క్రైమ్ థ్రిల్లర్ సినిమాలా వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ

180

• వివేకా కుమార్తె ఇచ్చిన అనుమానితుల జాబితాలోని వారిని ఇంతవరకు ఎందుకు విచారించలేదు?
• వివేకా హత్యకేసులో ప్రధాన సూత్రధారులైన విజయసాయిరెడ్డి, వై.ఎస్. అవినాశ్ రెడ్డిలను తక్షణమే విచారించాలి.
• అవసరమైతే వారికి లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలి.
• వివేకా చంపబడినరోజు రాత్రి ఏం జరిగిందో తెలియాలంటే, ఆయన కాల్ లిస్ట్ బయటపెట్టాలి.
• వివేకా హత్యతో ఎవరికి ప్రయోజనం, ఎవరు ఏం ఆశించి ఆపనిచేయించి, నింద చంద్రబాబుపైకి నెట్టాలని చూశారో తేల్చాలి.
• సునీల్ యాదవ్ కుటుంబసభ్యులు వివేకా హత్య గురించి జగన్ కు తెలుసనిచెబుతుంటే, ముఖ్యమంత్రిని ఎందుకు విచారించడం లేదు?
• రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పిన తరుణంలో, వివేకా హత్యకేసు విచారణలో సీబీఐ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.
• హత్య చేసిన వారితో పాటు, సాక్ష్యాలను రూపుమాపాలని చూసినవారిని ఎందుకు విచారించలేదు?
• దేవిరెడ్డి, మణికంఠారెడ్డి లు తనఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారని సునీత చెబుతుంటే, ఆ దిశగా సీబీఐ ఎందుకు దృష్టి సారించదు?
• వివేకాహత్యకేసులో సీబీఐ చిట్టెలుకలను బలిచేయకుండా, సింహాలనే బంధించాలి.
• సునీత రెడ్డి ప్రాణాలకు హాని ఉందని ఆమే చెబుతున్నాకూడా పోలీసులు, సీబీఐ సీరియస్ గా తీసుకోవడం లేదు.
* టీడీపీ మాజీమంత్రి కే.ఎస్.జవహర్

శుక్రవారం ఆయన తన నివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.
గొడ్డలి దెబ్బలను గుండెపోటుగా చిత్రీకరించాలని విజయసాయిరెడ్డి, వై.ఎస్. అవినాష్ రెడ్డిలు ఎందుకు ప్రయత్నించారని, అసలు గొడ్డలిదెబ్బలకు, గుండె పోటుకి ఉన్న సంబంధమేంటనే దిశగా సీబీఐ అధికారులు ఎందుకు విచారణ జరపడంలేదని జవహర్ ప్రశ్నించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి బాబాయి చంపబ డితే, ఇంతవరకు నిందితులెవరో పట్టుకోలేకపోయారనేదానిపై దేశమంతా చర్చ జరుగుతోందన్నారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇచ్చిన జాబితాలోని 15 మంది అనుమానితులను కూడా విచారించలేదన్నారు.

వివేకానందరెడ్డి లాంటి సింహాన్ని సునీల్ యాదవ్ లాంటి చిట్టెలుక ఎలా చంపుతుందని, స్వయంగా సునీల్ యాదవ్ కుటుంబసభ్యులే వాపోతున్నారని, వారుచెప్పిన సింహాలు ఎవరనే దిశగా సీబీఐ ముందుకెళ్లడం లేదన్నారు. వివేకా హత్యకేసులో విజయసాయిరెడ్డి పాత్రను అనుమానించాల్సిందేనని జవహర్ తేల్చిచెప్పారు. వివేకానందరెడ్డి చంపబడిన రోజు రాత్రి ఎవరెవరితో మాట్లాడారనే దానిపై కూడా దృష్టిపెట్టాలన్నారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించి, సానుభూతికోసం వివేకానందరెడ్డిని చంపారా..లేక ఎన్నికల్లో లబ్ధిపొందడానికి చంపారా.. ఇందులో జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితప్రమేయం ఎంతుందో తేలాలన్నారు. వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఇంటిపక్కన రెక్కీ నిర్వహించి వ్యక్తి ఎవరు…. అతన్ని గతంలో తాను వేరే వ్యక్తికి సంబంధించిన ప్లెక్సీలో చూశానని ఆమెచెప్పడం పలు అనుమా నాలకు తావిస్తోందన్నారు. బాబాయి కూతురు, సొంతచెల్లెలకే రక్షణకల్పించలేని ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ఆడబిడ్డలను రక్షిస్తాడంటే ప్రజలెలా నమ్ముతారన్నారు.

గతంలోకూడా జగన్మోహన్ రెడ్డి తొలుత సీబీఐ విచారణ జరిపించాలని, కోర్టులో పిటిషన్ వేసి, తరువాతదాన్ని ఆయనే ఉపసంహరించుకున్నాడని, అదంతా చూస్తుంటే, వివేకాహత్యకేసులో జగన్ కుట్రకోణం కూడా దాగి ఉందేమోననే తమకు అనిపిస్తోందన్నారు. వివేకా హత్య జరిగినప్పుడు సాక్షిపత్రికలో నారాసుర చరిత్ర అని తప్పుడు కథనాలు రాయించారని, కానీ అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రక్తచరిత్ర మొదలైందే వై.ఎస్ కుటుంబంనుంచని జవహర్ మండిపడ్డారు. రాజారెడ్డి హాయాంలో గనులయజమానులు హత్యలు, మొద్దుశీనుహత్య, పరిటా ల రవిహత్య, హైదరాబాద్ లో జరిగిన అల్లర్లు, ముదిగొండలో అమాయకులను పొట్టనపెట్టుకున్న ఘటలన్నీ తమవాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయన్నారు. అసత్యాల అసాక్షి పత్రికలో అన్నీ అవాస్తవాలే రాశారని, హత్యచేసింది ఒకరైతే, దాన్ని ఇతరులకు ఆపాదించడానికి ప్రయత్నించారన్నారు. హత్యగురించి తప్పుడు కథనాలు రాసిన సాక్షి పత్రిక వారిని కూడా సీబీఐ విచారించాలన్నారు.

ప్రధానసూత్రధారులైన విజయసాయిరెడ్డి, అవినాశ్ రెడ్డిలను సీబీఐ తక్షణమే విచారించాలని, అవసరమైతే వారికి లైడిటెక్టర్ పరీక్షకూడా చేయాలని జవహర్ డిమాండ్ చేశారు. వివేకాహత్య అనంతరం సాక్ష్యాలను తారుమారు చేసిందెవరు.. ఎవరి ప్రమేయంతో వారు ఆపనిచేశారనే దానిపై లోతైన విచారణజరగాలన్నారు. అసలు దోషులు ఎంతటివారైనా, వారిని విచారణకు పిలవాల్సిన బాధ్యత సీబీఐ దేనని జవహర్ తేల్చిచెప్పారు. వివేకాహత్యకు వాడిన ఆయుధాలు ఎక్కడున్నా యి… గొడ్డలిపోటుని గుండెపోటుగా చిత్రీకరించింది ఎవరు అనేవన్నీ బయటకు రావాలన్నారు.

తనతండ్రి హత్యకేసు విచారణ జరుగుతున్న సమయంలోనే దేవిరెడ్డి, మణికంఠారెడ్డి అనేవారు తనఇంటిదగ్గర రెక్కీ నిర్వహించినట్లు వివేకా కుమార్తె సునీత చెబుతోందని, ఆమెకు తగిన భద్రతకల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. వివేకానందరెడ్డిది హత్యేనని ప్రజలంతా నమ్ముతు న్నందున, సీబీఐ చిట్టెలుకలను వదిలేసి, సింహాలను బంధించాలన్నారు. సునీతా రెడ్డే తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, స్వయంగా ఎస్పీని కలిసి ఫిర్యాదుచేశాడని, ఆమె విజ్ఞప్తిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి,తగు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.