లక్ష్మి దేవి ఇంట్లోకి రావాలంటే…

196

ఇంట్లో ఇల్లాలు ఎప్పుడు మడి ఆచారాలతో పరిశుభ్రంగా ఉంటూ ఇంటిని శుభ్రంగా ఉంచుతూ ముగ్గులు వేస్తూ, గడపకి బొట్లు పెడుతూ , ఇంట్లో నిత్యం పొయ్యి వెలిగించేటప్పుడు కూడా కొద్దిగా పసుపు రాస్తూ నమస్కారం చేస్తూ వెలిగిస్తే అ ఇంట్లోకి లక్ష్మిదేవి వస్తుంది. ఏ ఇంట్లో ఐతే దూపం వాసనా సువాసన బరితంగా బయటకి వస్తుందో అ ఇంట్లోకి లక్ష్మిదేవి వస్తుంది, ఏ ఇంట్లో ఐతే మొహం చూసుకునే అద్దం శుభ్రంగా ఉంటుందో అ ఇంట్లో కి లక్ష్మిదేవి వస్తుంది .

ఏ ఇంట్లో ఐతే ఇల్లు తుడిచే చీపుర్లు శుభ్రమైన స్థలంలో కనపడకుండా పెడతామో అ ఇంట్లోకి లక్ష్మి దేవి వస్తుంది. ఇంట్లో మసిబట్ట జాగ్రతగా మంచి ప్లేస్ లో పెట్టుకుంటే ఇంట్లోకి లక్ష్మి దేవి వస్తుంది. ఐతే ఇంట్లోకి ఈ లక్ష్మి దేవి రావడాన్కి చాల విషయాలు చెప్పుకున్నాం కాబట్టి అలాంటి లక్ష్మి దేవి మన ఇంటికి వచ్చి మన గృహం లోస్థిర నివాసం ఉండాలంటే రెండు చిన్న ఏనుగులు తొండం తో ఘీకరిస్తున్నట్లు ఉండాలి అవి అలా ఉంటె స్వాగతం పలికినట్టే ఉంటాయి.

వాటిని లక్ష్మి దేవి చిత్ర పటానికి ముందు పెడితే శుభ పరిణామాలు జరుగుతాయి. మీరు పౌర్ణమి రోజున గాని ,శుక్ర వారం రోజున గాని పంచలోహాల రెండు ఏనుగు పిల్లలను లక్ష్మి దేవి పాదాల ముందు పెట్టి దూప,దీప,నైవేద్యాలు సమర్పించాలి, వాటిని రోజు ఉదయం పూటనో సాయంత్రం పూటనో పెడుతూ ఉండాలి. దరిద్రంలో, కష్టాలలో ఉండి డబ్బుకి ఇబ్బంది పడే వారు కచ్చితంగా భీకరిస్తున్న ఏనుగులను లక్ష్మిదేవి పాదాల దగ్గర పెట్టుకుంటే ఇంట్లోకి లక్ష్మిదేవి వస్తుంది.