పరీక్షలు నిర్వహించనపుడు పరీక్ష ఫీజులు ప్రభుత్వం ఎందుకు వసూలు చేసింది

265

ప్రజల నుంచి పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు, మరి విద్యార్ధుల ఫీజులు ఎందుకు వెనక్కివ్వరు
వైసీపీ ప్రభుత్వం విద్యార్దులను మోసం, విద్యా వ్యవస్ధను నాశనం చేస్తోంది
-టీడీపీ శాసనసభ్యులు, అనగాని సత్యప్రసాద్

ముఖ్యమంత్రి జగన్ తన అవినీతి దుబారాతో బ్యాంకుల దగ్గర అప్పులు చేయటమే కాక చివరకు విద్యార్ధుల దగ్గర నుంచి ఫీజుల రూపంలో డబ్బులు లాక్కోవటం దుర్మార్గం. విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు,ప్రతిపక్ష పార్టీలు పరీక్షలు వద్దంటున్నా…గత ఏడాది మొండిగా 10 వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యార్ధుల దగ్గర నుంచి ప్రభుత్వం పెద్ద మొత్తంలో పరీక్ష ఫీజులు వసూలు చేసింది. కోర్టు మొట్టికాయలు వేయటంతో చివరి నిమిషంలో పరీక్షలు రద్దు చేశారు. పరీక్షలు రద్దు చేసినపుడు విద్యార్దులు కట్టిన ఫీజు తిరిగివ్వాలి కదా. ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? కరోనా సమయంలో పూట గడవటమే కష్టంగా ఉన్నప్పటికీ తమ పిల్లల భవిష్యత్ కోసం విద్యార్దుల తల్లితండ్రులు ఫీజులు కట్టారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్ధులు మెత్తం 10,65,156 మంది నుంచి ఒక్కో విద్యార్ది నుంచి రూ. 500 చొప్పున మొత్తం సుమారు రూ. 53 కోట్లకు పైగా ప్రభుత్వం వసూలు చేసింది. పదో తరగతి విద్యార్ధులు రాష్ర్టంలో 5 లక్షలమందికి పైగా ఉన్నారు. వారి నుంచి కూడా పెద్ద మెత్తంలో పరీక్ష ఫీజులు వసూలు చేశారు. కరోనాతో పరీక్షలు నిర్వహించలేదు కాబట్టి ప్రభుత్వం విద్యార్దులు కట్టిన ఫీజులు తిరిగివ్వకుండా ప్రభుత్వం ఎందుకు తన వద్ద ఉంచుకుంది? పెట్రోల్, డీజిల్ , నిత్యవసరాల ధరలు పెంచి, చెత్త పన్ను, ఆస్తి పన్ను అంటూ ప్రజలపై పన్నుల మీద పన్నులు మోపి రెండేళ్లలో ప్రజల దగ్గర నుంచి రూ. 70 వేల కోట్లు ముక్కుపిండి వసూలు చేశారు. మరి విద్యార్ధులు కట్టిన ఫీజులు ఎందుకు తిరిగివ్వరు? మూడు నెలల నుండి ప్రజలంతా లాక్ డౌన్ లో ఉండటం ద్వారా పేదవారైనా విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు పూట గడవడం కూడా చాలా దారుణంగా ఉంది. విధ్యార్ధులు కట్టిన ఫీజులు ప్రభుత్వం వెంటనే తిరిగివ్వాలి. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఫీజు లేకుండా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.

విద్యార్ధుల సమస్యలను, విద్యావ్యవస్ధను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. టీడీపీ హయాంలో ఎన్‌టిఆర్‌ విద్యోన్నతి, అంబేద్కర్‌ ఓవర్సీస్‌ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు రూ.10 లక్షలకు ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వం కొత్తవి ఇవ్వకపోగా పాతవి నిలివేయడంతో విదేశీ విద్యకు వెళ్లిన విద్యార్థులు చదువు మధ్యలో ఆపేసి వచ్చేశారు. గ్రూప్‌ 1, 2, సివిల్స్‌ తదితర పోటీ పరీక్షలకు కోచింగ్‌కు అయ్యే ఫీజు చంద్రబాబు ప్రభుత్వం భరించింది. ఈ పథకాన్ని జగన్‌ ప్రభుత్వం రద్దు చేసింది. గడిచిన 2 ఏళ్లల్లో విద్యా వ్యవస్థను సర్వనాశనం అయ్యింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క పథకంలోను విద్యా వ్యవస్థను బలోపేతం దిశగా అడగులు వేయడం లేదు. గత ప్రభుత్వం విద్యా వ్యాప్తి కోసం అందించిన 11 పథకాలను రద్దు చేశారు. ఐటీఐ నుండి పీజీ, ప్రొఫెషనల్‌ విద్యార్థులు 16 లక్షల మందికి చంద్రన్న ప్రభుత్వం ఫీజు రియింబర్స్ మెంట్ ఇస్తే జగన్ రెడ్డి అందులో 11 లక్షల మందికే పరిమితం చేసి మోసం చేశారు. విద్యార్థుల సంఖ్య తగ్గించడానికి 75% హాజరు, 300 యూనిట్ల కరెంటు బిల్లు, తమ్ముడికి ‘అమ్మ ఒడి’ వస్తే అన్నకు ఈ పథకం వర్తించదు లాంటి నిబంధలను పెట్టారు. 2019-20లో 32వేల కోట్లు కేటాయించి రూ.19వేల కోట్లకు మించి వ్యయం చేయలేదు. 2020-21 బడ్జెట్లో 25వేల కోట్లు కేటాయించి అందులో సగం కూడా వ్యయం చేయలేదు. ఈ ఏడాది 24,600 కోట్లు అంటే గత ఏడాది కంటే తక్కువ నిధులు కేటాయించారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారనడానికి బడ్జెటే సాక్ష్యం.ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన విద్యార్ధుల సంఖ్య కొరవడి మూతపడుతున్నాయి. ప్రైవేట్ కళాశాలలు విద్యార్ధులను దోపిడీ చేస్తున్న ప్రభుత్వం మాత్రం పట్టన్నట్లుగా ప్రవర్తిస్తోంది. ఫీజ్ నియంత్రణ లేదు. ఓ వైపు సంక్షేమ పధకాల పేరుతో విద్యార్ధులకు డబ్బులిస్తున్నామని చెబుతున్నారు. కానీ మరో వైపు ప్రవేట్ కాలేజీలు ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని విద్యార్దుల నుంచి ఫీజుల కోసమని ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ఇకనైనా ముఖ్యమంత్రి విద్యా రంగంపై దృష్టి సారించి విద్యావ్యవస్ధను గాడిలో పెట్టాలి.