ధ్యాన్ చంద్..జయహో!

2263

ఒలంపిక్స్ హాకి ఫైనల్ 1936 జర్మనీతో తలపడిన భారత్ .
ఇరవైఐదు వేల మంది స్టేడియమ్ లో నిండి ఉన్నారు.
16-1 తో జర్మనీని నిలువరించాడు. తానొక్కడే 15 గోల్స్ చేశాడు.!
ప్రపంచములోనే గొప్ప నియంత ’ హిట్లర్ ’ అప్పుడు స్టేడియమ్ లో ఉన్నాడు.!

కిందికి వచ్చి, ’ ఇతడి హాకీ స్టిక్ విరగ్గొట్టి చూడండి, విరగ్గొట్టి చూడండి.. అందులో ఏదో అయస్కాంతం ఉంటుంది, లేకపోతే ఇలా ఎలా ఆడతాడు ..’ అన్నాడు.!?
హాకీస్టిక్ లో యే అయస్కాంతమూ దొరకలేదు.!
ఆనాటి రాత్రి ధ్యాన్ చంద్ ని హిట్లర్ తన వద్దకు పిలిపించాడు.పిలిపించి అడిగాడు. హాకీ ఆడటం కాకుండా ఇంకా ఏమేమి చేస్తావు?

లాన్స్ నాయక్ ధ్యాన్ చంద్ అన్నాడు, ” నేను ఆర్మీలో పనిచేస్తాను .”
ప్రపంచపు చక్రవర్తి అన్నాడు, ” ధ్యాన్ చంద్, నీ దేశము నీకేమిచ్చింది ? ఈనాటికీ నువ్వు కేవలం సుబేదార్ వి. జర్మనీ తరఫున ఆడు, ఈరోజే నిన్ను ఎయిర్ ఫీల్డ్ మార్షల్ చేస్తాను.. నీదేశం నీకేమిచ్చింది ? ”

దేశపు ప్రసక్తి రాగానే ధ్యాన్ చంద్ అన్నాడు, ఏమన్నాడో, మళ్ళీ మళ్ళీ చదవండి,
” మిస్టర్ హిట్లర్, నన్ను ముందుకు తీసుకుపోవడము నా దేశపు బాధ్యత కాదు.
నా దేశాన్ని ముందుకు తీసుకు పోవడము నా బాధ్యత .. నా దేశానికి మాత్రమే ఆడుతాను. పరాయి దేశాలకోసం ఆడను.. ”
అని తెగేసి చెప్పాడు.!
హిట్లర్ నిర్ఘాంతపోయి తలదించుకున్నాడు.
దేశము ధ్యాన్ చంద్ కి ఏమివ్వాలో అది ఈనాడు ఇచ్చింది.
మేరా భారత్ మహాన్.
(రాజీవ్ ఖేల్ రత్న ఆవార్డు పేరును ద్యాన్ చంద్ ఖేల్ రత్న గా మార్చిన సందర్భంగా దివంగత ద్యాన్ చంద్ స్మృతిలో..)