గుంటూరులో లోకేష్‌ అరెస్ట్

89

టీడీపీ నేత నారా లోకేష్‌పొలిటికల్ కెరీర్‌లో తొలిసారిగా అరెస్టయ్యారు.గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యుల పరామర్శలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు విధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సోమవారం గుంటూరులో నిన్న ఉన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య నివాసానికి వెళ్లారు. ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. తర్వాత కుటుంబసభ్యులను పరామర్శించి.. వారిని ఓదార్చారు. పరామర్శకు వెళ్లిన టీడీపీ నేత నారా లోకేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పొలిటికల్ కెరీర్‌లో తొలిసారిగా అరెస్టయ్యారు. లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు ధూళిపాళ్ల, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబును అరెస్ట్ చేశారు. లోకేష్‌ను ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. మరికొందరు టీడీపీ నేతలు నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజాలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మాజీ మంత్రులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్ పోలీసులు చేశారు. టీడీపీ నేతల అరెస్టులను ఆ పార్టీ నేతలు ఖండించారు. పోలీసుల తీరును టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు.