టీడీపీ నేతలను అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నాం

93

– శాసనమండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు

ప్రశ్నించే ప్రజా గొంతును నలపాలనుకున్న వాళ్లంతా మట్టిలో కలిసిపోయారు. దళిత విద్యార్ధిని రమ్యను అతి కిరాతకంగా హత్య చేస్తే వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసేందుకు వెళ్లిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం. ప్రివెంటి వ్ అరెస్ట్ ఏవిధంగా చేస్తారు? ఇంత వరకు ముఖ్యమంత్రి రమ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? మహిళా హోం మంత్రి సొంత జిల్లాల్లోనే ఇంత దారుణం జరిగిందంటే శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? మహిళలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు తన విధి నిర్వర్తించకపోగా బాధితురాలి కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు వచ్చిన వారిపై విచక్షణా రహితంగా ప్రవర్తించడం సిగ్గుచేటు. ఒక దళిత మాజీ మంత్రిపై అధికారి చెయ్యి చేసుకోవడం అత్యంత దారుణం. దళితుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిన్న చూపు ఉందో దీన్ని బట్టే అర్ధమవుతోంది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండి పోరాడుతుంది.