కాబూల్ ఎయిర్‌పోర్టులో దార‌ణ పరిస్థితులు…

825

కాబూల్ ఎయిర్‌పోర్టులో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఒక‌వైపు వేగంగా ప్ర‌జ‌ల‌ను వివిధ దేశాల‌కు త‌ర‌లిస్తున్నారు. మ‌రోవైపు గ‌డువు స‌మ‌యం స‌మీపిస్తుండ‌డంతో ప్ర‌జ‌ల్లో తెలియ‌ని భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. వారం రోజులుగా వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఆఫ్ఘ‌నిస్తాన్ ఎయిర్‌పోర్టులో ప‌డిగాపులు కాస్తున్నారు. అన్న‌పానీయాలు లేక‌పోయినా ఏదోలా బ‌య‌ట‌ప‌డితే చాలు అనుకుంటున్నారు. బ‌య‌ట ప‌రిస్థితులు స‌రిగా లేక‌పోవ‌డంతో ఎయిర్‌పోర్టు లోప‌ల నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు చుక్క‌ల‌నంటుతున్నాయి. ఒక లీట‌ర్ వాట‌ర్ బాటిల్ ధ‌ర ఏకంగా మూడు వేల రూపాయ‌ల‌కు అమ్ముతున్నారు. ఇది సామాన్య‌ప్ర‌జ‌ల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. లీట‌ర్ వాట‌ర్ బాటిల్ 40 డాల‌ర్ల‌కు, ప్లేట్ మీల్స్ ధ‌ర 100 డాల‌ర్ల‌కు అమ్ముతున్నారని ప్ర‌జ‌లు వాపోతున్నారు. మ‌రోవైపు ఎయిర్ పోర్టు బ‌య‌ట కాంపౌండ్ వాల్ వ‌ద్ద ఉన్న మురికి నాలాలో అనేక మంది ప్ర‌జ‌లు వేచి చూస్తున్నార‌ని, భ‌రించ‌లేని వాస‌న వ‌స్తున్న‌ప్ప‌టికీ ప్రాణాలు ద‌క్కించుకోవాలంటే ఎంత‌టి కంపునైనా భ‌రించ‌క త‌ప్ప‌ద‌ని అంటున్నారు. దీనికి సంబందించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.