కాకినాడ యువతి అద్భుత విన్యాసం

189

యూరప్‌ దేశాల్లోనే అత్యంత ఎత్తయిన ఎల్‌బ్రస్‌ శిఖరంపై.. మన స్వాత్రంత్య్ర దినోత్సవం నాడే మువ్వన్నెల జెండా రెపరెపలాడించి సంచలన రికార్డు నమోదు చేసిందో యువ ట్రెక్కర్‌. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన సుతాపల్లి దేవి(23)కి ట్రెక్కింగ్‌ అంటే అమితాసక్తి. ఆ ఆసక్తితోనే యూరప్‌ దేశాల్లోనే అత్యంత ఎత్తయిన ఎల్‌బ్రస్‌ శిఖరాన్ని (5,672 మీటర్లు) కేవలం నాలుగు రోజుల్లో అధిరోహించి.. అక్కడ మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఔరా! అనిపించింది. మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజునే ఎల్‌బ్రస్‌ శిఖరంపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించడం తన జీవితంలో మరచిపోలేని ఆనందక్షణాలని సంతోషం వ్యక్తం చేసింది.