నమస్కారం విలువ

మహాభారత యుద్ధ సమయంలో “మీరు పక్షపాతంగా యుద్ధం చేస్తున్నారు” అని దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడి భీష్మ పితామహడు “నేను రేపు పాండవులను చంపుతాను” అని ప్రకటించాడు. అంతే… పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది. భీష్ముని సామర్ధ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి, చెడు భయంతో కలవరపడ్డారు. అప్పుడు.. శ్రీ కృష్ణుడు తన వెంట ద్రౌపదిని తీసుకొని భీష్ముని శిబిరానికి వెళ్ళాడు. తను బయట నిలబడి ద్రౌపదితో “నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించు, ఆయన “అఖండ…

Read More

పెళ్లి అంటే….

పరస్పర అంగీకారం పరస్పర అధికారం కాదు పెళ్లి అంటే… పరస్పర ఒప్పందం నిర్బంధం కాదు పెళ్లి అంటే… తానో జీవిత కాల నేస్తమవ్వడం నేనే సమస్తమనడం కాదు పెళ్లి అంటే… మరో జీవితంతో దర్జాగా కలిసి బ్రతకడం, మరో జీవితాన్ని కబ్జా చేయడం కాదు పెళ్లి అంటే… గెలిపించుకోవడం బెదిరించుకోవడం కాదు పెళ్లి అంటే… పిల్లల్ని కనడం కాదు కలల్ని పండించుకోవడం ఎవ్వరికీ ఇబ్బంది పెట్టని వ్యక్తి స్వేచ్ఛను హరించాలని చూస్తే పెళ్లి కన్నా పెటాకులే వేడుకవుతుంది……

Read More

జాతకం లేని వారికి శాంతులు

వర్తమానంతో పాటు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. జీవితంలో జరిగే మంచి చెడులను తెలుసుకునేందుకు జ్యోతిష్కులను, పండితులను ఆశ్రయిస్తుంటారు. కొందరు హస్త సాముద్రికం ఆధారంగా చెబుతుండగా, ఇంకొందరు సంఖ్యా శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని, మరికొందరు గ్రహ సంచారాల ఆధారంగా జాతకాలు చెబుతుంటారు. చేతిలోని రేఖల ఆధారంగా చెప్పేది హస్త సాముద్రికం కాగా, గ్రహ గతుల ఆధారంగా చెప్పేది జన్మకుండలి ఆధారిత జ్యోతిష్యం. జన్మకుండలి ఆధారంగా జాతకాలు తెలుసుకునేందుకు వ్యక్తి జన్మించిన తేదీ…

Read More

గోచారము- ఫలితాలు

జ్యోతిష్య శాస్త్రంలో అనేక విధాల అధ్యయనాలున్నాయి. ఇందులో భాగంగా గోచారం ఉంది. గోచారము అంటే ప్రస్తుత గ్రహస్తితిని బట్టి వ్యక్తికి సంబంధించిన రాశి ఫలము. జాతకచక్రంలో వ్యక్తి జన్మించినప్రథమ భాగాన్ని లగ్నంగా తీసుకుంటారు. చంద్రుడున్న నక్షత్రాన్ని ఆ వ్యక్తి జన్మ నక్షత్రంగానూ, ఆ చంద్రుడున్న రాశిని ఆ వ్యక్తి రాశి గానూ చెబుతారు. ఉదాహరణకు… 2014 సెప్టెంబర్‌ 25 తేదీన సూర్యోదయంలో(సుమారు 6 గంటలకి) జన్మించిన వ్యక్తి ఐతే, ఆ సమయానికి చంద్రుడున్న హస్త నక్షత్రం ఆ…

Read More

కన్యాదానం – విశిష్టత

మొత్తం 16 రకాల దానాలు వివాహకాండలో కీలక ఘట్టం కన్యాదానం. నిజానికి వివాహమంటేనే కన్యాదానం. కన్యాదానం కూడా ఒక రకమైన దానమే అయినా ఇది విభిన్నమైనది మరియు విశిష్టమైనది. సంతానార్ధం, త్రిధర్మ రక్షణార్ధం కన్యాదానం చేస్తారు. ఒక్కో యుగంలో ఒక్కో ధర్మానికి ప్రాముఖ్యతనిచ్చింది. కృతయుగంలో తపస్సుకు, త్రేతాయుగంలో జ్ఞానానికి, ద్వాపరయుగంలో యజ్ఞాలకి, కలియుగంలో దానానికి విశిష్ట స్థానం కల్పించింది. ఇది స్పష్టంగా పద్మపురాణంలో చెప్పబడి ఉన్నది. మొత్తం 16 రకాల దానాలు చెప్పబడ్డాయి. వాటిలో నాలుగు దానాలు…

Read More

సుమంగళి కోరిన వైధవ్యం

ఒక నాడు పరమాచార్య స్వామి వారి దగ్గరకు ఓ వృద్ధ సువాసిని వచ్చి, స్వామి వారిని ఓ విచిత్రమైన కోరిక కోరింది. “స్వామీ ఒకవేళ నా భర్తకు ఏదైనా జరగరానిది జరిగి ఆయువు చెల్లితే, అది నేను ఉండగానే జరిగేలా ఆశీర్వదిoచoడి. నా కన్నా ముందు, నా కళ్ళ ముందు ఆయన వెళ్ళిపోయేటట్టు అనుగ్రహించండి” అని ఆర్తితో వేడుకుంది. వెంటనే మహాస్వామి వారు చిరునవ్వుతో, “అలాగే అవుగాక” అని దీవించి పంపారు. కానీ అక్కడ ఉన్నవారందరూ ఈ…

Read More

గెట్ టు గెదర్

విచ్చేశారు అందరూ బానపొట్టలు బట్టతలలతో నెరసిన జుత్తుతో పురుష పుంగవులు ! బారెడుజడలూ మూరెడుకాగా సోడాబుడ్డి కళ్ళద్దాలతో మహిళా మణులు !! వాడు వీడేనా ? వీడు వాడేనా? ఆమె ఈమేనా ? ఈమె ఆమేనా ? గుర్తింపుల గుబాళింపు ! పలకరింపులూ నమస్కారాలూ షేక్ హ్యాండులూ కౌగిలింతలూ పరామర్శలూ తాతలుగా మారిన అలనాటి అబ్బాయిలు అమ్మమ్మలూనానమ్మలుగామారిన ఆరోజుల అమ్మాయిలు మరోవైపు కాళ్ళనొప్పులు కీళ్ళనొప్పులు చెంగు చెంగున అలనాటి గెంతులస్ధానంలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ చేరారంతా ఒకచోటికి…

Read More

స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం..

రామునికి — సీత కృష్ణునికి — రాధ ఈశునకు — ఈశ్వరి మంత్రపఠనంలో — గాయత్రి గ్రంధ పఠనంలో — గీత దేవుని యెదుట వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన వీరికి తోడుగా శ్రద్ధ మన దినచర్యలో భాగంగా ఉదయానికే— ఉష, అరుణ సాయింత్రం — సంధ్య చీకటైతే — జ్యోతి, దీప పడక సమయానికి – రజనీ పడుకున్నాక — స్వప్న చూచేటప్పుడు— నయన వినేటప్పుడు — శ్రావణి మాట్లాడునప్పుడు— వాణి ఓరిమిలో –…

Read More

కలసి వుంటే కలదు సుఖం

అందమైన అబద్దాలు – కమ్మని ఊహలు పిల్లలూ… పూర్వం ఇప్పట్లా గ్రామాలు, నగరాలు, పట్టణాలు వుండేవి కావంట. అంతా అడవుల్లోనే బ్రతుకుతా వుండేవారంట. మరి మనుషులు అడవులు వదలి పక్కకు ఎప్పుడొచ్చారు. ఊర్లు ఎప్పుడు కట్టినారు. ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుందా… అయితే సరదాగా ఈ కమ్మని కథ వినండి. అది చాలాచాలా కాలం కిందటి సంగతి. మనుషులకు, పశువులకు పెద్దగా తేడా లేని కాలం సంగతి. అడవిలో జంతువులూ, పక్షులూ, మనుషులూ అంతా కలసి బ్రతుకుతూ వున్నప్పటి…

Read More

పిల్లలకు లోక జ్ఞానం కూడా నేర్పండి

ఇంటర్ లో 99% మార్కులు తెచ్చుకుని, ఐ.ఐ.టి ఢిల్లీలో సీట్ కొట్టి…..ఆ జిల్లాలోనే తెలివైన కుర్రోడిగా పేరు తెచ్చుకున్న సుందరం కొడుకు, ఎక్కడికన్నా తీసుకెళ్లమని వాళ్ళ నాన్నతో ఒకటే గోల. కొడుకు బాధ పడలేక ఎక్కడకి తీసుకెళ్ళాలో చెప్పమన్నాడు సుందరం. చలికాలం రాత్రి లంబసింగిలో టెంట్ వేసుకుని ఉంటే బాగుంటుంది అన్నాడా అబ్బాయి. టెంట్ ఒకటి కొని, శనివారం ఉదయం బయలుదేరి సాయంత్రం లంబసింగి చేరుకుని, మంచి ప్లేస్ ఒకటి పట్టుకుని, టెంటు వేసుకుని పడుకున్నారు తండ్రి…

Read More