జగన్ సర్కారుకు ‘కరెంట్’ షాక్

208

న్యాయస్ధానాల్లో వరస వెంట వరస ఎదరుదెబ్బలు తగులుతున్న జగన్ సర్కారుకు.. తాజాగా ‘కరెంట్’ షాక్ తగిలింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై గతంలో ఇచ్చిన తీర్పును ఎందుకు అమలుచేయడం లేదని, ఢిల్లీలోని విద్యుత్ ట్రైబ్యునల్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏపీ విద్యుత్ సంస్థలకు కోర్టు ధిక్కరణ నోటీసులివ్వాలని ఆదేశించడం సంచలనం సృష్టించింది.

జగన్ ప్రభుత్వానికి విద్యుత్ ట్రైబ్యునల్‌లో చుక్కెదురైంది. ఏపీ డిస్కంలపై కోర్టు ధిక్కరణ చర్యలకు విద్యుత్ ట్రైబ్యునల్‌ ఆదేశించింది. పీఎస్ఏ ఒప్పందాల రద్దు లేఖపై విద్యుత్ అప్పిలేట్ ట్రైబ్యునల్ స్టేకు ఆదేశించింది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై ఇచ్చిన తీర్పును ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించింది. ఏపీ డిస్కం సంస్థలపై విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ ఈపీడీసీఎల్‌ సంస్థలపై కోర్టు ధిక్కరణ చర్యలను ప్రారంభించాలని, నోటీసులను జారీ చేయాలని రిజిస్ట్రీని ట్రైబ్యునల్ ఆదేశించింది.