జ‌గ‌న్‌ పాల‌న‌లో ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ‌లేని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

230

– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

నందిగామ టౌన్ : సోమవారం ఉదయం మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య తన కార్యాలయంలో ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్స‌వం నాడే బీటెక్ విద్యార్థిని ర‌మ్యపై ఘాతుకం తీవ్రంగా క‌ల‌చివేసింది. రెండున్న‌రేళ్ల వైసీపీ పాల‌నలో మ‌హిళ‌ల‌కు క‌రువైన భ‌ద్ర‌త. మా అన్న ఉన్నాడు జగనన్న వస్తాడు అని అసెంబ్లీ సాక్షిగా అన్నమాటలు రాష్ట్రము ప్రజానీకం మొత్తం చూసింది. నిండు శాసనసభలో ఆడపిల్లకు అన్యాయం జరిగితే , గన్ వస్తుందో లేదో తెలియదు కానీ జగన్ మాత్రం వస్తాడు అని ఒక శాసనసభ్యురాలు గొప్పలు చెప్పారు.

మహిళలు అర్ధరాత్రి కూడా ధైర్యంగా తిరగగలిగినప్పుడే , నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి.. ఆగస్టు 15 రోజునే విద్యార్థిని దారుణహత్యకు గురైతే ఏం సమాధానం చెప్తారు? పక్క రాష్ట్రంలో యువతిపై అత్యాచారం, హత్య జరిగితే దిశ పేరుతో చట్టం తెచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు నోరుమెదపటం లేదు? దిశ‌చ‌ట్టం పేరుతో ప్ర‌చారంపై పెట్టిన శ్ర‌ద్ధ మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌పై చూప‌ని ప్ర‌భుత్వం

ఈ రెండున్నరేళ్లలలో మహిళలపై సుమారు 300 కి పైగా దాడులు జరిగాయి, ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు. ర‌మ్య‌ని అత్యంత దారుణంగా చంపిన హంత‌కుడ్ని క‌ఠినంగా శిక్షించాల‌ని, రాష్ట్రంలో మ‌రో మ‌హిళ‌కు అన్యాయం జ‌రగ‌కుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు.