విద్యాలయాలు కాదు జగన్ రెడ్డి కంపెనీలకు నాడు నేడు

89

– మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్

నాడు నేడు పేరుతో జగన్ రెడ్డి అన్యాయులకు కాంట్రాక్టుల రూపంలో ప్రభుత్వ నిధుల్ని దోచిపెట్టడం తప్ప.. దీనివల్ల విద్యార్ధులకు, తల్లితండ్రులకు ప్రయోజన శూన్యం. ఉన్న భవనాలకు రంగులేసి నాడు నేడు అని ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటు. నాడు నేడు పధకం కాంట్రాక్టర్లలంతా వైసీపీ నేతలే. తక్కువ క్యాలిటీ మెటిరీయల్ వాడి కోట్ల రూపాయిలు బిల్లులు మార్చుకుంటున్నారు. ఈ పధకంతో వైసీపీ నేతల ఆర్దిక పరిస్థితులు మారాయి తప్ప స్కూళ్ల పరిస్థితులు ఏమాత్రం మారలేదు.

ఒక్క వైపు అవసరం ఉన్నా లేకపోయినా పేజీలకు పేజీల పత్రికా ప్రకటనలతో జగన్ అవినీతి పుత్రికకు దోచిపెడితే.. మరో వైపు బస్తాలకు బస్తాలకు అవసరం ఉన్నా లేకపోయినా భారతీ సిమెంట్స్ ను వాడుతూ జగన్ రెడ్డి కంపెనీలను లాభాల బాట పట్టించుకున్నారు తప్పా నిజానికి నాడు నేడు అనేది పాఠశాలల పేరుతో జగన్ రెడ్డి దోపిడి పథకం. పసిపిల్లలకు అందించే పుస్తకాలు, బాగ్ విషయాల్లోను అవినీతికి పాల్పడం దుర్మార్గం.

నాడు నేడు పనుల్లో జరుగుతున్న అక్రమాలకు ఎంతో మంది ఉపాధ్యాయులు మనోవేధనకు గురి అయ్యారు. కొంత మంది ఒత్తికి తట్టుకోలేక చనిపోయారు. నాణ్యమైన విద్యలో చంద్రబాబు హాయంలో 3వ స్థానం నుంచి జగన్ రెడ్డి 19 వస్థానానికి దిగజార్చారు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదు. సీబీఎస్ఈ, ఆంగ్ల మాధ్యమం, అంగన్ వాడీల మార్పు, ప్రాథమిక పాఠశాలు ప్రశ్నార్ధకం ఇలా రక రకాల తుగ్లక్ విధానాలతో విద్యా వ్యవస్థను జగన్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారు.