దళితనేతపై చేయేసిన ఎస్పీని అంతతేలిగ్గా వదిలేదిలేదు

123

• జగన్ ప్రభుత్వంలో సామాన్యదళితులతోపాటు, దళితవర్గానికి చెందిన నేతలకు కూడా రక్షణలేదని నేటితో తేలిపోయింది.
• ఆనంద్ బాబు పై గతంలోకూడా పోలీసులు పలుమార్లు దురుసుగా ప్రవర్తించారు.
• దళితనేతపై చెయ్యేసిన ఎస్పీని గంటలవ్యవధిలో సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించాల్సిన డీజీపీ ఏంచేస్తున్నాడు?
• తాడేపల్లి ఆదేశాలే పరమావధిగా పనిచేస్తున్న ఖాకీలందరూ భవిష్యత్ లో పశ్చాత్తాప్పడక తప్పదు.
• ఎస్పీ విశాల్ గున్నీపై ప్రభుత్వం చర్యలు తీసుకునేవరకు దళితసంఘాలు ఊరుకోవు.
• మాజీమంత్రిపై దురుసుగా ప్రవర్తించిన ఎస్పీపై ప్రైవేట్ కేసులుపెట్టి, శిక్షపడేలా చేస్తాం.
* మాజీ మంత్రి కే.ఎస్.జవహర్

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక రాష్ట్రంలోని దళితుల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పడానికి, వరుసగా జరు గుతున్న సంఘటనలే నిదర్శనమని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కే.ఎస్.జవహర్ స్పష్టంచేశారు. సోమవారం ఆయన తననివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

దళితులపై శిరోముండనాలు, హత్యలు, అత్యాచారాలు, వేధింపులు , దౌర్జన్యాలు చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీల నాశనానికే ముఖ్యమంత్రి అయ్యాడా అన్నసందేహం కలుగుతోంది. దేశస్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భం లో, రమ్య అనే దళితయువతిని హతమార్చడం ద్వారా జగన్ ప్రభుత్వం, ప్రజలకు గొప్ప కానుకఇచ్చింది. దళితు లంటే అణచివేతలు భరించేవారు, అణగారిన వారనే భావన ప్రభుత్వంలో, పాలకుల్లో ఉన్నట్లుంది. జగన్ ప్రభుత్వంలో దళితులు ద్వితీయశ్రేణి పౌరులుగా మనుగడ సాగిస్తున్నా రు. ఒక జిల్లా ఎస్పీగా ఉన్న విశాల్ గున్నీ, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన ఆనంద్ బాబుపై చేయివేసి నెట్టడమేంటి ? అసలు ఆ ఎస్పీ ఎవడు… ఎక్కడినుంచి వచ్చాడు…?

దళితసోదరుడిపై చేయివేసే అధికారం సదరుఎస్పీకి ఎవరి చ్చారు. జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లుతాగుతూ, దళితుల పై అహంకారంగా వ్యవహరించిన ఎస్పీ సంగతేమిటో ప్రభు త్వం తేల్చాలి. ఎస్పీ తానుచేసిన తప్పు ఒప్పుకొని, మాజీ మంత్రికి బహిరంగక్షమాపణలు చెప్పాలి. ప్రభుత్వం వెంటనే ఎస్పీ విశాల్ గున్నీని సస్పెండ్ చేయాలి. ఎస్పీని ప్రభుత్వం సస్పెండ్ చేసేవరకు దళితులు వదిలిపెట్టరు.

ఆనంద్ బాబు అంటే ఆషామాషీ వ్యక్తికాదనే విషయం ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన నారాలోకేశ్, ఇతర టీడీపీనేతలను అడ్డుకోవాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చిందన్నారు? ప్రజలను, ఆడవాళ్లను రక్షించడం చేతగాని పోలీసులు, పరామర్శకు వెళ్లిన టీడీపీ వారిని అడ్డుకోవడమేంటి? రమ్యకుటుంబానికి అండగా ఉం టామని లోకేశ్ యువతికుటుంబానికి అండగా నిలిస్తే, ప్రభు త్వం ఎందుకంతలా ఉలిక్కిపడుతోంది. దళితనేతపైచేయి చేసుకున్నఎస్పీని అంతతేలిగ్గా వదిలిపెట్టం. ఈనాడు ఆనంద్ బాబుపై చేయివేసినవారు, భవిష్యత్ లో మరొకరిని ఏదోఒకటి చేస్తారు. ఎస్పీ విశాల్ గున్నీపై ప్రైవేట్ కేసులు వేసి, ఆయనకు శిక్షపడేలాచేస్తాం. దళితులను చంపేసినా, దళితఆడబిడ్డలమానాలు హరించి ప్రాణాలు తీస్తున్నా ఎవరూ ఏమీ మాట్లాడకూడదా? డాక్టర్ సుధాకర్ ఘటన మొదలు రమ్య హత్యవరకు ప్రభుత్వం దళితులకు ఏం న్యాయం చేసి, ఎందరిని కాపాడింది?

దళితుల రక్షణ విష యంలోప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. రమ్య కుటుంబానికి ప్ర్రభుత్వం రూ.10లక్షలు ఇవ్వడమేంటి ? గతంలో తనకు అనుకూలమైనవారికి కోటిరూపాయల పరిహారాలు ఇప్పించిన జగన్మోహన్ రెడ్డి, దళితయువతి కుటుంబానికి కేవలం పదిలక్షలిచ్చిచేతులు దులుపుకుంటా డా? తమబిడ్డ పోయిందని రమ్య తల్లిదండ్రులు విలపిస్తుంటే, వారి కడుపుకోతకు ఈ ముఖ్యమంత్రి రూ.10లక్షలతో విలువకడతాడా? రమ్యను రక్షించలేని దిశాచట్టం, ప్రభుత్వం ఉన్నాఒకటే, లేకున్నా ఒకటే. దళితు లపై అత్యధికంగా దాడులు, దౌర్జన్యాలుజరిగే రాష్ట్రంగా ఏపీ నిలిచింది.

రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం, డీజీపీ తాడేపల్లి ఆదేశాలప్రకారమే నడుచుకుంటున్నారు. దళితనేతపై చేయే సిన ఎస్పీని గంటలవ్యవధిలో సస్పెండ్ చేయాల్సిన డీజీపీ ఎక్కడున్నాడు? దళితులకు, దళితనేతలకు రాష్ట్రంలో రక్ష ణలేదని జరగుతున్న సంఘటనలే చెబుతున్నాయి. ఎస్పీ దళితనేతపై చేయివేయడం ద్వారా, దళితులపరిస్థితి జగన్ జమానాలో ఎలా ఉందో ప్రతిఒక్కరూఅర్థంచేసుకోవాలి. దళిత నేతపైచేయేసిన అధికారికి తగినసత్కారం చేసేవరకు దళిత జాతి వదిలిపెట్టదని పత్రికాముఖంగా స్పష్టంచేస్తున్నాం.