జిల్లా ఎస్పీపై వెంటనే చర్యలు తీసుకోవాలి

203

లోకేశ్, టీడీపీనేతలపై దురుసుగా ప్రవర్తించి చేయిచేసుకున్న జిల్లా ఎస్పీపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
• సదరు అధికారిని విధులనుంచి తప్పించి, శాఖాపరమైన విచారణ జరిపించాలి.
• అక్రమంగా అరెస్ట్ చేసిన టీడీపీ నేతలకు క్షమాపణలు చెప్పి, ప్రభుత్వం విడుదలచేయకుంటే, ప్రతిపక్షం జైల్ భరోకు పిలుపునిస్తుంది.
* నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జీవీ.ఆంజనేయులు

అమానుషంగా హత్యగావించబడిన రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన టీడీపీనేతలను పోలీసులు అడ్డుకోవడం, టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారాలోకేశ్ పై గుంటూరు జిల్లా ఎస్పీ చేయిచేసుకోవడం దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత, మాజీశాసనసభ్యులు జీ.వీ.ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన జూమ్ ద్వారా తననివాసం నుంచి విలేకరులతో మాట్లాడారు.

ప్రజాస్వామ్యాన్నిఖూనీచేసేలా ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్నారని, తాలిబన్ల పాలనకంటే కిరాతకంగా జగన్మోహన్ రెడ్డి పాలనఉందని జీవీ ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీనేతల అక్రమ అరెస్టులను తాముతీవ్రంగా ఖండిస్తు న్నామని, పోలీసులను అడ్డుపెట్టుకొని వికృతపాలన సాగి స్తున్న ముఖ్యమంత్రి తీరుని తాము తీవ్రంగా నిరసిస్తున్నా మన్నారు. టీడీపీ కార్యకర్తలు పోలీసుల దౌర్జన్యాన్ని అడ్డు కుంటే, వారిపైకూడా ఖాకీలు తమకండకావరాన్ని ప్రదర్శించ డం నీచాతినీచమన్నారు. సొంతచెల్లికి రక్షణకల్పించలేని అసమర్థ, అవినీతిపరుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండ టం ప్రజల దౌర్భాగ్యమన్నారు.

ఆడపిల్లకు రక్షణకల్పించలేని ముఖ్యమంత్రికి, మంత్రులకు పదవులెందుకని జీవీ ప్రశ్నిం చారు. ప్రభుత్వం తీసుకొచ్చిన దిశాచట్టం ఎందరిని కాపాడిం దని, హోంమంత్రి మహిళాగా ఉండికూడా, రాష్ట్రంలోని ఆడబి డ్డల మానప్రాణాలకు రక్షణ లేకపోవడం సిగ్గుచేటన్నారు. రమ్య హత్యగావించబడటంపై ముఖ్యమంత్రి తక్షణమే స్పం దించాలన్నారు. నారాలోకేశ్, ఇతర టీడీపీనేతలపై దురుసు గా ప్రవర్తించిన జిల్లాఎస్పీని తక్షణమే విధులనుంచి సస్పెండ్ చేయాలని ఆంజనేయులు డిమాండ్ చేశారు. రమ్య కుటుం బానికి ప్రభుత్వం కోటిరూపాయలు పరిహారమివ్వాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. అకారణంగా అరెస్ట్ చేసిన టీడీపీనేతలకు క్షమాపణ చెప్పి, ప్రభుత్వం వారిని విడుదలచేయకుంటే, టీడీపీ తరు పున జైల్ భరో కార్యక్రమానికి పిలుపిస్తామని మాజీ ఎమ్మెల్యే తేల్చిచెప్పారు.