పన్నులు పెంచడమే గానీ, ప్రజలకు సౌకర్యాలు కల్పించరా?

-నీటి ఎద్దడి, కాలుష్యంతో దెబ్బతింటున్న ప్రజారోగ్యం -పదేళ్ల టీడీపీ, వైసీపీ పాలనలో పదవులు వెలగబెట్టిన వారు ఏం చేశారు -సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్‌ బాబురావు విజయవాడ సెంట్రల్‌లో సీపీఎంను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్‌ బాబురావు కోరారు. గురువారం 59వ డివిజన్‌ అజిత్‌ సింగ్‌ నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంచినీటి ఎద్దడి, నీటి కాలుష్యం, పార్కుల్లో దెబ్బతిన్న క్రీడా పరికరాలు, చెత్తపన్ను, ఇతర భారాలు, తదితర…

Read More

రైతుల ముఖం చూడని జగన్‌ రాష్ట్రానికి అవసరమా ?

-చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర వ్యాప్తంగా కరువు కరాళ నృత్యం చేస్తున్నా..రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కనీసం పట్టించుకోని జగన్‌ లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా అని మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. గురువారం చిలకలూరిపేట 6, 7 డివిజన్లకు చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పుల్లారావు సమక్షంలో టీడీపీలో చేరారు. 6వ వార్డు నుంచి కొణిదెన దుర్గాప్రసాద్‌, ముత్తుకూరి ఈశ్వర్‌, పాలెపు…

Read More

పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరిక

వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి, అఖిలభారత బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్‌ శర్మతో పాటు పలువురు టీడీపీ నేతలు బుధవారం రాత్రి ఆళ్లగడ్డలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

Read More

వేమిరెడ్డి దంపతులను గెలిపించండి

-నెల్లూరు పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కోవూరు నియోజకవర్గంలో మొదటసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మహిళకు అవకాశం కల్పించిందని, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని నెల్లూరు పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కోరారు. ప్రశాంతిరెడ్డితో కలిసి గురువారం కోవూరు మండలంలోని మొడేగుంట గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వేమిరెడ్డి దంపతులు తమ సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అనేక గ్రామాల్లో సురక్షిత…

Read More

వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు

కడప నగరానికి చెందిన పలువురు వైసీపీ మాజీ కార్పొరేటర్లు టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గురువారం మదనపల్లిలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో 1వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ చైతన్య, 31వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ సురేష్‌, 44వ డివిజన్‌ మెస్‌ రాజశేఖర్‌, 20వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ లక్ష్మీదేవి సోదరుడు కృష్ణలు ఉన్నారు.

Read More

సర్వేపల్లిలో వైసీపీ ఖాళీ

-సోమిరెడ్డికి మద్దతుగా వెల్లువలా వలసలు -ఓటమి భయంలో మంత్రి కాకాణి సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ ఖాళీ అవుతోంది. నియోజకవర్గంలోని అన్ని మండ లాల్లో పెద్దఎత్తున ఆ పార్టీని వీడి టీడీపీ బాట పట్టారు. వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్థన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. తోటపల్లిగూడూరు మండలం వరిగొం డ బిట్‌ -2కు చెందిన 40 కుటుంబాల వారు వైసీపీని వీడి సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమక్షంలో చేరారు. చేరిన వారిలో…

Read More

నాడు బాబు వద్దు.. నేడు సీటు ముద్దు

– అనపర్తి బీజేపీ అభ్యర్ధి రాజు తీరిది – బాబు వెన్నుపోటుదారుడంటూ చేసిన ట్వీట్ ప్రచారంలోకి – ఎలా పనిచేస్తామంటున్న టీడీపీ క్యాడర్ ( అన్వేష్) ఆయన ఒకప్పుడు టీడీపీకి బద్ధ వ్యతిరేకి. అంతేనా? టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెన్నుపోటుదారుడంటూ సోషల్‌మీడియాలో ప్రచారం చేసిన బీజేపీ నాయకుడు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన పొత్తులో భాగంగా బీజేపీ సీటు దక్కించుకున్న అభ్యర్ధి. సరే ఇదంతా ఎప్పటి సందతో కదా? ఇప్పుడెందుకని సరిపెట్టుకోవచ్చు. కానీ సోషల్‌మీడియా మహా…

Read More

బాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

కదిరి నియోజకవర్గానికి చెందిన పలువురు ముస్లిం నేతలు, ఇతర సామాజిక వర్గాల నేతలు గురువారం టీడీపీలో చేరారు. వీరికి చంద్రబాబు నాయుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కదిరి పట్టణ వైసీపీ కన్వీనర్ బావుద్దీన్, కౌన్సిలర్లు కృష్ణప్ప, ఏం.ఎన్.ఫయాజ్, రంగారెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఎ.వెంకటరమణా రెడ్డి, సర్పంచ్ సి.సుధాకర్, వడ్డెర సంఘం ముఖ్య నాయకులు వల్లెపు సోమశేఖర్, పూసల సంఘం అధ్యక్షులు కుళ్లాయప్ప, నలుగురు వార్డ్ సభ్యులు, తదితరులు ఉన్నారు.

Read More

ధూళిపాళ్ల స్టిక్కర్ల సైకిల్ గుర్తింపు

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలోని ఓ రైస్ మిల్లులో గురువారం ఎన్నికల అధికారులు తెలుగుదేశం అభ్యర్థి దూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్టిక్కర్లు అంటించి ఉన్న 610 సైకిళ్లను గుర్తించారు. పొన్నూరు ఎంపీడీవో రత్నజ్యోతి సిబ్బందితో వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. తెదేపా నాయకులు సైకిళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారంపై అధికారులు విచారిస్తున్నారు.

Read More

తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు

-తిరుపతి జిల్లా కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలి -మేము అధికారంలోకి వచ్చాక మెరుగైన రీతిలో వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగిస్తాం -తప్పు చేసిన వాలంటీర్లకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావు -వాలంటీర్లు ప్రజలకు జవాబుదారి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు -ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న అధికారులపై ఎన్నికల ప్రధాన అధికారికి ఎన్డీఏ నేతల ఫిర్యాదు – తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న, వైసీపీ అక్రమాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని…

Read More