ఉలిక్కి పడ్డ ముప్పాళ్ల

277

బీటెక్ విద్యార్థినీ నల్లపు రమ్యశ్రీని చంపి పారిపోయిన నరరూపరాక్షసున్ని పట్టుకున్న ముప్పాళ్ల పోలీసులు.

ముప్పాళ్ల: గుంటూరులో బిటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశి కృష్ణది ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామమని తెలియగానే అందరూ అవాక్కయ్యారు. నిందితుడు ఇదే గ్రామంలో దొరకడం, పట్టుకుంది కూడా ముప్పాళ్ల పోలీసే కావడం యాదృచ్చికంగా జరిగినా మండలంలో చర్చనీయాంశమైంది. వివరాలు పరిశీలిస్తే. నల్లపు రమ్యశ్రీ హత్య జరిగిన తర్వాత నిందితుడు తన తల్లి ఉంటున్న గోళ్లపాడుకు చేరుకున్నాడు. మరో వైపు జిల్లా పోలీసులు 5బృందాలు గా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.గోళ్లపాడులో ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు ముప్పాళ్ల స్టేషన్ సిబ్బందిని అలెర్ట్ చేశారు.ఈ నేపథ్యంలో నిందితుడు శశి కృష్ణ గ్రామ శివారులో సేఫ్ ఔషధ కంపెనీ వైపు వెళ్తున్నాడని తెలిసి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మొహమ్మద్ రఫీ (HC3819) నిందితుడు శశికిరణ్ ను గంట పాటు వెంబడించాడు.శశిని పట్టుకునే క్రమంలో నిందితుడు కాల్వలోకి దూకాడు.కత్తితో బెదిరించినా రఫీ వెనుదిరగక కాల్వలోకి దూకి, శశి తో పెనుగులాడి పట్టుకున్నాడు. స్టేషన్ కు సమాచారం ఇచ్చి గుంటూరు తరలించారు. ఈ సంఘటనలో కానిస్టేబుల్ రఫి ధైర్య సాహసాలు ప్రదర్శించి హత్యా నిందితుడిని పట్టుకోడంతో  ఎస్సై పట్టాభిరమ్, తోటి సిబ్బంది అభినందించారు.