రాష్ట్రంలో అరాచక.. పాలెగాళ్ల పాలన

104

• ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో దళితయువతి, దారుణంగా చంపబడితే, ఆయన స్పందించడా?
• దళితయువతి ముఖం చూడటానికికూడా ముఖ్యమంత్రికి మనస్సురాలేదా?
• మృతురాలి కుటుంబానికి తక్షణమే కోటిరూపాయల పరిహారం అందచేయాలి.
• కుటుంబంలో ఒకరికిప్రభుత్వ ఉద్యోగమిచ్చి, చనిపోయిన యువతి తండ్రికి 5ఎకరాల పొలమివ్వాలి.
• దళితయువతి దారుణంగా నడిరోడ్డుపై చంపబడితే, నారాలోకేశ్, టీడీపీనేతలు ఆమె కుటుంబాన్ని పరామర్శించకూడదా?
• టీడీపీ నేతలను అకారణంగా అడ్డుకోవడమేకాకుండా, సౌమ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుని, గుంటూరు ఎస్పీ లాగి చెంపమీద కొడతాడా?
• ఎస్పీ కొట్టింది నక్కా ఆనంద్ బాబుని కాదు.. దళితజాతిని.
• ముఖ్యమంత్రి తక్షణమే ఘటనపై స్పందించి, సదరు పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలి.
• లేకుంటే ముఖ్యమంత్రి దళితవ్యతిరేకి, దళితద్రోహిగానే పరగణింపబడతాడు.
• ఏనాడూ ఎక్కడికీ వెళ్లిన హోంమంత్రి సుచరిత నిన్న దళితయువతి మృతదేహానికి పోస్ట్ మార్టమ్ జరిగేవరకు అక్కడేఎందుకున్నారు?
• తెలుగుదేశం నేతలు వస్తారు.. వారిని అడ్డుకొని అవమానించమని పోలీసులు చెప్పడానికే అమె అక్కడున్నారా?
• యువతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినవారిని అడ్డుకునేందుకు అనుచరులతో వచ్చిన వైసీపీఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని వదిలేసి, పోలీసులు ప్రతిపక్షనేతలను అరెస్ట్ చేయడమేంటి?
• యువతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టీడీపీనేతలపైకి అనుచరులను వేసుకొచ్చి వీరంగం వేసిన వ్యక్తిని వదిలేసి, టీడీపీవారిని ముందస్తు అరెస్ట్ లు చేస్తారా?
• ప్రభుత్వం తక్షణమే టీడీపీనేతలను బేషరతుగా విడుదలచేయాలి.
* టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

రాష్ట్రంలో అరాచక, అప్రజాస్వామిక, నియంత, ఫ్యాక్షనిస్ట్, పాలెగాళ్ల పాలన సాగుతోందని, ఏపీలో మచ్చుకుగుంటూరు నగరంలో నేడు ఏమిజరుగుతోందో ప్రతిఒక్కరూ గమనించాలని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యుల వర్ల రామ య్య కోరారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే…నిన్న ముఖ్యమంత్రి స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో పాల్గొని, రాష్ట్రంలో శాంతిభద్రతలు బ్రహ్మండంగా ఉన్నాయని చెబుతున్న సమయంలోనే, ఒక దుండగుడు, తొమ్మిదో తరగతిచదివిన పనికి మాలిన యువకుడు, బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న దళితయువతిని కత్తితో పొడిచేశాడు. అటుపక్కన ముఖ్యమంత్రి అంతాబ్రహ్మండంగా ఉందనిచెబుతున్నప్పుడే, దుండగుడి ఆకృత్యానికి దళితయువతి బలైంది. మరణించిన యువతి కుటుం బానికి రూ.10లక్షలిచ్చామని ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారు. అదేనా ఆయన చెప్పాల్సింది…చేయాల్సింది? ఎవరి తాతసొమ్మని ఆయన రూ.10లక్షలిచ్చాడు?

ప్రభుత్వ అసమర్థత, అవగాహాన రాహిత్యంవల్ల దుండగుడి దుర్మార్గానికి యువతి బలైపోతే, పది లక్షలిచ్చామని ముఖ్యమంత్రిగా ఉన్నవ్యక్తి చెప్పడమేంటి? సదరు యువతి బీటెక్ పాసై, ఆమెకుటుంబానికి ఆసరాగా నిలవాల్సి ఉం ది? కానీ ఇప్పుడేం జరిగింది. ఆయువతి తల్లిదండ్రులు ఆమెపై పెట్టుకున్నఆశలన్నీ ఈ పనికిమాలినిప్రభుత్వంలో నీరుగారిపోయా యి. తమబిడ్డ బయటకువెళ్లింది.. తిరిగొస్తుందని ఎదురుచూసిన వారికి, వారిబిడ్డశవమై తిరిగొస్తే, ముఖ్యమంత్రి పదిలక్షలిచ్చామని చెప్పడం న్యాయమా? విశాఖపట్నంలో జరిగిన గ్యాస్ లీకేజీ దుర్ఘ టనలో కంపెనీ యాజమాన్యాన్ని చీమ కూడా కుట్టకుండా చేసిన ముఖ్యమంత్రి, ఆనాడు చనిపోయినవారికి కోటిరూపాయలు ఇచ్చా డు.

ఈనాడేమో తనప్రభుత్వ అసమర్థతకారణంగా యువతి బలై పోతే, రూ.10లక్షలిచ్చామని చెబుతాడా? సదరుయువతి కుటుం బానికి న్యాయంచేయాలని, కోటిరూపాయల పరిహారమివ్వాలని తెలుగుదేశం గొంతెత్తి నినదిస్తుంటే, ప్రతిపక్షనేతలను అక్రమంగా అరెస్ట్ చేయిస్తారా? పోలీసులతో వారిని బరబరా ఈడ్చుకెళతారా? ముఖ్యమంత్రి ఇంటిపక్కనే, స్వాతంత్ర్యదినోత్సవం నాడు దళిత యువతి ప్రాణాలు హరించబడినందుకు, ప్రభుత్వం సిగ్గుపడాలి. విశాఖ ఘటన జరిగినప్పుడు, ముఖ్యమంత్రి కంపెనీకి సంచులు సరఫరాచేసే పరిశ్రమలో ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యేక విమానం లో వెళ్లిన ముఖ్యమంత్రి, నిన్న దళితబిడ్డ దారుణంగా కత్తిపోట్లకు గురై, హతమార్చబడితే కనీసం చూడటానికి కూడా వెళ్లడా? యు వతి శవాన్ని చూడటానికి కూడా ముఖ్యమంత్రి రారా? దళిత బిడ్డ ముఖం చూడటానికి కూడా ఈ ముఖ్యమంత్రికి మనస్సురాలేదా? ఆ బిడ్డ ఏంపాపంచేసుకుందని ఈ ముఖ్యమంత్రి అలా వ్యవహరిం చాడు? ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లుతెరవాలి. దళితయువతి కుటుంబానికి కోటిరూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబంలో ఎవరోఒకరికి ప్రభుత్వ ఉద్యోగ మివ్వాలి. చనిపోయిన యువతి తండ్రికి ప్రభుత్వం 5ఎకరాల పొలమిచ్చి, దాన్నిసాగుచేసుకునే అవకాశమివ్వాలి. ముఖ్యమం త్రి తక్షణమే వెళ్లి, మృతురాలి కుటుంబాన్ని పరామర్శించాలి. ఆయన ఆపనిచేయకుంటే, దళితులంటే ఈ ముఖ్యమంత్రికి చిన్న చూపని, అసహ్యమని అనుకోవాల్సి వస్తుంది. దళితులంటే ముఖ్యమంత్రికి చిన్నచూపని తానే ఇంటింటికీ తిరిగిప్రచారం చేస్తాను.

ముఖ్యమంత్రి నేడు వెళ్లాల్సింది బడికికాదు.. దళితయువతి ఇంటికి. ఆనాటిబడి.. ఈనాటి బడి అని కాలక్షేపం చేయడం కాదు, ముఖ్యమంత్రి చేయాల్సింది. ఆయనతక్షణమే తానున్న చోటునుం చినేరుగా గుంటూరుకు వెళ్లి, దళితయువతి కుటుంబాన్ని పరామ ర్శించి, యువతి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి. తప్పయిపోయిం దమ్మా.. నిన్ననే నేనురావాల్సింది.. తనప్రభుత్వమంతా సిగ్గుతో కుమిలిపోయిందని ముఖ్యమంత్రి యువతి కుటుంబసభ్యులతో చెప్పాలి. లేకపోతే, ముఖ్యమంత్రి దళితద్రోహి, దళిత వ్యతిరేకిగానే పరిగణింపబడతారు. ముఖ్యమంత్రి ఎంతో ఆర్భాటంగా చెప్పిన దిశా యాప్ ఏమైంది? ప్రభుత్వం చెబుతున్న సీ.సీ.కెమెరాలు ఏమయ్యాయి? యువతిని నడిరోడ్డుపై చంపేసి, పారిపోయిన వాడి ని, ఎవరో దారినపోయేవాడు చెప్పేవరకు పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారు? ప్రభుత్వ దిశాయాప్ ఏదిశలో ఉంది. ప్రభుత్వమే ఈవిధంగా ఆర్బాటపుప్రకటనలతో ప్రజలను మోసగి స్తుంటే, ఎవరికి చెప్పుకోవాలి?

యువతిని నడిరోడ్డుపై కత్తితో పొడుస్తున్న దృశ్యాలుచూస్తుంటే కళ్లవెంట నీరాగలేదు. ఒక దళిత కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన ఆడబిడ్డ, శవమై వస్తే, ముఖ్య మంత్రికి కనీసస్పందన లేదు. నడిరోడ్డుపై కత్తితో యువతిని దారుణంగా పొడిచినవాడిని పట్టుకోలేని, దిశాయాప్ ఎందుకు? ఆ దరిద్రం ఉన్నాఒకటే…లేకున్నా ఒకటే. మహిళపై అత్యాచారం జరిగితే గన్నుకంటే ముందు జగన్ వస్తాడన్నారు. ఏగన్ను రాలే దు.. చివరికి ఆడబిడ్డ శవమైంది. హోంమంత్రిసుచరిత దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించారు.. పోస్ట్ మార్టమ్ జరుగు తున్నంతసేపూ అక్కడే ఉన్నారట. అలావెళ్లడం మంచిదే, సంతోష మే. కానీ ఏనాడూ హోంమంత్రి అలావెళ్లిందిలేదు… మామూలుగా అయితే ఆమెవెళ్లరు కూడా. కానీ ఈ ఘటనలో ఎందుకువెళ్లారన్న దే తమసందేహం. ఏమి కుట్రజరుగుతోందో తెలియాలి. రాజమ హేంద్రవరంలో కొందరు దుండగులు, దళితయువతిపై సామూహి కంగా అత్యాచారం జరిపినప్పుడు హోంమంత్రి అక్కడికి వెళ్లలేదేం? మాదిగవర్గానికి చెందిన దళితయువకుడికి, ఇసుకమాఫియా పోలీస్ స్టేషన్లో శిరోముండనంచేస్తే, ఆనాడు సుచరితగారు అటువైపు కన్నెత్తైనా చూడలేదేం? శిరోముండనంచేసిన వారిని కనీసం హోంమంత్రిహోదాలో ఆమె నిలదీయలేదేం? మాస్క్ పెట్టు కోలేదని కిరణ్ కుమార్ ను పోలీసులే కొట్టిచంపినప్పుడు హోం మంత్రి అక్కయ్య అక్కడికి వెళ్లలేదేం? చిత్తూరులో ఓంప్రతాప్ అనే యువకుడిని చంపేసినప్పుడు, ముఖ్యమంత్రి సొంత నియోజకవ ర్గంలో దళితమహిళపై దారుణంగా అత్యాచారం జరిపి, హత్యచేసి నప్పుడు హోంమంత్రివర్యులు ఎందుకు వెళ్లలేదు?ఎక్కడికీ, ఏనాడూ వెళ్లని హోంమంత్రిగారు.. నిన్నదళిత చంపబడిన దళితయువతి వద్దకు ఎందుకువెళ్లారు? పోస్ట్ మార్టమ్ జరిగేవరకు అక్కడే ఎందుకున్నారు?

తెలుగుదేశంనాయకులు, నారాలోకేశ్ యువతికుటుంబాన్ని పరా మర్శించడానికి వస్తారని, వారినేదో చేయాలనే హోంమంత్రి అక్కడే ఉన్నారా? జిల్లాఎస్పీ ఎందుకు వచ్చారు?
సాధారణంగా ఇటువం టిఘటనలు జరిగినప్పుడు ప్రతిపక్షనేతలు పరామర్శించడానికి వెళ్లడమనేది సహజంగా జరిగేదే. కానీ మృతురాలు రమ్య ఇంటి వద్దకు వైసీపీఎమ్మెల్సీ లేళ్లఅప్పిరెడ్డి, అనుచరులను వెంటేసుకొని ఎందుకు వెళ్లాడో ప్రభుత్వం సమాధానంచెప్పాలి. హోంమంత్రి, ముఖ్యమంత్రి దీనిపైసమాధానంచెప్పాలి. రమ్య కుటుంబాన్ని పరా మర్శించడానికి ప్రతిపక్షాలు వెళ్లాయంటే అదివాటిబాధ్యత. కానీ లేళ్ల అప్పిరెడ్డి అధికారపార్టీకి చెందిన వ్యక్తి. ఆయన అనుచరుల ను పోగేసుకొని ఏదో కొట్లాటకు వెళ్లినట్లు వెళ్లాల్సిన అవసరమేంటి ? అలావెళ్లిన వ్యక్తిని కదా పోలీసులు అడ్డుకోవాలి.. ఆయన్ని, వెంట ఉన్నవారిని కదా అరెస్ట్ చేయాలి. అదిచేయకుండా పరామ ర్శకు వెళ్లిన లోకేశ్ గారిని అరెస్ట్ చేస్తారా? ఆయన్ని అడ్డుకుంటా రా? ఏమిటి ఆయనచేసిన నేరం? నేరం చేసిన లేళ్లఅప్పిరెడ్డిని వదిలేసి, లోకేశ్ ను అరెస్ట్ చేస్తారా? ప్రతిపక్షనేతలు వచ్చే ప్రదేశా నికి, అధికారపార్టీనేతలు రాకుండా చూడాల్సింది పోలీసులు కాదా? అప్పిరెడ్డిని కదా ముందస్తుగా అరెస్ట్ చేయాల్సింది.. అది చేయకుండా తెలుగుదేశంనేత, మాజీమంత్రిని అకారణంగా అరెస్ట్ చేస్తారా?

సౌమ్యుడు,సుదీర్థకాలంగా రాజకీయాల్లో కొనసాగుతు న్న మాలసామాజికవర్గానికి చెందిన నక్కా ఆనంద్ బాబుని ఎస్పీ లాగిచెంపమీద కొడతాడా? పోలీస్ అధికారి నక్కాఆనంద్ బాబుని కొట్టడం, దళితులను కొట్టడమే. సదరుఎస్పీపై ప్రభుత్వం ఏంచర్యలు తీసుకుంటుందని తాను ప్రశ్నిస్తున్నా. ఎస్పీ కొట్టింది నక్కా ఆనంద్ బాబునికాదు.. దళితవర్గాల చెంపమీద కొట్టాడు. ఈ వ్యవహారంలో దళితవర్గాలన్నీ ఒకతాటిపైకి వచ్చి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. విబేధాలు, తారతమ్యాలులేకుండా, ఆనంద్ బాబుని కొట్టడం, తమనుకొట్టినట్టే నని భావించాలి. మాజీమంత్రి అని తెలిసి, నిత్యం ఆయన ప్రజాసమస్యలపై పోరాడతాడని తెలిసి, ఎస్పీ ఆయన్ని లాగిచెంపమీద కొడతాడా? దీనిపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు? పోలీస్ అధికారికి అంతధైర్యం ఎక్కడి నుంచివస్తుంది? దళితుడు పదేపదే తమను ప్రశ్నిస్తున్నాడు కాబట్టి, కొట్టమని ముఖ్యమంత్రే చెప్పారా? లేక హోంమంత్రి చెప్పారా? రమ్య మృతదేహానికి పోస్ట్ మార్టమ్ జరిగేవరకు హోం మంత్రి అక్కడున్నది, ఇందుకేనా?మాజీమంత్రిపై పోలీస్ అధికారి చెయ్యేత్తేలా చేయడానికే, ఆమె అక్కడ అంతసమయం గడిపారా?

దళితవర్గానికి చెందిన మాజీమంత్రి, ఏనాడూతప్పుచేయని వ్యక్తిని కొట్టే ధైర్యం పోలీస్ అధికారికి ఎక్కడినుంచి వచ్చింది? సదరు పోలీస్ అధికారిని ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ అధికారి కొట్టింది మాజీ మంత్రిని కాదు.. దళితవర్గాన్ని. ఎంతోకాలం శాసనసభ్యుడిగా పని చేసిన ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ను బరబరా ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్ లో పడేస్తారా? ఇదంతా ముఖ్యమంత్రి, హోంమంత్రి ముందుగా మాట్లాడుకొని చేసిన పథకంప్రకారం చేసిందే. ఒకకుట్ర ప్రకారమే ముఖ్యమంత్రి ఇదంతా చేయించారు. ప్రభుత్వ ఆలోచనేమిటి.. పోలీసుల ప్లాన్ ఏమిటి? నరేంద్రకుమార్ ను బరబరా ఈడ్చుకెళ్లి పడేస్తారా? ఆయన్నిచంపేస్తారా? మరో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కిందపడితే, ఆయన్ని పోలీసులు బూటుకాళ్లతో తంతారా? ఏమిటిది..? ప్రతిపక్షాలు వాటి విధినిర్వహణ అవి చేయకూడదా? నారాలోకేశ్, ఇతర టీడీపీనేతలు దళితయువతి కుటుంబాన్ని పరామర్శిస్తే తప్పా? నారాలోకేశ్ ఏంచేశాడని ఆయన్ని అరెస్ట్ చేశారు? ఎక్కడెక్కడో తిప్పి, పత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలిస్తారా? ఆయనచేసిన నేరమేంటి? ప్రతిపక్షనేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టిన లేళ్ల అప్పిరెడ్డిని వదిలేసి, టీడీపీనేతల ను అడ్డుకొని, వారిని అరెస్ట్ చేయడమేంటి? ప్రతిపక్షనేతలపైకి కిరాయిమూకలను వేసుకొని వచ్చిన అప్పిరెడ్డిని కదా అరెస్ట్ చేయాల్సింది?
రాత్రంగా హోంమంత్రి రమ్య మృతదేహానికి పోస్ట్ మార్టమ్ చేసేవరకు అక్కడే ఎందుకున్నారు? మంత్రిగారు ఏ పథకంతో అక్కడంతసమయం గడిపారు? యువతిని దారుణంగా చంపేస్తే, సదరు యువతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన టీడీపీనేతలను అడ్డుకోవడమేంటి? ప్రభుత్వం ఎందుకిలా ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటూ, వారిచర్యలను ఎందుకిలా ఊచకోత కోస్తోంది.

ఆఫ్గాన్ లో తాలిబన్లు కూడా ఇంతదారుణంగా వ్యవహరిం చలేదు. ప్రతిపక్షనేతలు వస్తే, లేళ్లఅప్పిరెడ్డిని తాము ఆపలేమని, మీరు రావొద్దని ముఖ్యమంత్రి, పోలీసులు ముందే చెప్పాల్సింది. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లుకనీసం ముందస్తు హెచ్చరికలు అయినా చేశారు..కానీ ఈ ముఖ్యమంత్రి అదికూడా చేయడంలేదు. ఇదేం ప్రభుత్వమో ఆయనేచెప్పాలి. ఆడబిడ్డల మానప్రాణాలకు ముఖ్య మంత్రి పాలనలో రక్షణలేదు. మరీముఖ్యంగా దళితబిడ్డల మానప్రాణాలకు అసలే రక్షణలేదు. మహిళల మానప్రాణాలను కాపాడలేని అసమర్థ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. దిశాయాప్ అంతా మోసం. చట్టమేలేకుండా దిశాయాప్ ఎలాతెస్తారు?

దానికి అసలు చట్టబద్ధతే లేనప్పుడు అది ఎలా ఉపయోగపడుతుంది? టీడీపీనేతలను అడ్డుకొని, వీరంగం వేస్తున్న పోలీసుల ఓవరాక్షన్ ను చిత్రీకరించకుండా మీడియవారిని కూడా కొడతారా? వారి పనిని కూడా చేసుకోనివ్వరా? మీడియామీద కూడా జులుం ప్రదర్శిస్తారా? ఎమర్జన్సీ సమయంలోకూడా ఇలా జరగలేదు. ఈ ప్రభుత్వం విపరీతధోరణితో వ్యవహరిస్తోంది. ఇది ఎంతమాత్రం మంచిదికాదు. ప్రభుత్వఅసమర్థత వల్ల నష్టపోయిన ప్రతి దళిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మందస్తు అరెస్ట్ లు చేసిన వారందరినీ ప్రభుత్వం తక్షణమే విడు దలచేయాలని, ఘటనలో అసలు సూత్రధారైన లేళ్లఅప్పిరెడ్డిని తక్షణమే అరెస్ట్ చేసి, విచారించాలని డిమాండ్ చేస్తున్నాం.