“మీకో ప్రేమ కథ చెప్పాలి ..” రికార్డింగ్ ప్రారంభం …

705

ఈరోజు ఉదయం 9.13 ని లకు మధురానగర్ తరంగి స్టూడియోలో “మీకో ప్రేమకథ చెప్పాలి..” సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు .. ప్రణతి క్రియేషన్స్ బ్యానర్ పై కూనిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా రికార్డింగ్ ప్రారంభమైంది ..శ్రీహరి రచన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రతన్ తివిక్రమ్, మంజు హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు .. జాక్ ఆనంద్ సంగీతంలో ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రూపొందిస్తున్నామని నిర్మాత తెలిపారు …. ప్రముఖ మాటల పాటల రచయిత భారతీబాబు , తరంగి స్టూడియో అధినేత రామ్ కనక్ , ఈ చిత్ర నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు … ఫీల్ గుడ్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం చెన్నై , హైదరాబాద్ నగరాలలో త్వరలో షూటింగ్ జరుపుకోనున్నదని చిత్ర నిర్మాత తెలిపారు.