పెద్ద రాష్ట్రాలను విభజించి 50 రాష్ట్రాలుగా మార్చాలి

161

-మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి పెద్ద రాష్ట్రాలను విభజించి భారతదేశాన్ని 50 రాష్ట్రాలు గా రూపొందిస్తేనే ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలకు అందుతాయని మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు.

గుంటూరు లోని మద్య విమోచన ప్రచార కమిటీ హాలులో నిర్వహించిన 75 సంవత్సరాల స్వాతంత్రం – ప్రపంచ అభివృద్ధి లో మన స్థానం అనే అంశంపై జరిగిన చర్చాగోష్టి కి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.చర్చాగోష్టి కార్యక్రమాన్ని ప్రారంభించిన డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రసంగిస్తూ కులాలకు,మతాలకు అతీతంగా లౌకిక రాజ్యానికి పునాదులు వేసిన మహాత్మా గాంధీజీ, డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ లను భారత సమాజం నిరంతరం జ్ఞప్తి కి తెచ్చుకోవాలన్నారు.కరోనా నేపథ్యంలో సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రవేశపెట్టి కోట్లాది మందికి అందించడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కరోనాను ఎదుర్కోగలిగన్నారు. పేర్కొన్నారు.

శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు ప్రసంగిస్తూ 1945 తరువాత ప్రపంచంలో 150 దేశాలకు స్వాతంత్రం లభిస్తే అందులో ఒకటిగా ఉన్న భారత దేశంలో ప్రజాస్వామ్యం విజయవంతంగా స్థిరీకరించబడిందన్నారు.ఎన్ని లోపాలు ఉన్న ఇండియా లో ప్రజాస్వామ్యం వికసిస్తుందని 1990 తరువాత సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో రాజకీయ రంగం లో కూడా కార్పొరేటీకరణ జరిగి ధన ప్రభావం పెరిగిందన్నారు. ఎన్నికలసంస్కరణలు జరగాలని ప్రధానంగా దామాషా ప్రాతినిద్యపు ప్రజాస్వామ్యం అమలులోకి రావాలన్నారు.నాగార్జున విశ్వవిద్యాలయ జర్నలిజం ప్రొఫెసర్ అనిత .
నాగార్జున విశ్వవిద్యాలయ రాజనీతి శాస్త్ర ఆచార్యులు ప్రొ వజ్రాల అంజి రెడ్డి చర్చాగోష్టి కార్యక్రమంలో జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం మాలిక్,రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ సిహెచ్ చక్రపాణి,చరిత్ర అధ్యాపకులు డా “పాలేటి పోతురాజు,రిటైర్డ్ ప్రిన్సిపాల్ దేవరపల్లి పేరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.