వైయస్సార్ మెమోరియల్ బాక్సింగ్ సీఎం కప్ 2021 పోటీల ట్రోఫీ ఆవిష్కరణ

227

వైయస్సార్ మెమోరియల్ బాక్సింగ్ సీఎం కప్ 20 21 పోటీల ట్రోఫీ  ని రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక,  క్రీడా విభాగం మంత్రి  ముత్తంశెట్టి అవంతి శ్రీనివాస్ శుక్రవారం సీతమ్మధారలోని తన నివాసం వద్ద  ఆవిష్కరించారు.

రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ ఉత్తర్వులు మేరకు మధురవాడ  మారుతి బాక్సింగ్ క్లబ్
చంద్రంపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లో ఈ పోటీలు నిర్వహించనుంది.
ఆగస్టు 31 మొదలుకొని సెప్టెంబర్ 2వ తేదీ వరకు సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ విభాగాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. సుమారు 300 మంది బాక్సింగ్ క్రీడాకారులు తలపడనున్న ఈ పోటీలకు మారుతి బాక్సింగ్ క్లబ్ ఆతిధ్యం ఇవ్వనున్నది.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకార్థం ఈ పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ విశాఖ లో బాక్సింగ్ కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ప్రతిష్ఠాత్మకమైన సీఎం కప్ ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పారు.
పోటీల నిర్వాహకుడు వంకాయలు మారుతి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రాష్ట్ర క్రీడా  మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.

వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విశాఖలో క్రీడా ప్రమాణాల మెరుగుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులకు శుభాభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి ఎం సూర్యారావు , రాష్ట్ర నగరాల కార్పొరేషన్
చైర్ పర్సన్ పిల్ల సుజాత సత్యనారాయణ, రాష్ట్ర మరియు జిల్లా బాక్సింగ్ సంఘం ప్రతినిధులు దల్లి రామకృష్ణారెడ్డి, శర్మ, లక్ష్మణ్ రెడ్డి, నూకరాజు, మాధవరావు, అప్పన్న రెడ్డి తో పాటు రాష్ట్ర అమెచ్యూర్ తైక్వాండో సంఘం  ఉపాధ్యక్షులు బి ఆనంద్ రావు, షాప్ బాక్సింగ్ కోచ్ సాయి కుమార్, ఐ  బీమేస్ , వైకాపా నాయకులు పసుపులేటి గోపి, అల్లాడ ఎర్రిబాబు , లింగేశ్వర రావు బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.