మరి జగన్ పాలన అది…మన్నించు మహాత్మా!

253

అర్ధరాత్రి ఆడది ఒంటరిగా రోడ్డు పై నడిచిన రోజు స్వాతంత్ర్యం వచ్చింది అని మహాత్మా గాంధీ అన్న మాటలు ఈనాడు అ మాటలు అసువులు బాసాయి అనడానికి నిన్న గుంటూరు రమ్య హత్య నిలువెత్తు నిదర్శనం .

దళిత మహిళను హోం మంత్రి చేశాము అని జబ్బలు చరుచుకొనే జగన్ సర్కార్ ఈ రోజు దళిత విద్యార్థిని నడి రోడ్డుపై , పోలీసు స్టేషన్ కి కూత వేటు దూరంలో నడి రోడ్డుపై క్రూరంగా హత్య చేస్తే 10 లక్షలు పరిహారం ఇచ్చి పశుపతి పాత్ర పోషించిన వైనం సిగ్గు చూస్తుంటే ఒక మహిళ గా గుండె తరుక్కపోతుంది .

ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి తన సొంత ఇంటి మహిళను ఎలా గౌరవిస్తారో, అలానే రాష్టంలో ప్రతి మహిళ సొంత తల్లిగా ,చెల్లిగా చూసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఈ రోజు తన బాధ్యత మరిచి మాటలకు మాత్రమే ముఖ్యమంత్రి ,చేతల్లో చేయడంలో విఫలమయ్యారని సొంత పార్టీ నేతలే గుసగుసలు అడుకుంటున్నారు..

అసలు ఆంద్రప్రదేశ్ లో ఈ రెండు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వ పని తీరు చూస్తుంటే , నాకు ఊహ తెలిసిన అప్పటినుచి ఇటువంటి దగకోరు, దౌర్భాగ్య ముఖ్యమంత్రి లేడు ,భవిష్యత్తు లో రాడు అని బలంగా చెప్పగలను ..

దళితులపైన నిత్యం హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న ఈ రాష్ట్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే ఆగస్టు 15 న కూడా దళితులపై హత్యాకాండలు ఆగలేదు. ఉదయం 10 గంటలకు జెండా జాతీయ జెండా ఎగరవేసే సమయంలోనే…. గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలో బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థినిపై అత్యంత దారుణంగా దాడి చేసి కత్తితో పొడిచి, పొడిచి, చంపిన దుర్ఘటన జరిగింది. అంటే మన శాంతి భద్రతల ఏమైపోయాయీ..

జగన్ ఆనాడు గొప్పగా చెప్పిన మాట గన్ కంటే ముందు వచ్చి అన్యాయం జరిగినా ఆడపిల్లకు న్యాయం చేస్తా అని చెప్పి పట్ట పగలు దళిత ఆడపిల్లను కిరాతకంగా హత్య చేసిన కిరాంతకుడ్ని ఏమి చేశాడో చెప్పాలి..

పక్క రాష్ట్రంలో దిశ ఘటన జరిగితే, ఆంధ్రప్రదేశ్ లో దిశ వంటి చట్టాలను తీసుకోవొచ్చి సొంత రాష్టంలో ఎంతో మంది అమ్మాయిలు రేప్ లకి గురై, హత్య లు గావించబడుతుంటే మొద్దు నిద్రపొత్తు పోతున్న నీ వైఖరి ఏమిటో అర్థం కావడం లేదు..

దళితులకి హోం మంత్రి పదవి ఇచ్చి, అధికారాన్ని ని చేతిలో పెట్టుకొని మహిళ హోం మంత్రి నీ కీలు బొమ్మను చేసి దళితులపై కపట ప్రేమ చూపించే మీకు ముఖ్యమంత్రి గా కొనసాగే అర్హత లేదు…తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి . ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ సంఘటన.

ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్థి రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన తెలుగుదేశం నాయకులకు అరెస్టు చేయడందారుణం . టీడీపీ నేతలు నారా లోకేష్, ప్రత్తిపాడు పుల్లారావు, నక్కా ఆనందబాబు, అలపాచి రాజా, ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేయడం అనైతికం.ఏపీలో వైసీపీ అరాచక పాలనలో పట్టపగలు ఆడపిల్ల సొంత ఇంట్లోనైనా భద్రంగా ఉండగలిగితే స్వాతంత్య్రం వచ్చినట్లేనని మహిళా లోకం భావిస్తోందన్నారు.

గత రెండేళ్లలో 500పైగా మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరిగాయని, నేటికీ చాలా కేసుల్లో నిందితుల్ని పట్టుకోలేకపోవడం ప్రభుత్వ చేతకాని తనమా? లేక నిందితులకు ప్రభుత్వమే రక్షణ కల్పిస్తోందా?

– కాట్రగడ్డ ప్రసూన
(మాజీ  ఎమ్మెల్యే, టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు )