కార్పొరేట్ స్కూల్స్ ను తలపించేలా:సుచరిత

88

గుంటూరు జిల్లా పొన్నూరు లోని నిడుబ్రోలు ప్రభుత్వ పాఠశాలను హోంమంత్రి మేకతోటి సుచరిత సందర్శించారు. మన బడి నాడు – నేడు ద్వారా తొలివిడత లో జరిగిన అభివృద్ధి పనులను హోంమంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్ల ను హోంమంత్రి పంపిణీ చేశారు. నాడు-నేడు లో భాగంగా కార్పొరేట్ స్కూల్స్ ను తలపించేలా తయారయ్యాయని హోంమంత్రి కొనియాడారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీపడుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యా సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. జగన్న గోరుముద్ద కార్యక్రమంలో కూడా నాణ్యమైన ఆహారం అందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని హోంమంత్రి ఆశీర్వదించారు. అమ్మవడి, నాడు-నేడు, జగనన్న విద్యా కానుక వంటి అనేక పథకాలను విద్యాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కి హోంమంత్రి సుచరిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.