యూఎస్‌ఓపెన్‌లో ఆండీ ముర్రేకు షాక్…

635

యూఎస్‌ ఓపెన్‌ లో సంచలనాలు నమోదయ్యాయి. యూఎస్ ఓపెన్ -2021 మెన్స్ సింగిల్స్‌ లో ఆండిముర్రేకు షాకిచ్చాడు స్టెఫానోస్ సిట్సిపస్ . హోరాహోరీగా సాగిన పోరులో విజేతగా నిలిచాడు. తొలి సెట్‌ను ముర్రే 6-2తో సునాయాసంగా గెల్చుకోగా, రెండో సెట్‌ 7-6తో సిట్సిపస్ దక్కించుకున్నాడు. మూడో సెట్‌ ను 6-3తో ముర్రే గెల్చుకున్నాడు. అయితే నాలుగో సెట్‌ను సిట్సిపస్ 3-6తో ఖాతాలో వేసుకున్నాడు . దీంతో నిర్ణయాత్మకమైన ఐదో సెట్‌ లో ఇద్దరూ హోరా హోరీగా తలబడ్డారు. ఈసెట్‌ ను కూడా దక్కించుకున్న సిట్సిపస్‌.. రెండో రౌండ్‌ కు చేరాడు.