తాలిబన్లు బలపడితే మనకూ ప్రమాదమే!

358

లెక్కప్రకారం ఆఫ్ఘానిస్తాన్ మన దేశానికి సరిహద్దు దేశం. కాని ముష్కర పాకిస్తాన్ గిలిగిట్ ను ఆక్రమించడం వల్ల ప్రస్తుతం భౌతికంగా లేదు. అహ్మద్ షా అబ్డాలి దురాని మూడో పానిపట్టు యుద్ధంలో టెక్నికల్ గా గెలిచినా, మరాఠా యోధుల పోరాటంలో ఆప్ఘన్లులు తిన్న దెబ్బ సామాన్యం కాదు, ఆ దెబ్బకి మరల ఇండియా వైపు చూడలేదు. శిక్కులు ఆ తరువాత ఇండియాకు అక్కడ పెట్టని కోటలా నిలబడ్డారు. అబ్ధాలీకి మద్దతు ఇచ్చిన రోహిల్లలపై కూడా మరాఠాలు తరువాత ప్రతీకారం తీర్చుకున్నా అవన్నీ చరిత్రలో లేదు. ఇండియా ఓడింది అని వ్రాసారు కొందరు చరిత్రకారులు. ఒకనాడు హిందూ పాలకులు పాలించిన ఆఫ్ఘానిస్తాన్ ప్రాంతం 14 శతాబ్దముల క్రితం ఇస్లాం పాలకుల వశమైంది. 1970లో లక్షల సంఖ్యలో ఉండే హిందువులు, సిక్కులు హత్యలకు గురై లేదా మన దేశంలోని పారిపోయి వచ్చారు. ఇప్పుడు కేవలం కొన్ని వందల్లో ఉన్నారు.

ఇక బ్రిటిష్, ఆప్ఘన్ యుద్దాలు చూసాము. అదంతా గతం. ఇక పాకిస్తాన్ లాంటి ముష్కర పాలకులకు, ముజాహాదీన్, తాలిబాన్ లాంటి పాలకులకు లక్షకోట్లు ఇచ్చి రష్యాపై పరోక్ష పోరు చేయించిన ఘనత USAదే. రష్యా నిష్క్రమించింది. ఇండియా మిత్రుడు నజీబుల్లా ను ముష్కరులు బహిరంగ ఉరి వేసిన తరువాత ఆప్ఘనిస్థాన్ తీవ్రవాదుల చేతుల్లోకి పోయింది. తరువాత ఆ సౌదీ ఒసామా బిన్ లాడెన్ అకృత్యాలు, వరల్డ్ టవర్ పై దాడి, అమెరికా సైన్యం ఆక్రమణ అన్నీ చూసాము. ఇంకో నెలలో అమెరికా, నాటో సైన్యాలు సంపూర్ణంగా వెళ్లిపోతున్నాయి. నేటికీ తాలిబాన్ దళాలు 65% ఆఫ్ఘానిస్తాన్ ని ఆక్రమించాయి అన్న వార్త చూస్తున్నాము. ఒకనాడు తాలిబన్ పాలనలో కూడా ఉత్తర ప్రాంతాలు స్వతంత్రగానే ఉండెయి. మన ఇండియా మిత్రుడుగా పేరుగాంచిన మసూద్ ని జర్నలిస్టు పేరుతో చంపిన తరువాత ఇండియాకి కొంత దెబ్బ తగిలినా, కర్జాయ్ అలా నేటి ఘనీ గారి వరకూ ఇప్పటివరకు ఆప్ఘనిస్థాన్ ఇండియాకు సన్నిహితంగా ఉంది. కాబూల్ పాలకులకు బలం ఉత్తర ప్రాంతాలు, ఉఙబెక్, తజిక్, హాజరీలు. సాంప్రదాయంగా ఫస్తున్స్(పఠాన్) అత్యధికంగా తాలిబాన్ కు అనుకూలంగా ఉంటారు. పాకిస్తాన్ NWFP రాష్ట్రంలో వారిదే ఆధిపత్యం. ఇప్పుడు టాలిబాన్లు స్ట్రేటజిక్ గా ఉత్తరాదిని కొట్టుకుంటూ వస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇస్లామిక్ తీవ్రవాద ఎగుమతి భయంతో పాత సోవియట్ దేశాలు తర్కమెనిస్తాన్, ఉఙబేకిస్తాన్, టజీకిస్తాన్ ఇవి తాలిబన్ కు వ్యతిరేకంగా ఉండేవి, నేడు మెత్తబడ్డాయి. ఇది కూడా ఇండియా జాగ్రత్తగా గమనిస్తోంది. అభ్యుదయ దేశాలుగా ఉండే వాటిల్లో కూడా నేడు మత చాందసవాదం వెర్రి తలలు వేస్తోంది. అజర్ బైజాన్, ఆర్మేనియా యుద్ధం ను అడ్డం పెట్టుకుని టర్కీ ఇప్పుడు మత దేశ పెద్దగా తయారౌతోంది, నెమ్మదిగా అమెరికా కంట్రోల్ నుంచి బయటికి వస్తోంది. ఇది విశ్లేషకులు గమనించాలి.

ఇండియా విదేశాంగ మంత్రి జైశంకర్ కొంతకాలంగా ఆ దేశాలతో మాట్లాడుతున్నారు, వెళుతున్నారు. ఆప్ఘనిస్థాన్ టాలిబాన్లు పరం అయితే ఇండియాకు నష్టం. ఇంకా తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తారు. మొన్న పాక్, ఆప్ఘన్, రష్యా, అమెరికా వీళ్లే మధ్య చర్చలు అని అంతర్జాతీయ సమాజం అంటూ ఇండియాని దూరం పెట్టె యత్నాలు సాగుతున్నాయి. ఆప్ఘనిస్థాన్ పునర్నిర్మాణం కోసం ఇండియా లక్షలకోట్ల రూపాయలు ఖర్చు చేసింది. రహదారులు, డ్యాంలు, ఆఖరికి దాని పార్లమెంటు భవనం అన్నిటికీ సాయం చేసింది. పాకి ముష్కర ప్రభుత్వం అస్థిరత్వాన్ని ఆప్ఘన్లకి అందిస్తే, అభివృద్ధిని ఇండియా ఇచ్చింది. ప్రత్యక్షంగా ఇండియా పోరులో కల్పించుకోకూడదు అనే దశాబ్దాలుగా ఉన్న విధానాన్నే నేటి nda ప్రభుత్వం కూడా పాటిస్తుంది మంచిదే.

రష్యా, అమెరికానే దెబ్బతిన్నాయి, మనం తట్టుకోలేము. CIS ఏర్పడిన తరువాత రష్యాకు ఇప్పుడు ఆప్ఘనిస్థాన్ కు మూడు దేశాలు అడ్డం ఉంది, వేల కిమి సరిహద్దు దూరం అయింది. ఇండియా అలా కాదు, తాలిబాన్ ప్రతిధ్వని కాశ్మీర్లో వినిపించే అవకాశం ఉంది. ప్రజాస్వామ్య పద్దతిలో ఆలోచిస్తే ఆప్ఘన్లు వారి స్వయం పాలన వారు చేసుకుంటే ఫర్వాలేదు. నైతిక విలువలతో కచ్చితంగా, అథారిటీ పాలన అంటే అదీ కూడా తప్పలేదు. వారిష్టం. కానీ ఎవరైనా సరే… అది తీవ్రవాదుల చేతల్లో ఉండకుండా ఉంటే చాలు. ముష్కర పాకిస్థాన్ ప్రభుత్వం ఏదో చక్రం తిప్పుదాము అనుకుంటుందేమో, తాలిబన్ ఆప్ఘన్ అంటే టైం బాంబుని ప్రక్కన పెట్టుకుఉన్నట్లే. మొదట స్థిరత్వంలో నష్టపోయేది ఆ దేశమే.

ఇండియా చాలా మెలకువగా వ్యవహారం చేయాలి. నిన్నటి వరకూ (మహ్మద్ రిజా పహ్లావి షా పోయిన తరువాత) ఇరాన్ ఇండియాకు మిత్ర దేశమే. ముడిచమురు నిన్నటిదాకా వారినుంచే కొనుక్కునేవాళ్ళం బార్టర్ సిస్టంలో. అక్కడ చబర్ నౌకాశ్రయం అభివృద్ధి చేసాము. సద్దాం హుస్సేన్ ఇండియాకు నమ్మకం ఉన్న మిత్రుడులా ఉండేవాడు, కశ్మీర్ విషయంలో ఇండియాకు అనేకసార్లు outright గా మద్దతు ఇచ్చేవాడు. ఇరాక్- ఇరాన్ సమయంలో రెండు దేశాలకు సన్నిహితంగా ఉండే ఇండియా విదేశాంగ విధానం అంతర్జాతీయ రాజకీయాలు, డిప్లమేట్స్ కు గొప్ప study matter. గ్రేట్. ఇప్పుడు కొంత ఒడిదుడుకులలో పడింది. మన దేశ నాయకత్వానికి ఈ సమయంలో ఈ ఆప్ఘన్ వ్యవహారంలో మనందరం ఏకతాటిపై మద్దతు ఇవ్వాలి. ఇక అంతర్గత వ్యవహారాలు వేరే. అంతర్జాతీయ సమాజంలో ఇండియా nriలు కూడా దేశ విధానానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. అటువైపు పాక్ nri లు అనేకమంది ఇండియా పై అవాస్తవపు ప్రచారం చేస్తా ఉంటారు. మనం ధీటుగా ఖండించాలి. మొన్న ఆప్ఘన్లో తీవ్రవాద శిబిరాలపై విమాన దాడులపై ఇండియాపై దుమ్మెత్తి పోస్తున్నారు కొందరు.

ఒక ప్రక్క ఎప్పుడూ మారుతూ ఉండే ఉఙబెక్ ధోస్తుం లాంటివారితో, ఉత్తర అలయెన్స్ నాటి రబ్బానితో లాగా మెయింటెన్ చేస్తూ, తాలిబన్ తో కూడా డైలాగ్స్ మొదలుపెట్టాలి. ఇండియా ఒకనాటి ఇండియా కాదు అన్న సందేశం, మోషా గార్ల పవర్ఫుల్ ప్రభుత్వ విధానం తెలవాలి, అప్పుడు వాళ్ళూ వాళ్ళు దగ్గర పెట్టుకుని మెలుకువతో ఉండొచ్చు (అయితే ఇండియా అంతర్గతంగా గౌ.మోషా గార్ల ఆటోక్రాటిక్ విధానాన్ని ఏపీకి చేస్తున్న అన్యాయముకు వారిని నేను సమర్ధించడం లేదు, అది వేరే ఆ వివరాలు ఇక్కడ అప్రస్తుతం, కానీ ఇండియాలో ఉన్నది పవర్ఫుల్ ప్రభుత్వం అనేది అంతర్జాతీయ సమాజంలో యుద్ధ, విదేశాంగ విధానం వరకూ మన దేశ ప్రతిష్టను పెంచుతుంది).

ఆప్ఘన్ లో 16 ఏళ్లలోపు జనాభా 50% వరకూ ఉంటారు, యుద్దాలు ఉన్నా, ఫెర్టిలిటీ రేట్, సగటు పిల్లలు చాలా ఎక్కువ 5.5 ఉంటుంది కొన్ని చోట్ల 9 కూడా వుంటుంది.( ఆంధ్రప్రదేశ్ లో, కేరళలో అది 1 లోపుకు వస్తుంది.. పొలికకు వ్రాసా). అక్కడ ఒక్కో మహిళ సరాసరి 6గురికి జన్మనిస్తుంది. కుటుంబ నియంత్రణ పాటించరు. జాతుల పరంగా చూస్తే పఠాన్, ఫష్ఠున్స్ 40% ఉంటే, తజిక్స్ 26%, ఉఙబెక్స్9%, హజారాలు 9% ఇక అనేక చిన్న గ్రూపులు ఇతరులు ఉంటారు. ఇండియా బోర్డర్* కి అనుకుని ఉన్న చోట్ల 90% తజిక్స్ ఉంటారు. దారి పర్షియన్ భాష తజిక్స్ ది. మత జిహాద్ పేరుతో వాళ్ళ మెదడుని కూడా పాడుచేసేందుకు యత్నాలు సాగుతున్నాయి. ఇండియా వారి అభివృద్ధి, ఉన్నతికి ప్రత్యేక దృష్టి పెట్టాలి. అయితే పఠాన్స్ కూడా అనాదిగా ఇండియాకు వ్యతిరేకం కాదు, సరిహద్దు గాంధీ, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, డాక్టర్ సాబ్ మొత్తం వారి NWFP మనదేశంలో కలపాలని ఆఖరివరకూ యత్నించారు.

ఒక ప్రజాస్వామ్య వాదిగా హిందు, ఇస్లాం, క్రీస్టియానిటీ, బుద్ధిజం, యూదులు అలా ఏ మతమైనా ఎవరున్నా తప్పులేదు. అది ఐచ్చికం అని. కానీ ఎవరైనా ఇతర మతాలపై ద్వేషం రెచ్చగొట్టడం, దాడులకు ప్రేరేపించడము అమానవీయం. స్టేట్ టెర్రరిజం అయితే ఇక విశ్వానికే ప్రమాదం. అది ఏ రూపంలో ఉన్నా, ఎక్కడున్నా సహించకూడదు.

ఏదిఏమైనా మన దేశానికి మరో సమస్య వచ్చి పడేట్లు ఉంది. దేశ నాయకత్వం మెలుకువతో ఉండాలి, మనం సూచనసలు చేసినా ఒకే కానీ, మనము మత సంయమనం పాటిస్తూనే ఇండియా త్యాగం చేసి ఆప్ఘన్లకు చేసిన మేలుని, మావవీయకోణాన్ని, గొప్పదనాన్ని ఎల్లెడెలా చాటాలి.

– చలసాని