నెల్లూరులో రొట్టెల పండుగ..చరిత్రలో వాస్తవాలు!

247

నెల్లూరులోని బారా (12) షాహిద్ దర్గా, అక్కడ జరిగే రొట్టెల పండుగ,దాని వెనకాల ఉన్న చరిత్రలో వాస్తవాలు ఏమిటి ?ఇది తెలుసుకోవాలంటే ఇస్లాం మతం ఆవిర్భవించిన కాలం, తదుపరి చోటు చేసుకున్న పరిణామాలు గురించి తెలుసుకోవాలి.

ఇస్లాం మతం స్థాపించిన మహమ్మద్ ప్రవక్త గారి అల్లుడు పేరు ఇమామ్ అలీ. అయన పుత్రుడు ( ప్రవక్త మనవడు) పేరు ఇమాం హుస్సేన్.ప్రవక్త మహమ్మద్ మరణానంతరం ఇస్లాం మతానికి నేతృత్వం ఎవరు వహించాలి అన్న విషయమై వర్గ పోరు జరిగింది. ఒక వర్గానికి ఇమాం అలీ నాయకత్వం వహించారు. వీరు ఇస్లాం లో షియా వర్గంగా ఏర్పడ్డారు. జనవరి 29, 661 ACE తేదీన అయన మసీదులో తెల్లవారి ప్రార్ధనలు చేసుకుంటుండగా ఒక వ్యక్తి ఆయనను హతమార్చాడు. అక్టోబర్ 10, 680 ACE తేదీన ఇరాక్ దేశంలోని కర్బలా లో ఇమాం హుస్సేన్, ఖలీఫా యాజిద్ I మధ్య యుద్ధం జరిగింది.

ఇందులో ఇమామ్ హుస్సేన్ మరియు వారి వర్గం వారు చాలా మంది మరణించారు. మరణించినవారిలో 12 మంది శిరసులను ఖలీఫా యాజిద్ 800 km దూరంలో ఉన్న సిరియా దేశం, డమాస్కస్ నగరానికి తీసుకొచ్చి అక్కడ ప్రదర్శించారు. తరవాత కాలంలో ఈ 12 మందికి అక్కడి ఉమయ్యద్ మసీదు ప్రాంగణంలో స్మారక భవనం నిర్మించారు. మొహర్రం నెలలో కర్బలలో జరిగిన యుద్ధం, అందులో మరణించిన ఇమామ్ హుస్సేన్ ని స్మరిస్తూ శోకం తో జరుపుకునే పండుగ మొహర్రం. దీన్ని తెలుగు రాష్ట్రాలలో పీర్ల పండుగ అంటారు.ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియాలో ఈ పండుగ సందర్బంగా రోట్ అనే ప్రత్యేక రొట్టె చేసుకొని ఒకరికి ఒకరు పంచుకుంటారు.

ఇదంతా చదివాక బారా (12) షాహీద్ దర్గా, రొట్టెల పండుగ చరిత్రకి, భారత దేశానికి వేల కిలోమీటర్ల దూరంలో 1,340 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలకు దగ్గరి పోలిక ఉందా లేదా? అప్పటి సంఘటనలకు భారత దేశపు లొకేషన్, కారక్టర్స్ జోడించిన రీమేక్ లాగా అనిపిస్తోందా ?

బారా షహీద్ దర్గాహ్ స్థల పురాణం ప్రకారం ఎక్కడినించో 12 మంది మన దేశ రక్షణకోసం వొచ్చారని వారు పాలుగొన్న యుద్ధంలో వారి తలకాయలు నరకబడి ప్రస్తుతం నెల్లూరు బారా షాహీద్ దర్గాహ్ ఉన్న చోట వొచ్చి పడ్డాయి. వారు గుర్రాలు అక్కడికి వొచ్చి నించున్నాయి.
ఈ స్థల పురాణానికి ఎలాంటి చారిత్రాత్మిక, సాహిత్య సంబంధమైన, శిలాశాసన ఆధారాలు లేవు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడో కర్బలా లో జరిగిన ముస్లింల అంతర్గత వర్గ పోరు, ఒకరిని ఒకరు చంపుకోవటం, తలకాయల నరుక్కునే క్రూర ప్రక్రియ మన దేశంలో జరిగినట్టుగా చిత్రీకరించి ఒక బూటకపు చరిత్ర సృష్టించారా లేదా ? రక్తం ఏరులై పారిన ఈ క్రూర చరిత్రకి సనాతన ధర్మానికి ఏమిటి సంబంధం ?

మరొక స్థల పురాణంలో 12 మంది ఇస్లాం మత ప్రచారకులు టర్కీ దేశంనుంచి మన దేశానికి ఇస్లాం వ్యాప్తి చెయ్యటానికి వొచ్చారు. గంధవరం అనే ప్రాంతం చేరుకున్నప్పుడు అక్కడి హిందువులు వీరిని చంపేశారు. ఇక్కడ హిందువులకోసం వాడిన పదం జాలిం. దీని అర్ధం క్రూరుడు, కిరాతకుడు, నిష్కంటకుడు..! ఇప్పుడు ఇదే జాలింలు ఇక్కడ వేల సంఖ్యలో పూజలు చేస్తున్నారు. జాలిములు, కాఫిర్లు సమర్పించే కట్న కానుకలు స్వీకరించవొచ్చా ? హిందువులని ఇంతటి నీచమైన పదాలతో చిత్రీకరించినా కూడా హిందువులకు ఏమి బాద అనిపించట్లేదా ? మన ధర్మాన్ని నాశనం చెయ్యటానికి వొచ్చినవాడు అలీం, మనం జాలీమ్ … !

రాయలసీమలో హిందువులను పీర్ల పండుగ ఎందుకు జరుపుకుంటున్నారు అని అడిగితే – ” వెనకటికి మా పూర్వికులు అలీ, హుస్సేన్ అనే ఇద్దరు ముస్లింస్ని వెనకనుండి వెన్నుపోటు పొడిచి చంపేశారు, దానికి ప్రాయశ్చిత్తంగా మేము ఈ పండుగ జరుపుకుంటున్నాము” అని సమాధానం ఇచ్చారు. నాకు నవ్వాలో, ఏడవాలో తోచలేదు.

– రాంబాబు