మంత్రి జయరాం తమ్ముడి కారు డ్రైవర్ అరెస్ట్

134

కర్నాటక అక్రమ మద్యం రవాణా కేసులో మంత్రి గుమ్మనూరు జయరాం తమ్ముడి కారు డ్రైవర్ అంజిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్ఈబీ అధికారులు కారు డ్రైవర్ అంజిని విచారిస్తున్నారు. అధికారుల విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విచారణలో కారు డ్రైవర్ అంజితో పాటు మరో ఐదుగురు వైసీపీ నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వైసీపీ నేతల పేర్లు కూడా బయటకు రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా పోలీసుల విచారణలో మరికొందరి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విచారణలో మరికొంతమంది పేర్లు ఉండడంతో అధికారులు గోప్యత పాటిస్తున్నారు.