పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ సవాంగ్

132

పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించనున్నామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీవీఐపీ, వీఐపీలతో పాటు కొంతమంది సామాన్యులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఒకవేళ వర్షం కురిసినా కార్యక్రమానికి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పంద్రాగస్టు వేడుకలలో కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపడతామని డీజీపీ వ్యాఖ్యానించారు.