రూ.10 లక్షలిచ్చి చేతులు దులుపుకుంటే రమ్య కుటుంబానికి న్యాయం జరుగుతుందా?

81

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

మృగాడి చేతిలో హత్యకు గురైన దళిత యువతి రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలు నారా లోకేశ్, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, దూళిపాళ్ల నరేంద్రలను అరెస్ట్ చేయటం దుర్మార్గం. వారు చేసిన తప్పేంటి ? ఎందుకు అరెస్ట్ చేశారు? హత్యకు గురైన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించి వారికి న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరటమే వారు చేసిన తప్పా? పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతలను 5 నిమిషాల్లో అరెస్ట్ చేశారు.. రమ్యను చంపిన నిందితుడిని మాత్రం అర్దరాత్రి వరకు పట్టుకోలేకపోయారు. దళిత కుటుంబానికి న్యాయం చేయమని అడిగిన వారికి అడ్డుకోవటం దళితులపైనే జరిగిన దాడే. మహిళలకు రక్షణ కల్పించడానికి ఉపయోగపడని పోలీసు వ్యవస్ద టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయటంలో మాత్రం సమర్ధవంతంగా పనిచేస్తోంది. ముఖ్యమంత్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోగా పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయటం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి ఎందుకు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు? రూ.10 లక్షలిచ్చి చేతులు దులుపుకుంటే రమ్య కుటుంబానికి న్యాయం జరుగుతుందా?

జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలు స్వేచ్ఛగా, ధైర్యంగా బయట తిరిగే పరిస్థితుల్లేవు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున , అదీ ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోని పెదకాకానిలో దళిత విద్యార్థి దారుణహత్యకు గురి కావడం రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు అనడానికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయి. గడిచిన రెండేళ్లలో ఒక్క నిందితుడిపైనా చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తోంది. ఆడబిడ్డకు కష్టమొస్తే గన్ను కంటే ముందు వస్తాడన్నజగనన్న తాడేపల్లి ప్యాలెస్ దాటి ఎందుకు బయటకు రావడంలేదు. మహిళలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతల సేవల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో దిశ చట్టం అమలు కావడంలేదు. ఏం చేసినా ప్రభుత్వం శిక్షిందనే ధైర్యంతో మృగాళ్లు పేట్రేగిపోతున్నారు.రాష్ట్రంలో శాంతి భ్రదతలు ఎక్కడున్నాయో ముఖ్యమంత్రి, మహిళా హోంమంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలి.