‘లక్ష్య’ షూటింగ్‌ పూర్తి

484

ప్రామిసింగ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య ల్యాండ్‌ మార్క్ 20వ చిత్రం ‘లక్ష్య’ షూటింగ్‌ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియచేస్తూ, దర్శకుడు ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి ఓ సీన్‌ని నాగశౌర్యకి వివరిస్తున్న స్టిల్ ను చిత్ర బృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇందులోనే మరో స్టిల్ లో హీరోయిన్ కేతిక శర్మతో పాటు మానిటర్‌ చూస్తూ ఉన్నారు నాగశౌర్య. ఇదిలా ఉంటే… భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో ‘లక్ష్య’ సినిమా తెరకెక్కుతోంది. ఎగ్జయిటింగ్‌ ఎలిమెంట్స్ తో, ఎంటర్‌టైనింగ్‌ వేలో, ఎంగేజింగ్‌గా స్క్రిప్ట్ తో దీనిని తెరకెక్కించినట్టు దర్శకుడు ధీరేంద్ర సంతోష్ చెబుతున్నారు. ఇందులో రెండు వైవిధ్యమైన లుక్స్ తో నాగశౌర్య ఆకట్టుకోబోతున్నారని, రెండింటి మధ్య వేరియేషన్‌ చూపించడానికి ఆయన కష్టపడ్డ తీరు స్ఫూర్తిదాయకమ’ని అన్నారు.