కేసీఆర్ రైతుబంధుపై.. ఆర్ నారాయణ మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు

321

సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం తెలంగాణాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది.ఈ దళిత బంధు పథకంతో ప్రతిపక్షాలన్నీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. తెలంగాణలోని దళితులు అంత కేసీఆర్ కి జేజేలు పలుకుతున్నారు. ఎలాగైతే కేసీఆర్ దళితుల సాధికారతను దృష్టిలో పెట్టుకుని దళితబందు ప్రకటించారో.. ఇప్పటికే రైతుల కోసం కూడా ఎన్నో విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టారు. అందులో ముఖ్యమైంది రైతుబంధు పథకం. అలాంటి ఈ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన కేసీఆర్ ని దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా ఎన్నో సార్లు మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ నుండి పీపుల్ స్టార్ గా గుర్తింపు పొందిన ఆర్ నారాయణమూర్తి కూడా తాజాగా రైతుబంధు పథకం పై ప్రశంసలు కురిపించాడు. R. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘రైతన్న’ చిత్రం ఆగస్టు 14న విడుదలవుతున్న సందర్భంగా.. ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన నారాయణ మూర్తి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై, రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు పథకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.