గాతా రహే మేరా దిల్..!

హిందీ సినిమా గమనానికి ఆయనో గైడ్.. ఎన్నో హృదయాలను కొల్లగొట్టిన జుయల్ తీఫ్ విఫలమైన ప్రేమ బాధించినా మరో ప్రేమపుస్తకం తెరిచి పెళ్లిపుస్తకాన్ని అందంగా రాసుకున్న ప్రేమపూజారి బాలీవుడ్లో స్టైల్ కి మరోపేరైన బొంబాయి కీ బాబు.. ROMANCE WITH LIFE అంటూ చివరి శ్వాస వరకు జీవితాన్ని ప్రేమించిన దేవానంద్ మేరా నామ్ నటనే ఆయన కామ్..! ఒక దశలో హిందీ సినిమా పూర్తిగా దేవా హవా.. ఆయన క్రాఫు..కెరీర్ గ్రాఫు.. ఆ బుర్ర ఊపు..అదో…

Read More

స్వరాంతర్యామి..బాలు!

నీ పాట ఏడుకొండలలో ప్రతిధ్వనించే అన్నమయ్య కీర్తన.. నీవూ మావలె మనిషివని నీకూ మరణం ఉన్నదని తెలిసీ ఎలా బ్రతికేది.. అని నిలదీసి షిర్డీనాధుని సమాధి నుంచి ధుని సాక్షిగా వెలికి రప్పించిన అపూర్వ ధ్వని.. జయజయ జయజయ వినాయక.. శ్రీ కాణిపాక స్వామికీ ప్రియమైనదే నీ వాణి.. మాలధారణం.. నియమాల తోరణం.. అంటూ భక్తులకు.. అయ్యప్పకు చేశావు కదా అనుసంధానం.. స్వాముల మండల దీక్షకు నీ పాటల కమండలమే కదా రక్ష.. ఏమయ్యా ఓ రామయ్యా…

Read More

సినిమా పాట.. కేరాఫ్ సుబ్రమణ్యం!

బాలూ.. నీ మొదటి పాట మీటిన కోదండపాణికో దండం.. చిలిపినవ్వుల నిను చూడగానే అన్న మా సాలూరు నీ తొలినాటి రసాలూరు.. దర్మక్షేత్రం కురుక్షేత్రము న నీ గళమున కల్యాణవీణ మ్రోగించలేదా మృదుమధురముగ.. శాస్త్రీయసంగీతంలో బాలుకెక్కడిది ప్రవేశం అని ఆవేశపడిన విమర్శకులే అచ్చెరువొంద అచ్చమైన విద్వాంసుని వోలె తెలుగునాట రికార్డుల విధ్వంసం నీతో సృష్టింపజేసిన మామ మహదేవుడు నీ,మా పాలి మహాదేవుడు.. నీ స్వీయ కల్పనలో ఇది తొలిపాట అంటూ నువ్వు పాడిన సమ్మోహన గీతం తిరిగిరాని…

Read More

నువ్వెళ్ళినా నీ పాట మాతోనే..

ఒకటా..రెండా.. నలభై వేల పాటలు.. సుమారు నాలుగు తరాలు.. పరవశించిపోయిన కోట్లాది హృదయాలు.. ప్రతి మనిషి జ్ఞాపకంలో ఆయన పాట.. ఏ వయసు వారికి ఆ అనుభూతి.. బాల్యమా.. యవ్వనమా..కౌమారమా.. వార్ధక్యమా..జీవితంలోని అన్ని దశలకు అన్ని రకాల పాటలు.. ప్రేమా.. విషాదమా.. ఆవేశమా..రౌద్రమా.. సరదానా.. సంతోషమా.. ఎప్పుడు ఏదడిగినా చిటికెలో తీసి ఇచ్చేస్తుందా స్వరపేటిక.. అసలు పాటకు ఆయనే పీఠిక…! ఇక భక్తి గీతాలా.. అయ్యప్ప దేవాయన మహ.. అంటే పలకడా శబరిగిరీశుడు… జయజయ వినాయకా శ్రీ…

Read More

కడవెత్తుకొచ్చి కలెక్షన్లు..!

ఒక సూపర్ హిట్టు నవల దానికి దృశ్యకావ్యరూపం.. అద్భుతమైన వాణిశ్రీ రూపం అంతకంటే అద్భుతం అక్కినేని అభినయం.. కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వ పటిమ.. మామ పాటల పాటవం ఘంటసాల,సుశీల.. మధ్యలో ఎల్లార్ ఈశ్వరి ఉర్రూతలూగించే పాటలు.. భారీ సెట్టింగులు.. అన్నిటినీ మించి రామానాయుడు లక్కు.. వెరసి ప్రేమనగర్ కిక్కు…! అంతము లేని ఈ భువనమంత పురాతన పాంధశాల.. సినిమా పొద్దుపొద్దునే అదరగొట్టిన ఘంటసాల.. ఎవరి కోసం..ఎవరి కోసం అంటూ చివరి సీన్ వరకు అదే మెరుపు.. అదే మైమరపు…

Read More

ఈ శకునినటనకు గని..!

ఐన పనులకైతే ఏమో గాని కాని పనులకు అమ్మ తమ్ముణ్ణి మేనమామని నేనున్నానుగా.. ఈ డైలాగ్ ఆనాటి మహాభారతంలో శకుని చెప్పి ఉంటాడో లేదో నీ అంత కర్కశంగా.. ఇంత క్రూరంగా..? చిత్రంగా ఒక కనుబొమ్మ పైకి లేపి టాపు లేపేసావు కదయ్యా దానవీరశూరకర్ణ ని.. నువ్వేగా కలియుగ శకుని మామవని.. నాడు మేనల్లునికి జరిగిన పరాభవానికి మామ ప్రతీకారం తీర్చుకున్న విధమిదా హుర్రే హుర్రే.. అని జగమెల్ల కొనియాడలేదా నీ అభినయాన్ని… పెంచుకోలేదా నీపై అభిమానాన్ని…..

Read More

మాయ చేసి మాయమైన స్మిత..!

ఆమె వ్యాంపు.. చిత్రపరిశ్రమను ఏలింది ఆమె ఒంపుసొంపు.. బావలు సయ్యా.. మరదలు సయ్యా.. ఇలా మాసుని.. జాణవులే.. నెరజాణవులే అలా క్లాసును తన అందంతో ఓలలాడించిన స్మిత.. ఆమె కుల్కు.. జనం మెచ్చిన సిల్కు..! మాటాడే కళ్ళు… అవి కొంటె భాషలకు.. చిలిపి బాసలకు ఆనవాళ్ళు.. కాని.. అవి ప్రపంచం చూడని బాధల లోగిళ్ళు.. మేను నర్తించినా.. ఆ హొయలనే జనం గుర్తించినా.. కనబడని కష్టాల లోయలు… శృతి గతీ తప్పిన లయలు.. సిల్క్ జీవితం నిండా…

Read More

హాయిగా పాడడమే పి బి హాబీ..!

తలపై చిత్రమైన టోపీ గొంతు చాలా సాఫీ ఎస్పిబీకి ముందు తరం గాయకుడీ పీబీ హాయిగా పాడడమే ఆయన హాబీ..! ఘంటసాల ఉన్నప్పుడే ఎన్టీఆర్ కు.. ఏయెన్నార్ కి పాడినా కాంతారావుకి, హరనాథ్ కి ఆయన గళం పేటెంట్ అందాల ఓ చిలకా అందుకో నా లేఖ.. మెలోడీ పాటల్లో ఆయనది తిరుగులేని టాలెంట్..! ప్రతి పాట ఇప్పటికీ జనం నోట ముద్దుముద్దు పాపాయి అంటూ పిబి గొంతులో విషాదం ఎన్టీఆర్ మొహంలో విరాగం ఎవరినైనా ఇట్టే…

Read More

పేరును మార్చడం తనకు బాధ కలిగించింది

– నందమూరి కల్యాణ్ రామ్ విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైయస్సార్ పేరును ఏపీ ప్రభుత్వం పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నారు. ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తాజాగా తారక్ అన్నయ్య నందమూరి కల్యాణ్ రామ్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా కల్యాణ్ రామ్ స్పందిస్తూ… 1986లో విజయవాడలో మెడికల్ యూనివర్శిటీని స్థాపించారని చెప్పారు. ఏపీలోని మూడు ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న ఎన్టీఆర్ గారు ఈ…

Read More

ఆస్కార్ అవార్డుల కోసం గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’

వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం భారత్ నుంచి అధికారిక ఎంట్రీ ఖాయమైంది. భారత్ నుంచి ఈసారి గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ (ఆఖరాట) ఆస్కార్ కు వెళుతోంది. ద కశ్మీర్ ఫైల్స్, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తోసిరాజని ‘ఛెల్లో షో’ ఆస్కార్ చాన్స్ దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రం ఆస్కార్ లో ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో పోటీపడనుంది. గుజరాతీ దర్శకుడు పన్ నళిన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఛెల్లో షో’ చిత్రం…

Read More