైడ్, 31న ఆదివారం రోజులలో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఇవి కాక హోళీ పండుగ సందర్భంగా మిగతా రాష్ట్రాల్లో మార్చి 25, 26, 27న బ్యాంకులు బంద్ కానున్నాయి.

Read More

మానవాభివృద్ధి సూచిలో భారత్‌కు 134వ ర్యాంక్‌

-194 దేశాల జాబితాలో భారత్‌ 134వ స్థానం -భారత్‌ విలువ 0.633 నుంచి 0.644కి -మనిషి ఆయుర్దాయం 67.2 ఏళ్ల నుంచి 67.7కి -జాతీయ ఆదాయం 6,542 డాలర్ల నుంచి 6,951 డాలర్లకు ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచిలో భారత్‌ 134వ స్థానంలో నిలిచింది. 2022 ఏడాదికి గాను గురువారం పలు దేశాల ర్యాంకులను ఐరాసా విడుదల చేసింది. ఇందులో భారత్‌ విలువ 0.633 నుంచి 0.644కి పెరిగిందని తెలిపింది. దీంతో 194 దేశాల జాబితాలో భారత్‌ 134వ…

Read More

ఇద్దరు కమిషనర్ల నియామకాన్ని నిలిపివేయలేం

సుప్రీం కోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్తగా ఎన్నికైన ఇద్దరు కమిషనర్ల నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు వారి నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు నిరాకరించింది. కొత్తగా నియమితులైన ఇద్దరు కమిషనర్ల నియామకంపై స్టే కోసం కొత్తగా పిటీషన్ దాఖలు చేయాలని, మౌఖికంగా కోరితే పరిశీలించలేమని చెప్పింది. తదుపరి విచారణకు ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది.

Read More

తగ్గిన డీజిల్, పెట్రోల్ రేట్లు

ఇంధన ధరలు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పెట్రోల్ , డీజిల్ రేట్లు తగ్గించింది. లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.2 తగ్గిస్తూ ఆదేశాలు ఇచ్చింది. తగ్గిన ధరలు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి అమలులోకి రానున్నాయి. కాగా మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్పీజీ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.100 తగ్గించింది. ఇదే బాటలో పెట్రోల్, డీజిల్ ధరలనూ తగ్గిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

Read More

స్మృతి ఇరానీ ఆమెను అవమానించలేదు

– కేసు కొట్టివేసిన అలహాబాద్‌ కోర్టు – పరువునష్టం కేసులో స్మృతి ఇరానీకి ఊరట లఖ్‌నవూ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై అంతర్జాతీయ షూటర్ వర్తికా సింగ్‌2022, అక్టోబర్‌ 21న వేసిన పరువు నష్టం దావా కేసును కోర్టు కొట్టివేసింది. దీంతో కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ వర్తికాసింగ్‌ అలహాబాద్‌ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. కాగా తాజాగా అక్కడ కూడా ఆమెకు చుక్కెదురైంది. వర్తిక పిటిషన్ ను అలహాబాదు హైకోర్టు తిరస్కరించింది. స్మృతి ఇరానీ జర్నలిస్టుల…

Read More

ఈసీతో గూగుల్‌ జట్టు

-ఎన్నికల్లో తప్పుడు సమాచారానికి చెక్‌ సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘంతో గూగుల్‌ జట్టు కట్టింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు కొన్ని చర్యలు చేపట్టింది. అధీకృత సమాచారం మాత్రమే ప్రజల్లోకి వెళ్లేలా చూడడంతో పాటు ఏఐని వినియోగించి రూపొందించే వీడియోలకు లేబుల్ వేయాలని నిర్ణయించింది. ఎన్నికల్లో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది. ఓటరుగా పేరు ఎలా నమోదు చేసుకోవాలి? ఎలా ఓటు వేయాలి? వంటి సమాచారాన్ని…

Read More

51కి చేరిన వందేభారత్‌ రైళ్లు

– మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం పచ్చజెండా ఊపారు. వీటితో పాటు మొత్తం 10 వందేభారత్‌లను ప్రధాని నేడు వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో దేశంలో మొత్తం…

Read More

సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా

-హర్యానాలో బీజేపీ-జేజేపీ పొత్తుకు బీటలు -ఆసక్తికరంగా హర్యానా పాలిటిక్స్ లోక్సభ ఎన్నికల ముంగిట హర్యానా రాజకీయాల్లో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీ-జననాయక్ జనతా పార్టీ కూటమిలో చీలికలు రావడంతో సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. అంతే కాకుండా ఖత్తర్ బాటలోనే ఆయన క్యాబినెట్ మంత్రులు కూడా రాజీనామా చేశారు. ఈ…

Read More