వంచనకు గురవుతున్న మహిళలకు అండగా నిలుస్తుంది

150

-వంగలపూడి అనిత

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కమిటీనీ శుక్రవారం తెలుగుమహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె జూమ్ ద్వారా తననివాసం నుంచి విలేకరులతో మాట్లాడుతూ, సామాజిక కోణంలో ఆలోచించి, తెలుగుమహిళ రాష్ట్రకమిటీలో అన్నివర్గాలు, అన్ని ప్రాంతాలవారికి ప్రాధాన్యత కల్పించినట్టు చెప్పారు. వందమందితో ఒక బృందాన్ని ఎన్నుకున్నమని, బడుగు, బలహీనవర్గాలవారికి టీడీపీ ఎప్పుడూ ప్రత్యేకస్థానం కల్పిస్తుందనడానికి తాజాగా ఎంపికచేసిన తెలుగుమహిళా బృందమే నిదర్శనమన్నారు.

బృంద ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారికి 65 శాతం ప్రాధాన్యతకల్పించి, సముచిత స్థానంఇచ్చామన్నారు. తెలుగుమహిళ కమిటీలో 35శాతం మాత్రమే ఓసీలకు ప్రాధాన్యత కల్పించనట్టు అనితచెప్పారు. మహళల అభ్యున్నతి, సంక్షేమంతోపాటు, వారి రక్షణకు మిక్కిలిప్రాధాన్యత కల్పించడంలో తెలుగు మహిళా విభాగం ముందుంటుందన్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం నుంచి కూడా మహిళలకు ప్రత్యేక స్థానాలిస్తూ, వారిని అన్నివిధాలా గౌరవిస్తున్నామన్న ఆమె, మహిళల రక్షణకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కట్టుబడే ఉంటుందన్నారు. తాను తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగమైన తెలుగుమహిళ రాష్ట్రఅధ్యక్షురాలిగా ఉన్నందుకు గర్వపడుతున్నానన్న అనిత, మహిళలకు, పేదలకు సేవచేసుకునే అవకాశం కల్పించినందుకు టీడీపీ జాతీయఅధ్యక్షులు చంద్రబాబునాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ, భద్రత, గౌరవం మర్యాదనేవి మచ్చుకైనా కనిపించడంలేదన్నారు. మహిళలకు సముచిత స్థానం కల్పించడడం సంగతి అటుంచి, ఆడబిడ్డలను రక్షించడంలో రాష్ట్రపాలకులు దారుణంగా విఫలమయ్యారని అనిత ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీప్రభుత్వంలో ఎప్పటినుంచో అమలుచేస్తున్న మహిళలకు 33 శాతం రిజర్వేషన్లనేవి ఈ ప్రభుత్వంలో అసలు అమలేకావడం లేదన్నారు. మోసపూరిత, దగాకోరు, అవినీతి ప్రభుత్వంలో అన్నివిధాలా, అత్యధికంగా నష్టపోతున్నది మహిళలేనని అనిత వాపోయారు. తెలుగుమహిళ రాష్ట్రకమిటీకి ఎంపికచేసిన సభ్యుల వివరాలను అనితప్రకటించారు.

తెలుగు మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాళ్ల వివరాలు…
అమలాపురం ముమ్మడివరం రామలక్ష్మి, అనకాపల్లి నుంచి కె. రత్నకుమారి, రంపచోడవరం నుంచి గొర్ల సునీత, కాకినాడ నుంచి మాజీ ఎమ్మెల్సీ వివకుమారి, పత్తిపాడు నుంచి బి. గంగ, పాలకొల్లు నుంచి రోజారమణి, కావలి నుంచి గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, రాజమండ్రి సిటీ నుంచి పార్వతి, టెక్కలి నుంచి విజయలక్ష్మి, భీమిలి నుంచి రమణమ్మ, బద్వేల్ నుంచి ఝాన్సీ యాదవ్, ఒంగోలు నుంచి ఆళ్ల రత్నమ్మ, గుంటూరు వెస్ట్ నుంచి పద్మావతి, విజయవాడ వెస్ట్ నుంచి ఆశా షేక్ లను ఉపాధ్యక్షులుగా ఎంపిక చేయడం జరిగింది.

జనరల్ సెక్రటరీగా అమలాపురం రాజోలు నుంచి భూదేవి మంగిన, అనంతపురం అర్బన్ నుంచి టి. స్వప్న, పాడేరు నుంచి విజయారాణి, రేపల్లె నుంచి జయప్రద, గన్నవరం నుంచి నాగకల్యాణి, మంగళగిరి నుంచి ఆకుల జయసత్య, తెనాలి నుంచి శ్రీదేవిలు సోషల్ మీడియా జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. చిలకలూరిపేట నుంచి షాహెద్ జైన్ సుల్తానా, సూళ్లురుపేట నుంచి ముప్పాల విజయరెడ్డిలు జనరల్ సెక్రటరిలుగా వ్యవహరిస్తారు.

అధికార ప్రతినిధులుగా విశాఖపట్నం నార్త్ నుంచి ఈతలపట్ల సుజాత, పాతపట్నం నుంచి నల్లి సుజాత, కొత్తపేట నుంచి మమత, గోపాలపురం నుంచి బెయిలుముడి సుధారాణి, అనపర్తి నుంచి బీరా వీణమ్మ, పెనమలూరు నుంచి యార్లగడ్డ సుచిత్ర, , నందిగామ నుంచి యార్లగడ్డ నూకమ్మ, గుంటూరు వెస్ట్ నుంచి విజయ, పరచూరు నుంచి సౌజన్య, మనికొండ నుంచి జాహ్నవి, తాటికొండ నుంచి శిరీష, దర్శి నుంచి మాలెపాటి వెంకట శోభారాణి, నగిరి నుంచి ఆర్. మీరా, కొడుమూరు నుంచి సీబీ లత, అనంతపురం అర్బన్ నుంచి స్వరూపలు అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. ఆర్గనైజర్ సెక్రటరి, సెక్రటరీలను కుడా ఎన్నుకోవడం జరిగింది. పార్వతీపురం నుంచి శ్రీదేవి ఆర్గనైజింగ్ సెక్రటరిగా, పలాస నుంచి ఝాన్సీ, గజపతి నగరం నుంచి రమణమ్మ, భీమిలీ నుంచి లీలావతి, యలమంచలి నుంచి కడియం అనురాధ, పత్తిపాడు నుంచి శ్యామలాదేవి, భీమవరం నుంచి కనకదుర్గ, రాజమండ్రి సిటీ నుంచి నిర్మల, చింతలపుడి నుంచి సౌభాగ్యవతి, తెనాలి నుంచి సరళాదేవి, పెదకూరపాడు నుంచి వైకుంఠ రాణి, బాపట్ల నుంచి ఎం. విజాత, ఒంగోలు నుంచి నర్సమ్మ, కనిగిరి నుంచి దోసపాటి శివకుమారి కొండేపి నుంచి రావిపాటి శీతమ్మ, నెల్లూరు సిటీ నుంచి నిర్మల, విజయవాడ ఈస్ట్ నుంచి చినతల్లి, మాదాల వెంకట రాజ్యలక్ష్మి వెస్ట్ నుంచి తుపాకుల రమణమ్మ, నంద్యాల నుంచి దూదేకుల ఝాన్సీ, ఆలూరు నుంచి సులక్షణా రెడ్డి, కల్యాణదుర్గం నుంచి బిక్కి రామలక్ష్మీ, కదిరి నుంచి బి. రమణ, ప్రొద్దుటూరు నుంచి డాక్టర్ మల్లెల లక్ష్మి, సర్వేపల్లి నుంచి భార్గవి, పీలేరు నుంచి సుభద్రమ్మ, చిత్తూరు నుంచి సీఎం విజయ, భీమిలి నుంచి లీలావతి, తిరుపతి నుంచి విజయలక్ష్మిలు ఆర్గనైజింగ్ సెక్రటరి లుగా ఉంటారు.

సెక్రటరీలుగా అరకు నుంచి పాయం దేవి, విజయనగరం నుంచి సూర్యకుమారి, తణుకు నుంచి రమణమ్మ, ఏలూరు నుంచి అచ్చుతా రాజేష్, విజయవాడ సెంటర్ నుంచి మద్దాల రుక్మిణి, పొన్నూరు నుంచి మాలినేని రుక్మిణి, మంగళగిరి నుంచి జానకీదేవి, తాడికొండ నుంచి రత్నకుమారి, ఆచంట నుంచి ఆదిలక్ష్మి, కనిగిరి నుంచి సుభాషిణి, వేముల నుంచి విజయనిర్మల, ఆళ్లగడ్డ నుంచి యాలాల నూర్జహాన్, ఆదోని నుంచి షాహిద్ బేగం, సింగనమలై నుంచి విశాలాక్షి, హిందూపురం నుంచి కె. పరిమళ, బనగానిపల్లె నుంచి ఫారూఖ్ బీ, సూళ్లూరుపేట నుంచి తుపాకుల కన్నమ్మ, రాజంపేట నుంచి ఓబినేని సుబ్బమ్మ, చంద్రగిరి నుంచి సింధూసుధ, చిత్తూరు నుంచి వైవి రాజేశ్వరి, హసీనాలు, గుంటూరు ఈస్ట్ నుంచి వాణి, తిరుపతి నుంచి కుమారి, గూడూరు నుంచి లీలావతి, ఆత్మకూరు నుంచి పి. శైలజారెడ్డి లు సక్రటరీలుగా వ్యవహరిస్తారు. మీడియా కోఆర్డినేటర్లుగా అనకాపల్లి సేనాపతి స్వరూప, అమలాపురం నుంచి సత్య పూర్ణిమ, విజయవాడ సెంట్రల్ నుంచి గాయత్రి, పాణ్యం నుంచి బత్తుల సుభద్రమ్మ, మదనపల్లె నుంచి తులసి వీరు ఐదుగురు మీడియా కో ఆర్డినేటర్ లుగా వ్యవహరిస్తారు.

అదేవిధంగా సోషల్ మీడియా కో ఆర్డినేటర్స్ కింద విజయనగరం నుంచి శుషారాణి, ఈస్ట్ గోదావరి గన్నవరం నుంచి రాజేశ్వరి, సత్యవేడు నుంచి మౌనిక, పుట్టపర్తి నుంచి ఎం. షకీలా లను ఎంపిక చేసినట్లుగా వివరించారు. వీరందరూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, మహిళల రక్షణ కోసం పాటుపడాల్సిందిగా పిలుపునిచ్చారు.