నా ఎదుగుదలలో కీలక పాత్ర గజ్జల మల్లారెడ్డిదే

252

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తన ఎదుగుదల మొత్తంలో కీలక పాత్ర గజ్జల మల్లారెడ్డిదేనని గర్వంగా చెప్తానని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో గజ్జల మల్లారెడ్డి స్మారక పురస్కారాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు గొప్పదనం గురించి నలుమూలలా చాటి చెప్పిన బ్రౌన్ గ్రంథాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గజ్జల మల్లారెడ్డి హయాంలో ఉన్న మీడియా మళ్లీ తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నానని సజ్జల అన్నారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ, గజ్జల మల్లారెడ్డి స్మారక అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. గజ్జల మల్లారెడ్డి లాంటి ముక్కుసూటి తనం, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మీడియాలోకి వచ్చిన వాళ్లలో నేనూ ఒకడ్ని, విలువలతో కూడిన జర్నలిజాన్ని, సమాజానికి ఉపయోగపడే జర్నలిజాన్ని ప్రోత్సహించాలని దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు.