మీ చేతికంటిన నెత్తురుని చంద్ర‌బాబుకి ఎలా పూశారు జ‌గ‌న్‌రెడ్డి?

275

-నారా లోకేష్

కోట్ల‌ కోసం సొంత‌బాబాయ్‌పై గొడ్డ‌లి వేటు వేసి.. మీ చేతికంటిన నెత్తురుని చంద్ర‌బాబు గారికి ఎలా పూశారు జ‌గ‌న్‌రెడ్డి గారూ? ర‌క్త‌సంబంధీకుడైన సొంత‌ బాబాయ్‌పై గొడ్డ‌లివేటు వేసి ఓట్ల కోసం నారాసుర‌ ర‌క్త‌చ‌రిత్ర అంటూ విష‌పుత్రిక సాక్షిలో అదే గొడ్డ‌లి చంద్ర‌బాబు గారి చేతిలో గ్రాఫిక్స్‌లో పెట్టి మ‌రీ అచ్చేయించిన మీ త‌ర‌త‌రాల వైఎస్సాసుర‌ ర‌క్త‌చ‌రిత్ర అంతా నేరాల‌మ‌యం అని మ‌రోసారి సీబీఐ ద‌ర్యాప్తుతో తేట‌తెల్ల‌మైంది. ఫ్యాక్ష‌న్ మీ బ్ల‌డ్ గ్రూప్‌. అరాచ‌కాల‌కు వైఎస్ ఫ్యామిలీ కేరాఫ్ అడ్ర‌స్‌. దాడులు, దౌర్జ‌న్యాలు, క‌బ్జాల‌పై వైఎస్ కుటుంబానికి పేటెంట్ హ‌క్కులున్నాయి. వైఎస్ వంశ ర‌క్త‌చ‌రిత్ర‌కి తాజా సాక్ష్యం అదే కుటుంబానికి చెందిన‌ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌. వైఎస్ కుటుంబ‌స‌భ్యులు ఒక్కొక్క‌రినీ సీబీఐ పిలిపిస్తుంటే..అది ఇంటి గొడ్డ‌లేన‌ని..సొంతింటి వేట‌కొడ‌వ‌లే వివేకాని వేటాడింద‌ని స్ప‌ష్టం అవుతోంది. డ‌బ్బు, ఆధిప‌త్యం, గ‌నులు, అక్ర‌మాల కోసం సొంత బాబాయ్‌నే చంపుకున్న వైఎస్సాసుర కుటుంబ‌ ర‌క్త‌చ‌రిత్ర‌ని నీ దొంగ పేప‌ర్ సాక్షిలో ఎలా అచ్చేస్తావో చూస్తాను జ‌గ‌న్‌రెడ్డీ!