జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభించిన శిద్దా సుధీర్ కుమార్.

166

స్మైల్ ఎగైన్ చారిటీ సంస్థకు చెందిన యువకుల ఆధ్వర్యంలో ఒంగోలు ఏ.బి.ఎమ్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త,జ్యోతి గ్రానైట్ ఎక్స్పోర్ట్ ఇండియా ప్రేవేట్ లిమిటెడ్ చైర్మన్ శిద్దా సుధీర్ కుమార్. ఈ సందర్భంగా స్మైల్ ఎగైన్ నిర్వాహకులు శిద్దా సుధీర్ కుమార్ కు క్రికెట్ అటగాళ్ళ జట్టును పరిచయం చేసారు.అనంతరం శిద్దా సుధీర్ కుమార్ ప్లేయర్స్ తో కలసి క్రికెట్ ఆడి ఉత్సహపరిచారు. శిద్దా సుధర్ కుమార్ మాట్లాడుతూ క్రికెట్ ప్లేయర్స్ కు అభినందనలు తెలుపుతూ స్మైల్ ఎగైన్ సంస్థ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని,దాదాపు 30 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని సామాజిక సేవతో తలపెట్టిన క్రికెట్ టోర్నమెంట్స్ ద్వారా యువకులతో రక్త దానం ప్రోత్సహించే విధంగా ఆలోచన చేయడం మంచి ఆలోచన అని నిర్వాహకులను కొనియాడారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి మా సహకారం తప్పక ఉంటుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్మైల్ ఎగైన్ సంస్థ ప్రెసిడెంట్ అన్వేష్ కుమార్,కార్యదర్శి ఎస్.కె.ఆసీఫ్,ట్రెజరర్ సాయి కాంత్,సభ్యులు సుందర కుమార్, గణేష్, లోహిత్, సంతోష్, శంకర్,చారి,అరవింద్,ప్రవీణ్ పాల్గొన్నారు..క్రికెట్ టోర్నమెంట్ కు సహకారం అందించిన జ్యోతి గ్రానైట్ ఎక్స్పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శిద్దా సుధీర్ కుమార్ కు కృతజ్ఞతలు తెలువుతున్నట్లు అన్వేష్,సంస్థ సభ్యులు తెలిపారు.