మైదుకూరు సీమలో ‘రత్నాల’ వేట

276

– డి.నేల‌టూరు వ‌ద్ద వ‌జ్రాల కోసం అన్వేష‌ణ‌
– క‌ర్నూలు, క‌డ‌ప జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వ‌జ్రవేట‌కు ప‌రుగులు

ఎక్కడైనా తొలకరి చినుకులు కురవగానే పంటపొలాలకు వెళ్లి వ్యవసాయ పనులు మెుదలెడతారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కొన్ని వ్యవసాయ భూముల్లో మాత్రం వజ్రాల కోసం అన్వేషణ ప్రారంభమౌతుంది. ఈ ప్రాంతంలో అధిక భాగం ఎర్ర నేలలున్నాయి. నునుపైన రంగురాళ్లు కలిగిన ఈ ఎర్రనేలలు కొంత ప్రత్యేకంగా కనిపిస్తాయి. వజ్రకరూర్, జొన్నగిరి, పగిడిరాయి, పెరవలి, తుగ్గలిలోని ఈ ఎర్రనేలల్లో తొలకరి చినుకులు కురిసిన తరవాత వజ్రాలు దొరుకుతాయన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది.

అలాగే నంద్యాల-గిద్దలూరు మధ్యనున్న నల్లమల అటవీప్రాంతంలోని సర్వనారసింహస్వామి క్షేత్ర పరిసరాల్లోని వంకల్లో వర్షానికి వజ్రాలు కొట్టుకొస్తాయన్న ప్రచారం కూడా ఉండిపోయింది. ఈ ఏడాదీ తొలకరి చినుకులు ప్రారంభం కావడంతోనే వజ్రాలవేట జోరుగా కొన‌సాగుతోంది. ప్రస్తుతం వజ్రాల కోసం ఆ రెండు జిల్లాల ప్రజలు పొలాలను జల్లెడ ప‌డుతుండ‌గా క‌డ‌ప జిల్లాలోని మైదుకూరు ప్రాంతంలో వజ్రాలవేట సాగిస్తున్నారు. స్ధానిక‌ప్రాంతాల‌కు చెందిన వారే కాకుండా క‌ర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి.. జ‌మ్మ‌లమ‌డుగు, ప్రొద్దుటూరు, బ‌ద్వేల్ ప్రాంతాల నుండి మా ప్రాంతంకు విచ్చేస్తున్నారు. ఇందేంటి మైదుకూరు ప్రాంతంలో వ‌జ్రాలున్నాయి.. ఇక్క‌డ దొరుకుతున్నాయ‌ని ఇత‌ర ప్రాంతాల నుండి రావ‌డ‌మేంటి అని ముక్క‌న మ‌నం వేలేసుకోవ‌డం త‌ప్ప‌.. డి. ఆగ్ర‌హం ప్రాంతంలోని గుట్ట‌ల్లోకి వెళ్లి మీరే ఆశ్చ‌ర్య‌పోతారు.

మైదుకూరు- బ‌ద్వేల్ ప్ర‌ధాన ర‌హ‌దారిలో బ్ర‌హ్మంగారి మ‌ఠం మండ‌లం డి. ఆగ్ర‌హం నుండి ఉత్త‌ర దిశ‌గా రెండు మైళ్లు వెళ్లితే.. గుంపులుగుంపులు జ‌నం రాళ్ల‌ను ఏరుకునే బిజీలో క‌న‌ప‌డ‌తారు. అక్క‌డి గుట్ట‌ను వ‌జ్రాల గుట్ట‌ని పూర్వ‌కాలం పిలిచేవాళ్ల‌మ‌ని చెప్పుకొస్దున్నారు ఆప‌ల్లె ప‌ట్టున ఉండే కొంద‌రు.
‘‘మేం జ‌మ్మ‌ల‌మ‌డుగు నుండి నుంచి వచ్చినాం. వజ్రాలు దొరుకుతాయని ఎతుకులాడుతుండాం. ఇంతవరకు దొరకలేదు. పనులన్నీ వదిలిపెట్టి వచ్చినాం. దొరికితే మా అదృష్టం ఎట్టయిద్దో చూడాలి మరి ’’ అంటున్నారు జమ్మలమడుగు నుండి వచ్చిన కొందరు కూలీలు మైదుకూరు నుండి బ‌ద్వేల్ వెళ్తున్న‌ప్పుడు డి. అగ్ర‌హరం వ‌ద్ద ఒక‌స‌బ్ స్టేష‌న్ క‌న‌ప‌డుతుంది. ఆ స‌బ్ స్టేష‌న్ ప‌క్క‌న మ‌ట్టిరోడ్డు.. ఆ మ‌ట్టి రోడు వెంబ‌డి గ‌ట్టిగా చెప్పాలంటే ఒక‌టిన్న‌ర మైళు. ఆ ప్రాంతం అడ‌వికి కొంత ద‌గ్గ‌ర ప్రాంతం. అక్క‌డ కొండ గుట్టలున్నాయి.. కొండ గుట్ట‌ల‌ను ప‌రిశిలిస్తే.. తెల్ల‌గా గాజు వంటి రాళ్లు క‌న‌ప‌డుతుంటాయి. నిశితంగా ప‌రిశిలిస్తే కొన్నేళ్ల కిందట అక్క‌డ మైనింగ్ పరిశ్రమలు న‌డిచిన‌ట్టు అర్థ‌మవుతుంది.

సీమ జిల్లాల్లో వజ్రాలు దొరుకుతుండటంపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం శ్రీకృష్ణదేవరాయల పాలనలో వజ్రాలు, రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని, శత్రువులు కొల్లగొట్టకుండా రాజులు ఎక్కడపడితే అక్కడ నిధులు దాచారని, అప్పట్లో ఊహించని వైపరీత్యాలవల్ల వజ్రాలు, రత్నాలు భూమిలో కలిసిపోయి ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు అవి బయటపడుతున్నాయన్నది ఒక కథనం కాగా..రాయలసీమల్లో బ్రిటిష్ పాలనలో, అంతకుముందు మహమ్మదీయులు, విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలోనూ మైనింగ్ జ‌రిగే క్ర‌మంలో మాప్రాంతంలో మైనింగ్ జ‌రిగింద‌ని మా పెద్ద‌లు చెప్పేవార‌ని కొంద‌రంటున్నారు.

ఈ మ‌ధ్య కాలంలో అంటే ప‌ది రోజుల నుండి ఆ తెల్ల‌టి ప్రాంతంలో చాలామంది తేడాగా కనిపించిన రాళ్లన్నిటినీ ఏరుకుంటున్నారు. ఇక్క‌డ వజ్రాలు దొర‌క‌డ‌మేంటి? ఇక్క‌డికి వ‌చ్చే వాళ్ల‌కు ఏమ‌న్న‌మ‌తిభ్ర‌మించిందా?ఆశ‌ ఇలా చేస్తోందా?అని మనం భావిస్తాం. అక్కడికివచ్చే రమారమి వంద మంది వజ్రాలు ఇక్కడ దొరుకుతాయి అనే భావన తో సూర్యుడు ఉదయించింది మొదలు, అస్తమించే వరకు వెతుకులాట జరుపుతూనే ఉన్నారు.. తళక్కుమనే రాయిని సేకరించుకుని దాచుకుంటున్నారు. ఇక్కడికి వస్తున్న వారిలో వజ్రాల వెతకడంలో అనుభవం ఉన్న వాళ్లు ఉన్నారు. అయితే, అనుభవమున్న కొందరు మాత్రం, దానికి భిన్నంగా తమ అన్వేషణ సాగిస్తున్నారు.వాళ్లు దాచుకునే రాయినిచూస్తే వజ్రమా అని మనకు అన్పిస్తోంది.

ఇక స్థానికులతో పాటు, చుట్టుపక్క ప్రాంతాల వారు క్యారియర్లు కట్టుకుని భార్యాపిల్లలతో సహా ఆటో, కారు, మోటారు బైక్‌లపై వచ్చి పొద్దుపోయే వరకు వజ్రాల అన్వేషణలో నిమగ్నమవుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు ఆప్రాంతంలోనే తమకు అనువైన ప్రదేశంలో వంట చేసుకుని తింటూ తలదాచుకుంటూ… నిద్ర లేవగానే గుట్టలపైవు పరుగులు తీస్తున్నారు. అక్కడ దొరికిన రాళ్లను వజ్రాలు గా భావించుకుని, బద్వేల్,ప్రొద్దుటూరు బంగారు అంగళ్ల వైపు వెళ్తున్నారు. పది రోజులుగా వజ్రాల అన్వేషణ ఇక్కడ జరుగుతున్నప్పటికీ తనకు దొరికిన రాయి వజ్రపు రాయి అని బయటకు వెల్లడించడం లేదు.