ఏపీలో తాలిబాన్ల పాలన సాగుతోందా…?

189

-అమరావతి బహుజన జెఎసి పోతుల బాలకోటయ్య

బీటెక్ దళిత విద్యార్థి రమ్యకుటుంబాన్ని పరామర్శించడం పాపమా ? ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రమ్య ఇంటికి ఎందుకు వెళ్లరు? దళితులను పరామర్శిస్తే మలిన పడతామనే భయమా? డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుంటే మహిళల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందా?రమ్య ఇంటిదగ్గర వైకాపా కార్యకర్తలకు పనేంటి? దళిత నాయకులను, తెలుగుదేశం పార్టీ నాయకులను అడ్డగించటంలో అర్థం ఏమిటి? రాష్ట్రంలో దళితులకు జీవించే హక్కు లేదా ?

హోంమంత్రి సుచరిత ఎందుకు రాజీనామా చేయరు ? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లపై జరుగుతున్న వరుసపరంపర సంఘటనలకు నైతిక బాధ్యత వహించే మంత్రులు లేరా? ప్రాణాలు తీస్తున్నా పదవులు పట్టుకుని వ్రేలాడుతూనే ఉంటారా? రమ్య కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలి.ముఖ్యమంత్రి రమ్య కుటుంబాన్ని పరామర్శించాలి.