సీబీఐ విచారణకు వైఎస్ ప్రకాష్ రెడ్డి

123

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందులలో జరుగుతున్న విచారణకు వైఎస్ ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ప్రకాష్ రెడ్డి పెద్దనాన్న అవుతారు. పులివెందుల, కడప రెండు కేంద్రాల్లో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇవాళ కీలక వ్యక్తులను అధికారులు పిలిపించి విచారిస్తున్నారు. పులివెందులలో ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో జరిగే విచారణకు ప్రకాష్ రెడ్డిని పిలిపించారు. ఈయనను సీబీఐ మొదటిసారిగా విచారిస్తోంది.

అలాగే కడప సెంట్రల్ జైలు కేంద్రంగా జరుగుతున్న విచారణకు చిట్వేల్‌కు చెందిన ప్రసాద్, పులివెందులకు చెందిన భరత్ యాదవ్‌లతో పాటు వైఎస్ మనోహర్ రెడ్డి డ్రైవర్ రసూల్, ఆయన భార్య మాబున్ని, జగదీశ్వర్ రెడ్డిలు హాజరయ్యారు.