పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు శిక్ష

పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక రహస్యాలను వెల్లడించిన కేసులో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు కోర్ట్ పదేళ్ల జైలు శిక్షను విధించింది.తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విదేశీ కుట్రకు ఆధారం ఇదేనంటూ ఆయన గతంలో ఓ సభలో కొన్ని పత్రాలను బహిరంగంగా ప్రదర్శించారు.అమెరికా లోని పాకిస్థాన్ ఎంబసీ నుంచి వీటిని సేకరించానని తెలిపారు. దీనితో ఆయన మీదకేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావల్పిండి లోని జైలులో ఉన్నాడు.

Read More

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో అయోధ్య ప్రతిష్ట లైవ్

అమెరికా వాణిజ్య నగరమైన న్యూయార్క్ లోని “టైం స్క్వేర్” అనేది ప్రపంచంలోనే అతి గొప్ప కూడలి. ఇక్కడ సహజంగా ప్రపంచ ప్రఖ్యాత కార్యక్రమాలనే లైవ్ టెలీకాస్ట్ చేస్థారు. ఇప్పుడు ఆ ప్రపంచ ప్రఖ్యాత లిస్టులో మన అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టను కూడా చేర్చారు. ఈ నెల 22వ తారీకున అయోధ్య లో జరగనున్న శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టను న్యూయార్క్ టైం స్క్వేర్ సెంటర్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా…

Read More

హ్యాండ్ గన్ సృష్టి కర్త గ్లాక్ కన్నుమూత

హ్యాండ్ గన్ సృష్టి కర్త గ్యాస్టన్ గ్లాక్ (94) మరణించారు. ఆస్ట్రియా కు చెందిన గ్లాక్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఈ హ్యాండ్ గన్ ను గ్లాక్ 1979 లో కనిపెట్టాడు. దీనిని 1982 నుంచి వాడుకలోకి తీసుకొచ్చారు. ఈయన కనిపెట్టిన హ్యాండ్ గన్ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోతున్న తుపాకుల్లో ఒకటి. ఈ గన్ ను పోలీసులు, మిలటరీ, నేరస్థులు ఎక్కువగా వినియోగిస్తున్నారు.

Read More

వృద్ధుడి పేగుల్లో ఈగ

– షాక్ అయిన డాక్టర్లు అరవై ఏళ్లు దాటిన వారు కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవడం రొటీన్. అమెరికాలోని మిసోరీకి చెందిన 63 ఏళ్ల వ్యక్తి అలాగే చెకప్ కోసం వెళ్లాడు. ఆయనను పరీక్షించిన వైద్యులు విస్తుపోయారు. పెద్దపేగుల్లో ఒక ఈగ చెక్కుచెదరకుండా ఉండటం వారిని విస్మయ పరిచింది. వైద్య చరిత్రలోనే ఇలాంటి అరుదైన కేసు గా గుర్తించారు.

Read More

చైనాలో భారీ అగ్ని ప్రమాదం

– 19 మంది మృతి, పలువురికి గాయాలు చైనాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బొగ్గుగనుల కంపెనీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటుయుసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. ప్రమాదం జరిగిన భవనం ఓ ప్రైవేటు బొగ్గుగనుల కంపెనీకి చెందినదని తెలిపారు. బొగ్గు తవ్వకాలు జరుగుతున్న చోట కాకుండా కార్యాలయాలు,…

Read More

బాబు బాగుండాలంటూ సింగపూర్ వాసుల అర్చనలు

– ఆకట్టుకున్న సింగపూర్ తెలుగువాసుల పాదయాత్ర శ్రీవెంకటేశ్వరస్వామి దీవెనలతోనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జైలు నుంచి బయటకు వచ్చారని సింగపూర్‌లోని తెలుగువారు అన్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంగా, ఆయన ఆరోగ్యం బాగుండాలంటూ సింగపూర్ తెలుగువారు, పెరుమాళ్ శ్రీనివాసన్ దేవాలయం వరకూ నిర్వహించిన పాదయాత్ర సింగపూర్ వాసులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబం క్షేమంగా ఉండాలంటూ వారిపేరిట అర్చనలు చేశారు. చంద్రబాబు ఐటీని ప్రోత్సహించినందుకే తామంతా ఇంత దూరం వచ్చామన్నారు. నారా చంద్రబాబునాయుడు…

Read More

బాబు విడుదల వేళ ఖతార్‌లో తమ్ముళ్ల సంబరాలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంగా ఖతార్ తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీసమావేశం నిర్వహించుకున్నారు.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన సందర్భంగా ప్రవాసులు పెద్దఎత్తున సమావేశమైనారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి కుటుంబసభ్యులతో ఉన్న విజువల్ చూసి ప్రవాసులు కన్నీటి పర్యంతమయినారు. చంద్రబాబు నోటివెంట వెలువడిన మాటలు … ఏమి తమ్ముళ్లు.. ఎలా ఉన్నారు.. అన్న మాట చెవినపడగానే ప్రవాసులు పులకించిపోయారు.. చంద్రబాబు జైలునుంచి విడుదలైనారన్న…

Read More

సత్యమేవ జయతే.. నిజం గెలవాలి

అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.లో జాతిపితకు ఘన నివాళి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యం పట్ల, ఆయనపై అక్రమ అరెస్ట్, కేసుల రిమాండ్ పై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ.. న్యాయం చేయాల్సిన చోట జాప్యం జరగటం అన్యాయ మని, ఆంధ్ర రాష్ట్రంలో పతనమవుతున్న ప్రజాస్వామ్య పాలన విధానాలను ఖండించి సత్యమేవజయతే.. నిజం గెలవాలి అని వాషింగ్టన్ డీ.సి లోని భారత రాయబార కార్యాలయం వద్ద మహాత్ముని సాక్షిగా నినదించారు. ఈ కార్యక్రమాన్ని భాను ప్రకాష్ మాగులూరి సమన్వయ…

Read More

లండన్ కు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ అభివృద్ధి మోడల్ పై భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 11 గంటలకు ఆక్స్ ఫర్డ్ లో కీలకోన్యాసం చేయనున్న కవిత లండన్ : ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు తెలంగాణ మోడల్ పై కీలకోపన్యాసం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం నాడు లండన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో కల్వకుంట్ల కవితకు ఎన్నారైలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారత…

Read More

జర్మనీలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు

జర్మనీలో వరుసగా ఏడవ వారం చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. మ్యూనిచ్ నగరంలోని ప్రతిష్టాత్మక కార్ల్స్ సెంటర్ లో ఎన్ఆర్ఐ లు చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. ఎన్ఆర్ఐల ప్రదర్శనను స్థానికులు ఆసక్తిగా గమనించారు. వారికి ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అప్రజాస్వామిక పరిస్థితులను ఎన్ఆర్ఐలు వివరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవప్మెంట్ సంస్థ ద్వారా ట్రైనింగ్ పొంది ఉద్యోగం సంపాదించిన రవికిరణ్ అనే యువకుడు చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

Read More