ఆఫ్ఘన్‌లో.. అతనొక్కడే!

1153

ఇది అఫ్ఘానిస్తాన్లో ఆఖరి హిందూ మందిరం. కాబూల్‌లో ఉంది. అందులో పూజారి పంటిట్ రాకేష్ కుమార్ ని దేశం వదిలివెళ్ళడానికి ఎందరు పిలిచినా టికెట్ ఇచ్చినా సున్నితంగా తిరస్కరించారు. వారు నన్ను చంపినా పర్వాలేదు. నా పూర్వీకుల నుంచీ పూజచేస్తున్నాం ఇక్కడే. ఆఖరి శ్వాస వరకూ మందిరాన్ని, భగవంతుని సేవనూ వదిలిపెట్టను. చావు వస్తే ఇంతే నా ఆయుస్షు అనుకొని ఆనందంగా ఆహ్వానిస్తాను అంటూ పూజలో నిమగ్నమయ్యారు.ఎడారి మతాలవాళ్ళు మెడపై కత్తిపెట్టినా ఇటువంటివారు ఎందరో ఆనాడు చావుకు భయపడక త్యాగాలు చేయబట్టే ఈనాడు మనం బ్రతికున్నాం. అనైక్యతతో మన దేశంలో కూడా ఆనాటి పరిస్థితుల్లోకి నెమ్మదిగా మళ్ళీ జారుకొంటున్నాం. ఆయన గురించి చదువుతూంటే కళ్ళు చెమర్చాయి. కానీ ఏమి చేయగలం మనం. వారిని రక్షించమని కోరుకోవడం, అలాంటి పరిస్థితి మనదేశంలో హిందువులకి దాపురించకూడదని భగవంతుణ్ణి కోరుకోవడం తప్ప !

– శర్మ సిహెచ్‌విఎస్