పోరాటం నాకు దక్కే సమున్నత గౌరవం….!

278

పోరాటం ఆగదు
నేను లేకున్నా…!!
సమస్యలు బాధలు
అక్రమాలాక్రన్దనల్
అన్యాయాలనచివేతలెక్కడుంటే పోరాటం అక్కడ భూకంపమై బద్దలౌతుంది
అన్యాయం ఆటైతే
పోరాటం పోటై
సుడులు తిరిగి సునామై
ఊళ్లను బీళ్లనేకం చేసి భీభత్సం సృష్టిస్తుంది !!

నేనొక్కడినే లేకుంటే
అనివార్యలేవో అడ్డుకుంటేనో
సిగ్గులేని నిస్సిగ్గులు నా మెదడు పై బురదల్ జల్లితేనో
పోరాటం పొంగులువారక
నా కోసం నిలబడుతుందా !?
నిలబడి కలబడటం దాని నైజం
పారిపోవడం తలవంచుకోవటం తన స్వభావం కాదు !!

ప్రశ్నించటం ఆక్రోశించటం
ప్రజాస్వామ్యంగా
నినదించడం నిరసించడం
పోరాటపు హృద్యారాటమ్ !!
ఊరికే పోదు
పోరాటం ఫలిస్తుంది
ఆలస్యం గానైనా పోరాటం
పూసి కాసి ఫలవంతమౌతుంది
నేను లేకున్నా పోరాటం ఆగదు
పోరాటం అవమానం కానేరదు
పోరాటంలో నేనుండకపోవటం
నాకు ఆత్మహత్యాసదృశ్యమే
పోరాటంలో నేనుండడం నాకు దక్కే గౌరవమే !!

పోరాటం లో నేను న్యాయం కోసం గొంతెత్తుతాను
న్యాయానికి ప్రతినిధినౌట కన్నా
నాకు కావలసిందేమున్నది !?
పోరాటం లో నేను నిలబడటం
నాకు దక్కే సమున్నత గౌరవం !!

– ఎ. చంద్రమోహన్.అధ్యక్షుడు
TPTF, కొండాపూర్,సంగారెడ్డి
9492765654.