క్రీడా దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాసు

237

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గురజాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గురజాల నియోజకవర్గ క్రీడా సభ్యులకు క్రీడా దుస్తులను స్థానిక శాసనసభ్యులు కాసుమహేష్ రెడ్డి, స్కాలర్స్ విద్యా సంస్థల డైరెక్టర్లు జి.శ్రీనివాసరెడ్డి, జగదీశ్వరరెడ్డి, స్కాలర్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆవుల. జనార్దన్, కామినేని స్కాలర్స్ ప్రిన్సిపాల్ గాదె.బ్రహ్మారెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొని క్రీడాకారులకు దుస్తుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ పల్నాడు ప్రాంత క్రీడాకారులు ఉన్నత స్థాయిలో రాణించాలని, పల్నాడుకు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. పల్నాడు ప్రాంత క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్న స్కాలర్స్ విద్యా సంస్థల నిర్వాహకులు అభినందనీయులని అన్నారు. ఈ సందర్భంగా జి.పి.రెడ్డి గ్రూప్ విద్యా సంస్థల అధినేత జి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నరసరావుపేటలో ప్రారంభం కాబోతున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కి తమ విద్యా సంస్థ తరఫున జి.పి.రెడ్డి ఆధ్వర్యంలో క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా సుమారుగా 50 వేల రూపాయలు విలువ చేసే క్రీడా దుస్తులు, టోర్నమెంటు ఎంట్రీ ఫీజుకు సంబంధించి స్పాన్సర్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కె.శ్రీనివాసరెడ్డి, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రామారావు, పట్టణ క్రీడాకారులు పాల్గొన్నారు.