ఏపీలో హిందువులకు, హిందూ ఆలయాలకు రక్షణ లేదు

192

-శ్రీనివాసానంద సరస్వతి

విశాఖ:ఆంధ్రప్రదేశ్‌లో హిందువులకు, హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. దేవాదాయ శాఖపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో చేతగాని ప్రభుత్వం నడుస్తోందని ఆయన అన్నారు. సీతారామ దేవస్థానం ధ్వజస్తంభం విరిగి పడడంతో తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతాన్ని స్వామీజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్వజస్తంభం దేవాలయానికి ప్రాణమని అన్నారు. ధ్వజస్తంభం స్థితిగతులు రికార్డుల్లో ఉంటుందని, దాని కాలప్రమాణం ఎంత? అనేది పరిశీలించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖ అధికారులకు ఉంటుందన్నారు. ధ్వజస్తంభం పరిస్థితి బాగోలేదని, పడిపోయే పరిస్థితి ఉందని స్థానికులు హెచ్చరించినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ ఘటనకు దేవాదాయ శాఖ మంత్రి బాధ్యత వహించాలని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు.