వక్ఫ్ భూములు ఎక్కడివి?

318

వక్ఫ్ భూములు ఎక్కడివి? ఎలా వక్ఫ్ భూములు అయ్యాయి? వక్ఫ్ ఆస్తులు ఇన్ని లక్షల కోట్ల రూపాయల విలువ గల వేల ఎకరాల భూములు ఎక్కడివి ??? అస్సలు కథ ఏమిటీ ?

1947లో దేశ విభజన హిందూ ముస్లిం మతం ఆధారంగా జరిగినప్పుడు భారతదేశం లో ఉన్న ముస్లింలు కొంతమంది పాకిస్తాన్ దేశానికి వెళ్లిపోయారు. పాకిస్తాన్ లో ఉన్న హిందువులు భారతదేశానికి వచ్చారు. పాకిస్తాన్ దేశం నుండి వచ్చిన హిందువుల భూములను భారతదేశం నుండి పాకిస్తాన్దేశం వెళ్లిన ముస్లింలు ప్రయివేట్ గా ఎవ్వరికి వారు ఇష్టం ఉన్నట్టు ఆక్రమించుకున్నారు. పాకిస్తాన్ దేశం నుండి భారతదేశం వచ్చిన హిందువులకు ఒక్క ఎకరా కూడా ఇవ్వకుండా ఇక్కడి నుండి పాకిస్తాన్ దేశం వెళ్లిన ముస్లిం భూములను ప్రభుత్వం వక్ఫ్ బోర్డు పేరిట మళ్ళీ ముస్లిమ్స్ కే ఇవ్వడం జరిగింది…

పాకిస్తాన్ కి వెళ్లిన ముస్లింల భూములు ఒక్క ఎకరా కూడా ఇవ్వలేదు. పాకిస్తాన్ లో వదిలి వచ్చేసిన ఆస్తులకు ఒక్కరూపాయి కూడా నెహ్రూ, గాంధీల ప్రభుత్వాలు ఇవ్వలేదు. వాళ్ళను పూర్తిగా రోడ్డు మీద నిలువ నీడ లేకుండా చల్లటి చలికి పిల్లాపాపలతో ఉన్న ఆడవారిని కూడా దిక్కులేని వారిని చేసి అప్పటి అఖండ భారతదేశం లోని ధనిక హిందువులను కూడా రాత్రికి రాత్రి దేశ విభజన చేసి అడుక్కుతినే భిక్షగాళ్ళను చేసి గాలికి వదిలేశారు. ఇది కాంగ్రెస్ గాంధీ నెహ్రులు మత ప్రాతిపదికన హిందు దేశంగా ఏర్పాటైన దేశంలో ముస్లిం లపై వారిరువురికి అవినాభవ సంబందమేదైనా ఉందా ???

దేశ విభజనకు ముందు నుండి ఈ రోజు వరకు హిందూ సమాజం పై చేసిన ఆ పాపాన్ని, అన్యాయాన్ని, హక్కులను కాల రాస్తూనే ఉన్నాయి. ఈరోజు వరకు చాలా రాష్ట్ర ల్లోని సర్కార్లు.. కాంగ్రెస్ గాంధీ, నెహ్రూ ఇక్కడి నుండి వెళ్లిన ముస్లింల భూములు మాత్రం ప్రభుత్వం ఎవ్వరికి ఇవ్వకుండా పాకిస్తాన్ నుండి వచ్చిన హిందువులకు ఎలాంటి వసతులు కల్పించకుండా వదిలేసింది .

కాంగ్రెస్ ఇక్కడి నుండి వెళ్లిన ముస్లింల భూములు వక్ఫ్ బోర్డు పేరుతో తిరిగి వాళ్ళకే ఇచ్చింది. పైగా దేవాలయల భూములు మాత్రం ప్రభుత్వం అందరికి పంచిపెడుతుంది . కారణం ఇప్పటివరకు ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ సంతుష్టి కరణలే. రాజకీయాలను, రాజకీయ నాయకులను విమర్శలు చేసే బదులు సారా తీసుకొని డబ్బులు తీసుకోని మాకులం వాడు అనుకుంటూ సిగ్గులేకుండా ఓటు వేసే ప్రతి ఒక్క సనాతన హిందువులు మాత్రమే కారణం అనేది నాయొక్క అభిప్రాయం.

ఆలా పూర్తిగా పట్టించుకోకుండా వదిలిపెట్టిన వారికి కాశ్మీర్ లో 1947 నుండి మొదలుకుంటే 2019 ఆగస్ట్ 5వ తేదీ వరకు, 20లక్షల మందికి ఓటుహక్కు ఆస్థిహక్కు విద్యహక్కు ఎన్నికల్లో పోటీచేసేహక్కు లేకుండా వదిలేసింది కాంగ్రెస్ పార్టీ మరియు ఇన్నిరోజులు పాలన చేసిన సెక్యులర్ నాయకులు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి కొన్ని వందల్లో ఉన్నాయి.

– శ్రీధర్