నాడు నేడు అంటే…ఉన్న భవనాలు కూల్చి మొండిగోడలు మిగల్చడమేనా?

149

-జగన్ రెడ్డి విద్యావ్యవస్ధలో దళితులకు తీరని అన్యాయం చేశారు
-డోలా బాలవీరాంజనేయస్వామి

నాడు నేడు పేరుతో ముఖ్యమంత్రి జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని, రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో విధ్యావ్యవస్ధలో దళితులకు తీవ్ర అన్యాయం చేశారని టీడీపీ శాసనసభ్యులు డోలా బాలవీరాజంనేయస్వామి అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ…నాడు నేడు పధకంలో భాగంగా కొండపి నియోజకవర్గం సింగరాయ కొండ బాలయోగి బాలికల సాంఘిక గురుకుల పాఠశాలలో… బాగున్న పాత అడ్మినిస్టేటివ్ భవనం కూల్చివేసి మెండిగోడలు మిగిల్చారు. జగన్ అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చి విద్వంసపాలనలకు శ్రీకారం చుట్టారు. ఉన్న అడ్మినిస్ట్రేటివ్ భవనం కూల్చి వేసి మెండిగోడులు మిగిల్చారు దీనికి ఎవరు బాద్య వహిస్తారు? స్ధానిక పారిశ్రామిక వేత్తలను నిర్మాణం చేయాలని ఒత్తిడి చేస్తున్నారు, ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? విద్యా వ్యవస్ధలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని పైకి చెబుతూ… రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాల్లో 2000 ఇంటర్ సీట్లను రద్దు చేశారు. ఒక్క సింగరాయ కొండ గురుకులంలోనే 160 కిపైగా సీట్లు రద్దు చేశారు. కస్తూరిబాయి గురుకుల పాఠశాలలో 150 సీట్లు రద్దు చేశారు. గతంలో 4జతల యూనిపామ్ ఇస్తుంటే..ఇప్పుడు దాన్ని 3 జతలకు కుదించారు. అమ్మఒడి పేరుతో గురుకుల పాఠశాలల్లోని విధ్యార్దులకు కాస్మోటిక్ చార్జీలు రద్దు చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేసి ఎస్సీ, ఎస్టీలకు నాణ్యమైన విధ్యను దూరం చేశారు. ఎన్టీఆర్ విదేశీ విద్యను రద్దు చేసి ఎస్సీలకు విదేశీ విద్యను అందని ద్రాక్షగా మార్చారు. స్డడీ సర్కిళ్లను రద్దు చేశారు. విద్యావ్యవస్ధలో దళితులను అన్ని విధాలుగా ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. దళితులకు మేనమాన అన్న జగన్ కంసుడిలా మారారు. జగన్ రెడ్డి ఇకనైన నాడు నేడు పేరుతో ప్రజలను, దళితులను మోసం చేయటం మానుకోవాలని ఆయన హతవు పలికారు.